Monthly Archive March 18, 2023

11-2023(18/03/2023)Vepada Farm Advisory

Date:18/03/2023

Centre for Sustainable Agriculture

సుస్థిర వ్యవసాయ కేంద్రం-వేపాడ మండలం లో రాగల ఐదు రోజులు వాతావరణ సూచన – ఆకాశం పాక్షికంగా మేఘవృతమై ఉండి 12-42mm మోతదులో తెలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే సూచన ఉంది.
గరిష్ట ఉష్ణోగ్రత 30-33డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 18-21డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. గాలి గంటకి 7-9km వేగంతో తూర్పు నుండి ఆగ్నేయం దిశగా వీయ్యవచ్చు. గాలిలో తేమసాతం 68-74% ఉండవచ్చును.
👉🏻KG పూడి, కోటయ్యగరువు,SKSR పురం,చిట్టివానిపాలెం, వెంకయ్యపాలెం, పోతుబంధీ పాలెం గ్రామలలో ప్రస్తుత వాతవరణ పరిస్తుతులు వలన మామిడిలో పండు ఈగ వచ్చె అవకాశం ఉంది కావున రైతులు పండు ఈగ ఉచ్చులను ఎకరానికి 6-8 అమర్చవలెను అలాగే జీడి మరియు మామిడిలో రసం పీల్చు పురుగులు నివారణకు రైతులు పొగలు పెట్టడం ద్వార కొంత నివారణ చేయవచ్చును మరియు పసుపు , తెలుగు జిగురు అట్టలను ఏర్పరచవలెను.
👉🏻Sksr పురం, PKR పురం, సోంపురం, జగ్గయ్యపేట, చామలపల్లి గ్రామాల్లో కురగాయలు లో రసం పీల్చు పురుగులు నివారణకు ఎకరానికి 20-25చొప్పున జిగురు అట్టలును ఏర్పరచి, వేపనునే పిచికారి చేయవలెను. అలాగే మిరపలో తామర పురుగులు నివారణకు ఎకరానికి15-20 వరకు నీలం జిగురు అట్లను ఏర్పరచి వేపనూనె పిచికారి చేయవలెను
👉 మరింత సమాచారం కోసం 8500983300 ఈ నంబరును సంప్రదించగలరు.