Monthly Archive June 2, 2022

22-2022(02-06-22)Vempalli Farm Advisory

వేంపల్లె మండలం లో రాగల 5 రోజుల వాతావరణ సూచన – 15 -20mm వర్షం పడే అవకాశం వుంది, గరిష్ట ఉష్ణోగ్రత -40 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 23 డిగ్రీలు గా వుండే అవకాశం వుంది. గంటకి 16 కి.మి. వేగంతో పడమర దిశా గ వీయవచ్చు .
టివి పల్లె క్లస్టర్ లోనీ కుప్పలపల్లి ,టీవీ పల్లె గ్రామాలలో ప్రధాన పంట అయినటువంటి పత్తి పంట లో ప్రస్తుతం రసం పీల్చు పురుగుల ఉదృతి ఎక్కువగా ఉంది.దీనిని నివారణ చేయడానికి ఒక ఎకరానికి జిగురు పల్లాలు 25 నుండి 30 వరకు పెట్టాలి. తరువాత వేపనూనె ఒక ట్యాంక్ కు 30 ml చొప్పున వేసుకోవాలి. వేపనూనె నీటిలో కలవడానికి స్యంపు ప్యాకెట్ కానీ ఒక కోడిగుడ్డు కానీ వేసుకొని మిక్స్ చేసుకొని స్ప్రే చేయాలి.ఈ విధంగ చేయడం వలన పురుగుల ఉదృతి నివారణ అవుతుంది.అలాగే చీనీ,నిమ్మ పంటలలో ఇగురు వచ్చే సమయంలో పెను బంక(చెక్కర తెగులు) ఉంది.దీని నివారణకు వేపనూనె ట్యాంక్ కు 35ml వేసుకొని స్ప్రే చేయాలి. అలాగే ఇప్పుడు పత్తి నాటే ప్రతి రైతు దుక్కిలో200 నుండి 400కేజీల ఘనజీవమృతం తయారు చేసుకొని వేసుకోవాలి.ఘన జీవామృతం వేసుకోవడం వలన భూమిలో సూక్ష్మ జీవుల అభివృధి చెందుతాయి.మరియు విత్త నాలు నాటే ముందు బీజమృతం లేదా టీ విరిడి తో విత్తన శుద్ధి చేసుకొని వేసుకోవడం వలన భూమి నుండి వచ్చే తెగుళ్లు, విత్తనం నుండి వచ్చే తెగుళ్లను నివారించవచ్చు.మరింత సమాచారం కొరకు 8500983300 ఈ నంబర్ కు కాల్ చేయండి.