Vepada farm advisory-సుస్థిర వ్యవసాయ కేంద్రం-వేపాడ మండలం లో రాగల ఐదు రోజులు వాతావరణ సూచన – 1-4mm మొతాదులో ఆకాశం మేఘవృతమై ఉండి వేరు వేరు ఛోట్ల తెలికపాటి వర్షం కురిసే సూచన ఉంది. గరిష్ట ఉష్ణోగ్రత 33-34డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 22-23డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. గాలి గంటకి 9-12km వేగంతో తూర్పు నుండీ వాయువ్య దిశగా వీయ్యవచ్చు. గాలిలో తేమసాతం 59-70% ఉండవచ్చును.
👉 Sksr పురం,K.G పూడి క్లస్టర్లలో ప్రధాన పంట అయిన వరిలో నల్లి పురుగులు పొట్ట దసలలో ఉన్న వరి పైరుపై చేరి గింజల లోపల అండాశయాన్ని, పుప్పొడిని నష్టపరచటం వలన వెన్నులో అక్కడక్కడ తాలు గింజలు ఏర్పడి ఊదా రంగు మచ్చలు ఏర్పడుతున్నాయి.దీ నిని నల్లకంకి అని కూడా అంటారు కావున రైతులు ఈ లక్షనాలు గల గింజలు కనిపించినట్టైతే పంచపత్ర కషాయం పిచికారి చేయవలెను.
👉 మరియు వరిలో పొడ తెగులు,అగ్గి తెగులు,ఆకు యెండు తెగులు నివారణకు రైతులు గట్లపై కలుపు మొక్కలను తీసి , పశువుల పెడ-మూత్రం-ఇంగువ ద్రావణం పిచికారి చేయవలెను.
👉అలాగే pkr పురం, Sksr పురం గ్రామలలో బెండలో సెర్కోస్పోరా ఆకు మచ్చ తెగులు ఉదృతి ఉన్న0దువలన రైతులు 6lt పుల్లటి మజ్జిగలో 100gmల ఇంగువను 100lt నీటికి కలుపుకొని పిచికారి చేసుకోగలరు.
👉Pkr పురం, సారవానిపాలెం, కోటయ్యగరువు,చిట్టివానిపాలెం గ్రామాలలో బరబాటి,చిక్కుడు లో పేను బంక నివారణకు వేపనూనెను లేధా నీమాస్త్రం పిచికారి చేసుకొని నివారించవచ్చును.
👉అలాగే వరి పొలాల్లో ఎలుకలు నివారణకు రైతులు ఎకరానికి 4పచ్చి బొప్పాయి కాయలను తీసుకోని చిన్న చిన్న ముక్కలుగా కోసి పొలం గట్లపై చల్లాలి. పచ్చి బొప్పాయిలో ఉన్న ఒక రసాయనం ఎలుక నోటి కండరాలకు హానీ కలుగచేస్తుంది లేధా సిమెంట్ ను,మైదా పిండిని సమబాగాల్లో కలిపి పొట్లాలు కట్టి కలుగుల వద్ద ఉంచితే అవి తిన్న ఎలుకల నోటి భాగాలు పిడచగట్టుకుపోయి నశిస్థాయి.
👉 మరింత సమాచారం కోసం 8500983300 ఈ నంబర్‌ను సంప్రదించగలరు
About the author