About WordPress
WordPress.org
Documentation
Learn WordPress
Support
Feedback
Log In
Register
Search
Skip to content
Kisan Mitra
a helping hand for farmers
Toggle navigation
Farmer Service Centres
Kisan Mitra Helpline
Farm Advisories
Reports
Updates
About Kisan Mitra
Monthly Archive June 29, 2022
Home
  /  
2022
  /  
June
26-1(29-6-2022) Vepada Farm Advisory
Date: 29-6-2022
Centre for Sustainable Agriculture-Vepada farm advisory
వేపాడ మండలం లో రాగల ఐదు రోజులు వాతావరణ సూచన – 21-63mm మొతాదులో చిరుజల్లుల నుండి మోస్తరు వర్షాలు కురిసే సూచన ఉంది. గరిష్ట ఉష్ణోగ్రత 36 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 24-25డిగ్రీలు గా ఉండే అవకాశం ఉంది. గాలి గంటకి 8-11km వేగంతో నైరుతి దిశగా వీయవచ్చు. కె.జి.పూడి,SKSRపురం, క్లస్టర్లలో ఉన్న రైతులు కూరగాయలు సాగుచేయాలనుకునే రైతులు బీజామృతం తో నాారుశుద్ధి చేసుకొని నాటుకోవలెను. నాారుశుద్ధి చేసుకోనుటకు 2lt ఆవు మూత్రం,1కిలో పశువులపెడ, 1కిలో పుట్టమన్ను కలిపి ద్రావణం తయారు చేసుకుని నాట్లు వేసేముందు నారును అరగంట పాటు ఆ ద్రావణంలో ఉంచిన తర్వాత నాటవలెను. రైతులు విత్తనశుద్ధి చేసుకోవటం వల్ల పంటకాల0లో ఆశించే చీడపీడలను చాలావరకు నివారించవచ్చు.అలాగే వేరుసెనగ వేసుకోవాలనుకునే రైతులు బీజరక్ష తో విత్తనశుద్ధి చేసుకోవలెను.మరింత సమాచారం కోసం 8500983300 ఈ నంబర్ కు కాల్ చేయండి.
25-2(25-6-2022) Vepada Farm Advisory
Date: 25-6-2022
Centre for Sustainable Agriculture-Vepada farm advisory
వేపాడ మండలం లో రాగల ఐదు రోజులు వాతావరణ సూచన – 22-29mm మొతాదులో చిరుజల్లుల నుండి మోస్తరు వర్షాలు కురిసే సూచన ఉంది. గరిష్ట ఉష్ణోగ్రత 36 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 24-25డిగ్రీలు గా ఉండే అవకాశం ఉంది. గాలి గంటకి 10-14km వేగంతో నైరుతి దిశగా వీయవచ్చు. కె.జి.పూడి,SKSRపురం, క్లస్టర్లలో ఉన్న రైతులు వరి సాగు చేసుకునే పద్దతి బట్టి విత్తనమోతధు ఎకరానికి మారుతూ ఉంటుంది. శ్రీ వరి పద్దతిలో సాగు చేస్తున్నట్టయితే ఎకరానికి 2కేజీలు సరిపోతుంది. నీటి ముంపు పద్దతికి 30 కిలోలు, అలాగే డ్రమ్ సీడర్ పద్ధతిలో సాగు చేసుకునేందుకు 8-10 కిలోలు విత్తనం అవసరం. అలాగే రైతులు విత్తనం విత్తేముంధు ఆవుముత్రంతో గాని, పశువుల పెడ మరియు మూత్రంతో గాని, వస కషాయంతో గాని, సూడోమోనస్తో విత్తనశుద్ధి చేసుకోవలెను. రైతులు విత్తనశుద్ధి చేసుకోవటం వల్ల పంటకాల0లో ఆశించే చీడపీడలను చాలావరకు నివారించవచ్చు.మరింత సమాచారం కోసం 8500983300 ఈ నంబర్ కు కాల్ చేయండి.
25-2022(23-06-22)Vempalli Farm Advisory
వేంపల్లె మండలం లో రాగల 5 రోజుల వాతావరణ సూచన – గరిష్ట ఉష్ణోగ్రత -36 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 20 డిగ్రీలు గా వుండే అవకాశం వుంది. రాగల 5 రోజులలో 11 mm వర్ష పా తం రాగల దని సూచన , అలాగే గంటకి 19 కి.మి. వేగంతో పడమర దిశా గ గాలి వీయవచ్చు .
టివి పల్లె క్లస్టర్ లోనీ కుప్పలపల్లి , వెళమవారిపల్లి,ముస్లరెడ్డి గారి పల్లె గ్రామాలలో ప్రధాన పంట అయినటువంటి పత్తి పంట లో ప్రస్తుతం ఆకుల అడుగు
భాగాన రసం పీల్చు పురుగుల ఉదృతి తక్కువ గా ఉంది.దీనిని నివారణ చేయడానికి ఒక ఎకరానికి పసుపు జిగురు పల్లాలు 25 నుండి 30 వరకు పెట్టాలి. తరువాత వేపనూనె ఒక ట్యాంక్ కు 30 ml చొప్పున వేసుకోవాలి. వేపనూనె నీటిలో కలవడానికి శాంపు ప్యాకెట్ వేసుకొని మిక్స్ చేసుకొని పిచికారీ చేయాలి.ఈ విధంగా చేయడం వలన పురుగుల ఉదృతి నివారణ అవుతుంది. అలాగే చీనీ,నిమ్మ పంటలలో ఇగురు వచ్చే సమయంలో పెను బంక ఉంది.దీని నివారణకు వేపనూనె ట్యాంక్ కు 35ml వేసుకొని పిచికారీ చేయాలి. అలాగే ఇప్పుడు పత్తి నాటే ప్రతి రైతు తప్పనిసరిగా విత్త నాలు నాటే ముందు బీజమృతం లేదా టీ విరిడి తో విత్తన శుద్ధి చేసి వేసుకోవడం వలన భూమి నుండి వచ్చే తెగుళ్లు, అలాగే విత్తనం నుండి సంక్రమించే తెగుళ్లను నివారించవచ్చు.అలాగే పంటకు చుట్టూ బార్డర్ క్రాప్ గా జొన్న,సజ్జ వేసుకోవడం వలన పక్క పొలం నుండి వచ్చే పురుగు లను,తెగుళ్లను నివారించ వచ్చు మరియు అంతర పంటలు మరియు ఎర పంటలు వేసుకోవా లి (బెండ ). మరింత సమాచారం కొరకు 8500983300 ఈ నంబర్ కు కాల్ చేయండి. అలాగే వేంపల్లి రైతుల ఉత్పత్తిదారుల సంఘం లో పశువులకు కావలసిన దాణా, పంటలకు కావలసిన జిగురు పల్లాలు,లింగ ఖర్షకా బట్టలు అందుబాటు లో ఉన్నాయి.కావలసిన వారు సంప్రదించాల్సిన నంబర్ 6300235907.
25-1(22-6-2022) Vepada Farm Advisory
Date: 22-6-2022
Centre for Sustainable Agriculture-Vepada farm advisory
వేపాడ మండలం లో రాగల ఐదు రోజులు వాతావరణ సూచన – 18-33mm మొతాదులో చిరుజల్లుల నుండి మోస్తరు వర్షాలు కురిసే సూచన ఉంది. గరిష్ట ఉష్ణోగ్రత 31-33 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 21-25డిగ్రీలు గా ఉండే అవకాశం ఉంది. గాలి గంటకి 6-11km వేగంతో నైరుతి దిశగా వీయవచ్చు. కె.జి.పూడి,SKSRపురం, క్లస్టర్లలో ఉన్న రైతులు ప్రధాన పంటగ వరి లేధా ఇతర పంటలకొరకు విత్తనం సిద్దం చేసుకోవాలనుకునే రైతులు మేలైన విత్తనం అవునో కాదో తెలుసుకొనుటకు విత్తనపరీక్ష చేసుకోవలెను. రైతులు యెంచుకున్న విత్తనాన్ని మొలకశతం తెలుసుకున్న తర్వాతనే నారు పోసుకోవాలి లేనిచో విత్తనంలో లోపం ఉన్నా, మొలక శాతం తక్కువగా ఉన్న నారుమడిలో వేసిన విత్తనం వృధా అవుతోంది. విత్తనానికి తగిన పోషకాలు లభించే విధ0గా నారు మడి నేలను సారవంతం చేయాలి. మరీ ఎక్కువ లోతుగా నేలను దున్నకపోవటం మంచిది. విత్తనం విత్తుకునేముందు బీజామృతంతో విత్తన శుద్ధి చేసుకోవాలి. . మరింత సమాచారం కోసం 8500983300 ఈ నంబర్ కు కాల్ చేయండి.
24-2(18-6-2022)Vepada Farm Advisory
Date: 18-6-2022
Centre for Sustainable Agriculture-Vepada farm advisory
వేపాడ మండలం లో రాగల ఐదు రోజులు వాతావరణ సూచన – 6-66mm మొతాదులో చిరుజల్లుల నుండి మోస్తరు వర్షాలు కురిసే సూచన ఉంది. గరిష్ట ఉష్ణోగ్రత 35-36 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 24-26డిగ్రీలు గా ఉండే అవకాశం ఉంది. గాలి గంటకి 6-15km వేగంతో నైరుతి దిశగా వీయవచ్చు. కె.జి.పూడి,SKSRపురం, క్లస్టర్లలో ఉన్న రైతులు ప్రధాన పంటగ వరి వేసుకుంటున్నట్లయితె విత్తన ఎంపికలో చాలా జాగ్రత్త అవసరం.మంచి పంటకు మంచి విత్తనమే మేలు. పంట కాలం, నీటి అందుబాటు, నేల స్వభావం, స్థానిక వాతావరణ పరిస్తితులను బట్టి విత్తన ఎంపిక అధరపడి ఉంటుంది. వరిలో మధ్యస్థ సన్న రకమైన MTU 1121 స సుడిధోమ, అగ్గి తెగులును తిట్టుకొని 120రోజుల కాల వ్యవధిలో దిగుబడిని ఇస్తుంది. సోనా మసూరి,సాంబ మసూరి, స్వర్ణ వంటి సన్నని రకాలు 140-150రోజుల కాలవ్యవధి లో దిగుబడిని ఇస్తాయి. వీటిలో స్వర్ణ ఆకు ముడత వ్యాధిని తట్టుకుంటుంది మరియు సోనమసూరి అగ్గి తెగులు,ఉల్లి కోడును , సాంబా మసూరి రకం సుడిధోమ, ఉల్లికోడు,అగ్గి తెగులును తట్టుకునే శక్తి కలవు. మరింత సమాచారం కోసం 8500983300 ఈ నంబర్ కు కాల్ చేయండి.
24-2022(17-06-22)Vempalli Farm Advisory
వేంపల్లె మండలం లో రాగల 5 రోజుల వాతావరణ సూచన – గరిష్ట ఉష్ణోగ్రత -37 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 22డిగ్రీలు గా వుండే అవకాశం వుంది. రాగల 5 రోజులలో 42 mm వర్ష పా తం రాగల దని సూచన గంటకి 11 కి.మి. వేగంతో పడమర దిశా గ వీయవచ్చు .
టివి పల్లె క్లస్టర్ లోనీ కుప్పలపల్లి , వెళమవారిపల్లి,ముస్లరెడ్డి గారి పల్లె గ్రామాలలో ప్రధాన పంట అయినటువంటి పత్తి పంట లో ప్రస్తుతం ఆకుల అడుగు
భాగాన రసం పీల్చు పురుగుల ఉదృతి ఎక్కువగా ఉంది.దీనిని నివారణ చేయడానికి ఒక ఎకరానికి పసుపు జిగురు పల్లాలు 25 నుండి 30 వరకు పెట్టాలి. తరువాత వేపనూనె ఒక ట్యాంక్ కు 30 ml చొప్పున వేసుకోవాలి. వేపనూనె నీటిలో కలవడానికి శాంపు ప్యాకెట్ వేసుకొని మిక్స్ చేసుకొని పిచికారీ చేయాలి.ఈ విధంగా చేయడం వలన పురుగుల ఉదృతి నివారణ అవుతుంది. అలాగే చీనీ,నిమ్మ పంటలలో ఇగురు వచ్చే సమయంలో పెను బంక(చెక్కర తెగులు) ఉంది.దీని నివారణకు వేపనూనె ట్యాంక్ కు 35ml వేసుకొని పిచికారీ చేయాలి. అలాగే ఇప్పుడు పత్తి నాటే ప్రతి రైతు తప్పనిసరిగా విత్త నాలు నాటే ముందు బీజమృతం లేదా టీ విరిడి తో విత్తన శుద్ధి చేసి వేసుకోవడం వలన భూమి నుండి వచ్చే తెగుళ్లు, అలాగే విత్తనం నుండి సంక్రమించే తెగుళ్లను నివారించవచ్చు.అలాగే పంటకు చుట్టూ బార్డర్ క్రాప్ గా జొన్న,సజ్జ వేసుకోవడం వలన పక్క పొలం నుండి వచ్చే పురుగు లను,తెగుళ్లను నివారించ వచ్చు మరియు అంతర పంటలు మరియు ఎర పంటలు వేసుకోవా లి. మరింత సమాచారం కొరకు 8500983300 ఈ నంబర్ కు కాల్ చేయండి. అలాగే వేంపల్లి రైతుల ఉత్పత్తిదారుల సంఘం లో పశువులకు కావలసిన దాణా, పంటలకు కావలసిన జిగురు పల్లాలు,లింగ ఖర్షకా బట్టలు అందుబాటు లో ఉన్నాయి.కావలసిన వారు సంప్రదించాల్సిన నంబర్ 6300235907.
24-1(15-6-2022) Vepada Farm Advisory
Date: 15-6-2022
Centre for Sustainable Agriculture-Vepada farm advisory
వేపాడ మండలం లో రాగల ఐదు రోజులు వాతావరణ సూచన 8-18milli mitre మోతదులో వర్షపాతం నమోదు అయ్యే సూచన ఉంది. గరిష్ట ఉష్ణోగ్రత 36-37 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 25- 26డిగ్రీలు గా ఉండే అవకాశం ఉంది. గాలి గంటకి 4-9km వేగంతో వీయవచ్చు. కె.జి.పూడి, ఎస్.కె.ఎస్.ఆర్ పురం క్లస్టర్లలో ఉన్న రైతులు ప్రధాన పంటకు సిద్దం చేస్తున్న భూమి లో పచ్చిరొట్ట యెరువులు అయిన జనుమ,జీలుగ, పిల్లి పెసరతో పాటు పప్పు జాతి, తీగ జాతి, నూనే జాతి, సుగంధపు జాతి మరియు కురగాలతో కలగలుపుకొని 9-12 రకాల విత్తనాలను వేసుకొని 30-40రోజులు పెరగనిచ్చి భూమిలో కలియదున్నడం వలన నేలలో తేమసాతం పెరిగి భూమి గుల్లబరుతుంది. ఈ విధంగా నేలలో సూక్ష్మ జీవులతో పాటు పోషకాలు కూడా అభివృద్ధి చెందుతాయి. అధిక దిగుబడి కుడ రైతులు పొందొచ్చు.
మరింత సమాచారం కోసం 8500983300 ఈ నంబర్ కు కాల్ చేయండి.
23-2(11-6-2022)Vepada Farm Advisory
Date: 11-6-2022
Centre for Sustainable Agriculture-Vepada Farm Advisory
వేపాడ మండలం లో రాగల ఐదు రోజులు వాతావరణ సూచన – 22-37milli mitre మోతదులో అతి తక్కువ వర్షపాతం నమోదు అయ్యే సూచన ఉంది. గరిష్ట ఉష్ణోగ్రత 35-37 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 26- 28డిగ్రీలు గా ఉండే అవకాశం ఉంది. గాలి గంటకి 8-11km వేగంతో వీయవచ్చు. కె.జి.పూడి, ఎస్.కె.ఎస్.ఆర్ పురం క్లస్టర్లలో ఉన్న రైతులు మామిడి , జీడి తోటలలో అంతరపంటలుగా కూరగాయలు, ఆకుకూరలుతో పాటు నవధాన్యాల సాగును చేసుకోవడం వలన అదనపు ఆదాయంతో పాటు భూమి కొతకు గురికాకుండా, చెట్లకు కావాల్సిన పోషకాలను అందించి అధిక దిగుబడిని తెచిపెడుతుంది మరియు అంతర పంటల వలన కీటకాలు, తెగుల్లు ఉదృతి తగ్గి కలుపు మొక్కలు నివారణ జరుగుతుంది. మరియు అరటి , జామ ఇతర పండ్ల తోటలలో ద్రవజీవామృతం పారించవలెను దీనివలన మొక్క పెరుగుదల బాగుండి దిగుబడిని పెంచుతుంది.
మరింత సమాచారం కోసం 8500983300 ఈ నంబర్ కు కాల్ చేయండి.
23-2022(10-06-22)Vempalli Farm Advisory
వేంపల్లె మండలం లో రాగల 5 రోజుల వాతావరణ సూచన – గరిష్ట ఉష్ణోగ్రత -38 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 20డిగ్రీలు గా వుండే అవకాశం వుంది. రాగల 5 రోజులలో 60 mm వర్ష పా తం రాగల దని సూచన గంటకి 20 కి.మి. వేగంతో పడమర దిశా గ వీయవచ్చు .
టివి పల్లె క్లస్టర్ లోనీ కుప్పలపల్లి , వెళమవారిపల్లి గ్రామాలలో ప్రధాన పంట అయినటువంటి పత్తి పంట లో ప్రస్తుతం ఆకుల అడుగు
భాగాన రసం పీల్చు పురుగుల ఉదృతి ఎక్కువగా ఉంది.దీనిని నివారణ చేయడానికి ఒక ఎకరానికి పసుపు జిగురు పల్లాలు 25 నుండి 30 వరకు పెట్టాలి. తరువాత వేపనూనె ఒక ట్యాంక్ కు 30 ml చొప్పున వేసుకోవాలి. వేపనూనె నీటిలో కలవడానికి శాంపు ప్యాకెట్ వేసుకొని మిక్స్ చేసుకొని పిచికారీ చేయాలి.ఈ విధంగా చేయడం వలన పురుగుల ఉదృతి నివారణ అవుతుంది. అలాగే చీనీ,నిమ్మ పంటలలో ఇగురు వచ్చే సమయంలో పెను బంక(చెక్కర తెగులు) ఉంది.దీని నివారణకు వేపనూనె ట్యాంక్ కు 35ml వేసుకొని పిచికారీ చేయాలి. అలాగే ఇప్పుడు పత్తి నాటే ప్రతి రైతు తప్పనిసరిగా విత్త నాలు నాటే ముందు బీజమృతం లేదా టీ విరిడి తో విత్తన శుద్ధి చేసి వేసుకోవడం వలన భూమి నుండి వచ్చే తెగుళ్లు, అలాగే విత్తనం నుండి సంక్రమించే తెగుళ్లను నివారించవచ్చు.మరింత సమాచారం కొరకు 8500983300 ఈ నంబర్ కు కాల్ చేయండి.
23-1(8-6-2022) Vepada Farm Advisory
Date: 8-6-2022
Centre for Sustainable Agriculture-Vepada farm advisory
వేపాడ మండలం లో రాగల ఐదు రోజులు వాతావరణ సూచన – 0-7mm మోతదులో అతి తక్కువ వర్షపాతం నమోదు అయ్యే సూచన ఉంది. గరిష్ట ఉష్ణోగ్రత 37-41 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 24- 26డిగ్రీలు గా ఉండే అవకాశం ఉంది. గాలి గంటకి 6-14km వేగంతో వీయవచ్చు. కె.జి.పూడి, ఎస్.కె.ఎస్.ఆర్ పురం క్లస్టర్లలో ఉన్న రైతులు మామిడి , జీడి తోటలలో అంతరపంటలుగా కూరగాయలు, ఆకుకూరలుతో పాటు నవధాన్యాల సాగును చేసుకోవడం వలన అదనపు ఆదాయంతో పాటు భూమి కొతకు గురికాకుండా, చెట్లకు కావాల్సిన పోషకాలను అందించి అధిక దిగుబడిని తెచిపెడుతుంది మరియు అంతర పంటల వలన కీటకాలు, తెగుల్లు ఉదృతి తగ్గి కలుపు మొక్కలు నివారణ జరుగుతుంది.అలాగే ఘన జీవామృతం, ద్రవ జీవామృతం మొక్కలకు వేయడం వలన మొక్క పెరుగుదల బాగుంటుంది.
మరింత సమాచారం కోసం 8500983300 ఈ నంబర్ కు కాల్ చేయండి.
Posts navigation
1
2
Recent Posts
19-2023(13/05/2023) Vepada Farm Advisory
16-2023(22/04/2023) Vepada Farm Advisory
14-2023(08/04/2023) Vepada Farm Advisory
13-2023(01/04/2023) Vepada Farm Advisory
11-2023(18/03/2023)Vepada Farm Advisory
Recent Comments
Oladapo Charles
on
The Dragon and The Elephant: A Comparative Study of Agricultural and Rural Reforms in China and India
Narendr Bhaskar
on
Kisan Mitra Farm Advisory Launch
Ramanjaneyulu GV
on
Crop, weather and market based advisory for farmers
Subha bharadwaj
on
35.2020 Vepada Farm Advisory
Kisan Mitra Farm Advisory Launch
on
35.2020 Vepada Farm Advisory
Archives
May 2023
April 2023
March 2023
February 2023
January 2023
November 2022
October 2022
September 2022
August 2022
July 2022
June 2022
May 2022
April 2022
March 2022
February 2021
December 2020
September 2020
August 2020
July 2020
June 2020
May 2020
April 2020
March 2020
December 2019
September 2019
August 2019
July 2019
June 2019
May 2019
April 2019
March 2019
February 2019
December 2018
November 2018
October 2018
September 2018
August 2018
July 2018
May 2018
March 2018
January 2018
December 2017
November 2017
September 2017
August 2017
July 2017
June 2017
June 2016
March 2016
February 2016
December 2015
September 2015
August 2015
July 2015
June 2015
April 2015
March 2015
February 2015
January 2015
December 2014
November 2014
October 2014
September 2014
August 2014
July 2014
June 2014
May 2014
April 2014
March 2014
February 2014
January 2014
December 2013
November 2013
October 2013
September 2013
August 2013
July 2013
June 2013
April 2013
June 2011
August 2007
Categories
Access to Services
Agrarian History
Agriwatch
Articles
Blog
Books
Data
Discussions
eBooks
Events
Farm Advisories
Farmers Suicides
GOs
Haritha & Vepada Tribal FPOs – Vizianagaram
Interviews
Meeting
Memorandums
Mental Health
Natural Disasters
News
Organic Farming
Presentations
Press Release
Proddatur FPO- Kadapa
Public Policies
Reports
Reports from Ground
Reports/Studies
Research Articles
Research Studies
Schemes
Services
Talupula FPO-Ananthapur
Technology
Thungabhadra FPO-Kurnool
Uncategorized
Vempalli FPO – Kadapa
Vemula FPO – Kadapa
తెలుగు
Meta
Register
Log in
Entries feed
Comments feed
WordPress.org