Monthly Archive March 30, 2022

13-1(30-3-2022)Vepada farm advisory

వేపాడ మండలం లో రాగల ఐదు రోజులు వాతావరణ సూచన – వర్షం కురిసే సూచన లేదు. గరిష్ట ఉష్ణోగ్రత 33-42 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 24-25డిగ్రీలు గా ఉండే అవకాశం ఉంది. గాలి గంటకి 7-12కి.మి. వేగం తో వీయవచ్చు.
Pkr పురం, రామస్వామిపేట, దబ్బిరాజుపేట,చామలపల్లి,జగ్గయ్యపేట,గుడివాడ గ్రామాల్లో మిరపలో ఆకు ముడత తెగులు ఉంది దీని నివారణకు పుల్లటి మజ్జిగ లేదా ఎక్కువ ఉదృతి ఉన్నట్లైతే పచ్చిమిర్చి+వెల్లుల్లి ద్రావణం పిచికారీ చేసుకోవలెను.
Pkr పురం,sksr పురం, దబ్బిరాజుపేట, చామలపల్లి, జగ్గయ్యపేట వేరుశనగ లో తిక్క ఆకుమచ్చ తెగులు ఉదృతి ఎక్కువగా ఉంది దీని నివారించుటకు పెడ+ మూత్రం+ఇంగువ ద్రావనం పిచికారి చేయవలెను.
కే.జీ పూడి, పాతురు, sksr పురం, Pkr పురం గ్రామలలో మామిడిలో పూత,పింధే నిలబడటానికి పంచగవ్యను మరియు 15రోజుల వ్యవదిలో ద్రవజీవామృతం వేయవలెను.
మరింత సమాచారం కోసం 8500983300 ఈ నంబర్ కు కాల్ చేయండి.

12-2(26-3-2022)Vepada Farm Advisory

Date; 26-3-2022
Centre for Sustainable Agriculture-Vepada farm advisory
వేపాడ మండలం లో రాగల ఐదు రోజులు వాతావరణ సూచన – వర్షం కురిసే సూచన లేదు. గరిష్ట ఉష్ణోగ్రత 34-38 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 22-25డిగ్రీలు గా ఉండే అవకాశం ఉంది. గాలి గంటకి 5-12కి.మి. వేగం తో వీయవచ్చు.
Pkr పురం, రామస్వామిపేట, దబ్బిరాజుపేట,చామలపల్లి,బోద్దాం గ్రామాలలో ఆకుకూరలు, కూరగాయ మొక్కల్లో లీఫ్ మైనర్ అనగా ఆకులపై తెల్లచారలు ఏర్పడి పంటను నాశనం చేస్తుంది.దీని నివారించుటకు తెల్లచారలు కనిపించే ఆకులను తుంచి కాల్చివేయాలి.తదుపరి సాయంత్రపు వేలల్లో వేప వెల్లుల్లి ద్రావణం పిచికారి చేయవలెను.
Pkr పురం,బోద్దాం గ్రామాలలో వేసవి పంటగా బీరను సాగుచేస్తున్న రైతులు ఎక్కువ దిగుబడి కోరకు మరియు ఉష్ణోగ్రతను అదిగమించటానికి,నేలలో తేమశాతం పెంపొందుచుటకు 4-5రోజుల వ్యవదిలో నీటి తడులనిస్తు ద్రవజీవామృతం పారించవలెను.
జగ్గయ్యపేట, Pkr పురం, SKSR పురం కొబ్బరిలో పిందే రాలుట సమస్య ఎక్కువ ఉంది దీని నివారించుటకు ఘనజీవామృతం మొదళ్లచుట్టు వేయవలెను.
మరింత సమాచారం కోసం 8500983300 ఈ నంబర్ కు కాల్ చేయండి.

12-1(23-3-2022) Vepada Farm Advisory

వేపాడ మండలం లో రాగల ఐదు రోజులు వాతావరణ సూచన – 0-1mm మోతదులో వేరువేరు చోట్ల తేలీకపాటి వర్షాలు కురిసే సూచన ఉంది. గరిష్ట ఉష్ణోగ్రత 32-34 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 23-25డిగ్రీలు గా ఉండే అవకాశం ఉంది. గాలి గంటకి 4-6కి.మి. వేగం తో వీయవచ్చు.
Pkr పురం, రామస్వామిపేట, దబ్బిరాజుపేట,చామలపల్లి గ్రామాలలో మిరపలో నల్ల తామర పురుగు ఉదృతి అధికంగా ఉన్న0దువలన వేప నూనె 10,000ppm ను 2lt నీటిలో 0.5gmల సర్ఫ్ పోడిని కలిపి పిచికారి చేయవలెను.
Sksrపురం,కె.జీపూడి,పాతూరు, సంగంవలస, చిట్టివానిపాలెం,దబ్బిరాజుపేట గ్రామాలలో మామిడిలో ఆకుగూడు పురుగు 1,2లార్వ దశలో ఉండీ ఆకులను తింటూ వాటిచుట్టు గూడును కట్టుకొని స్థావరం ఉంటూ పూత,పిందెలు యెదగనివ్వకుండా తీవ్రనష్టం చేస్తుంది.దీనిని నివారించుటకు చెట్టుకు ఉన్న బూజు గూడులను తొలగించి యెండిన ఆకులను కాల్చివేయాలి మరియు దశపర్ణి లేదా పచ్చిమిర్చి-వెల్లుల్లి ద్రావణం పిచికారి చేసుకోవాలి. మరింత సమాచారం కోసం 8500983300 ఈ నంబర్ కు కాల్ చేయండి.

11-2(19-3-2022) Vepada Farm Advisory

Date: 19-3-2022
Centre for Sustainable Agriculture-Vepada farm advisory
వేపాడ మండలం లో రాగల ఐదు రోజులు వాతావరణ సూచన – వర్షం కురిసే సూచన లేదు. గరిష్ట ఉష్ణోగ్రత 35-43 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 17-19 డిగ్రీ లు గా ఉండే అవకాశం ఉంది. గాలి గంటకి 2-11కి.మి. వేగం తో వీయవచ్చు.
Pkr పురం, రామస్వామిపేట, దబ్బిరాజుపేట,చామలపల్లి గ్రామలలో టమోటా, వంకాయ,బెండలలో కాయ తోలుచు పురుగు ఉదృతి ఉన్న0దువలన తూటికాడ కషాయం లేదా పచ్చిమిర్చి- వెల్లుల్లి ద్రావణం పిచికారి చేయవలెను.
కె.జీపూడి,చామలాపల్లి,వెంకయ్యపాలెం,అరిగిపాలెం,దబ్బిరాజుపేట,మారిక గ్రామాలలో జీడిలో యాజమాన్య చర్య దిశగా పూత, పిందే సమయం లో పిక్క బరువు, నాన్యత పెరుగుదలకు పంచగవ్యను వేసుకోవాలి.
పెరటి తోటలలో పెంచుకుంటున్న అరటిలో సిగటోక ఆకు మచ్చ తెగులు ఉదృతి ఉన్నందున రైతులు 5% వేప కషాయం లేద పెడ+మూత్రం+ఇంగువ ద్రావణం పిచికారి చేసుకోవాలి. మరింత సమాచారం కోసం 8500983300 ఈ నంబర్ కు కాల్ చేయండి.

11-1(16-3-2022)Vepada Farm Advisory

వేపాడ మండలం లో రాగల ఐదు రోజులు వాతావరణ సూచన – వర్షం కురిసే సూచన లేదు. గరిష్ట ఉష్ణోగ్రత 35-37 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 17-20 డిగ్రీ లు గా ఉండే అవకాశం ఉంది. గాలి గంటకి 2-7కి.మి. వేగం తో వీయవచ్చు.
Sksr పురం, రామస్వామిపేట, దబ్బిరాజుపేట,జగ్గయ్యపేట గ్రామలలో వేరుశనగలో తిక్క ఆకుమచ్చ తెగులు ఉదృతి ఎక్కువగా ఉంది. దీని నివారణకు 6%పుల్లటి మజ్జిగను 100లీ. నీటిలో కలిపి పిచికారి చేయవలెను లేధా 5kgపిచ్చితులసి కషాయం 100lt నీటిలో కలిపి పిచికారి చేయవలెను.
బొద్దాం,రామస్వామిపేట, పి.కే.అర్. పురం
గ్రామాలలో బీర లో పండు ఈగ ఉదృతి యెక్కువగా ఉంది. దీనినీ నివారించటానికి ఫ్రూట్‌ఫ్లై ఉచ్చులును ఎకరంకు 10 ఏర్పాటు చేసుకోవాలి మరియు 10రోజుల వ్యవదిలో నీమాస్త్రం పిచికారి చేసుకోని మొక్క మొదల్లులో వేప
పిండిని వేయాలి.
కె.జీపూడి,చామలాపల్లి,వెంకయ్యపాలెం,అరిగిపాలెం,దబ్బిరాజుపేట గ్రామాలలో జీడిలో T-ధోమ ఉదృతి ఉంది. దీని
నివారణకు 5% వేపనూనెను పిచికారి చేసుకోవలెను.మరింత సమాచారం కోసం 8500983300 ఈ నంబర్ కు కాల్ చేయండి.

10-2(12-3-2022) Vepada Farm Advisory

Date: 12-3-2022
Centre for Sustainable Agriculture-Vepada farm advisory
వేపాడ మండలం లో రాగల ఐదు రోజులు వాతావరణ సూచన – వర్షం కురిసే సూచన లేదు. గరిష్ట ఉష్ణోగ్రత 34-36 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 19-20 డిగ్రీ లు గా ఉండే అవకాశం ఉంది. గాలి గంటకి 3-8కి.మి. వేగం తో వీయవచ్చు.
p.k.r పురం, Sksr పురం, రామస్వామిపేట, దబ్బిరాజుపేట గ్రామలలో మిరపలో పేనుబంక, తెల్లదోమ ఉదృతి ఎక్కువగా ఉంది. దీని ఉదృతి తెలుసుకోడానికి ఎకరాకు10 పసుపు రంగు జిగురు అట్టలు పెట్టవలెను మరియు లీటరు నీటిలో 1000ppm వేపనూనెను కలిపి పిచికారి చేయవలెను.
బొద్దాం,రామస్వామిపేట, పి.కే.అర్. పురం
గ్రామాలలో బీర లో పల్లాకు తెగులు ఉదృతి యెక్కువగా ఉంది. దీనినీ గుర్తించటానికి ముదురు ఆకులపైన వలయాకారం లో నీటి మచ్చలు ఏర్పడి గోధుమవర్ణం లోకి మారుతు యెండిపోతు ఉంటాయి. దీనిని నివారించడానికి పుల్లటి మజ్జిగ ను లేదా సొంటిపాల కషాయం పిచికారి చేయవలెను.
కోటయ్యగరువు, దబ్బిరాజు పేట,Sksr పురం, కె.జీ పూడి,పోతుబంధివానిపాలెం,వెంకటయ్యపాలెం,గుడివాడగ్రామాలలో మామిడిలో తేనెమంచు పురుగు
ఉదృతి ఎక్కువగా ఉంది దీని వల్ల పువ్వు నల్లగా మారి మసిపూసినట్టుగా ఉండి పూత, పిందె పండుబారి రాలిపోతుంది. దీని నివారణకు పేడ+మూత్రం+ఇంగువ ద్రావనం లేదా 6lt పుల్లటిమజ్జిగ+6lt ఆవు మూత్రం ను 100లీ. నీటిలో కలిపి చెట్టు మొత్తం తడిచేల పిచికారి చేసుకోవలెను.మరింత సమాచారం కోసం 8500983300 ఈ నంబర్ కు కాల్ చేయండి.

10-1(9-3-2022) Vepada Farm Advisory

Date: 9-3-2022
Centre for Sustainable Agriculture-Vepada farm advisory
వేపాడ మండలం లో రాగల ఐదు రోజులు వాతావరణ సూచన – వర్షం కురిసే సూచన లేదు. గరిష్ట ఉష్ణోగ్రత 34-36 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 19-20 డిగ్రీ లు గా ఉండే అవకాశం ఉంది. గాలి గంటకి 3-7కి.మి. వేగం తో వీయవచ్చు.
దబ్బిరాజుపేట, ఎస్‌కేఎస్‌ఆర్ పురం, గ్రామలలో ఉల్లిలో మొదళ్లు కుళ్లిపోతున్నాయి. దీనిని నివారించడానికి జీవ శిలీంధ్రాలు అయిన ట్రైకోడెర్మా విరిడేను ఉపయోగించవలెను.
రామస్వామిపేట, పి.కే.అర్. పురం, ఎస్.కే.ఎస్.అర్ పురం, చామలపల్లి గ్రామాలలో మిరపలో తామరపురుగు,తెల్లనల్లి ఉదృతి ఎక్కువగా ఉందీ దీనిని నివారించటం కోసం వేప గింజల కషాయం పిచికారి చేయవలెను మరియు ఎకరానికి 8-10జిగురు పల్లాలు పెట్టవలెను.
దబ్బిరాజు పేట,Sksr పురం, కె.జీ పూడి,పోతుబంధివానిపాలెం,వెంకయ్యపాలెం గ్రామాలలో మామిడిలో పిండినల్లి ఉదృతి మార్చి, ఏప్రిల్ నెలల్లో ఎక్కువగా ఉండె అవకాశం ఉన్నందున ముందు చర్య దిసగా 10లీ.గంజి ద్రావణంను 200లీ. నీటిలో కలిపి పిచికారి చేసుకోవలెను లేదా
5% వేపగింజల కషాయం పిచికారి చేసుకోవటం వలన పిండినల్లి ఉదృతి నివారించుకోవచ్చు. మరింత సమాచారం కోసం 8500983300 ఈ నంబర్ కు కాల్ చేయండి.

9-2(5-3-2022) Vepada Farm Advisory

Date:5-3-2022
Centre for Sustainable Agriculture-Vepada farm advisory
వేపాడ మండలం లో రాగల ఐదు రోజులు వాతావరణ సూచన వర్షం కురిసే సూచన లేదు. గరిష్ట ఉష్ణోగ్రత 34-36 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 19-20 డిగ్రీ లు గా ఉండే అవకాశం ఉంది. గాలి గంటకి 7-9కి.మి. వేగం తో వీయవచ్చు.
కోటయ్య గరువు , జగ్గయ్యపేట గ్రామాల్లో వరి వేసుకున్న రైతులు
ప్రతి 15 రోజులకు ఒకసారి ద్రవజీవామృతం పారించటం వలన మొక్క ఎదుగుదల మరియు దిగుబడి పెరుగుతోంది.
బోద్ధాం, రామస్వామిపేట, పి.కే.అర్. పురం, ఎస్.కే.ఎస్.అర్ పురం గ్రామాలలో బీర లో పల్లాకు తెగులు ఎక్కువగా ఉందీ దీనిని నివారించటం కోసం పుల్లటి మజ్జిగ పిచికారి చేయవలెను .
పి.కే.అర్. పురం, దబ్బిరాజు పేట గ్రామాలలో టోమాటోలో ఆకు మాడు తెగులు ఉదృతి ఎక్కువగా ఉందీ దీనిని నివారించడానికి రైతులు ముందుగా పొలం నుండి తెగులు సోకిన మొక్కల ను వేరుచేయాలి, తరువాత పుల్లటి మజ్జిగలో రాగిపాత్రను ఉంచి 3 రోజులు తర్వాత పిచికారి చేయవలెను.
పి.కే.అర్.పురం, ధబ్బిరాజుపేట గ్రామాలలో మిరప లో ఆంత్రాక్నోస్ తెగులు ఉంది దీనిని నివారణకు పెడ+మూత్రం+ఇంగువ ద్రావనం పిచికారి చేసుకోవాలి.
మరింత సమాచారం కోసం 8500983300 ఈ నంబర్ కు కాల్ చేయండి.

9-1(2-3-2022) Vepada Farm Advisory

Date: 2-3-2022
Centre for Sustainable Agriculture-Vepada farm advisory
వేపాడ మండలం లో రాగల ఐదు రోజులు వాతావరణ సూచన వర్షం కురిసే సూచన లేదు. గరిష్ట ఉష్ణోగ్రత 32-36 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 15-12 డిగ్రీ లు గా ఉండే అవకాశం ఉంది. గాలి గంటకి 3-10కి.మి. వేగం తో వీయవచ్చు.
కోటయ్య గరువు, సారవాని పాలెం,పోతుబందీపాలెం,పాతురు , వెంకయ్యపాలెం , కే. జీ పుడి, బంగారయ్య పేట, చిట్టివానిపాలెం గ్రామాలలో జీడిమామిడి పూత దశ నుండి పిందె దశకు వస్తుంది కావున పంచగవ్య పిచికారి చేసుకుంటే పిక్క బరువు ఎక్కువ గా పెరుగుతుంది.
వరి లో ఆకు ముడత ఉదృతి జగ్గయ్య పేట,కోటయ్య గరువు గ్రామాలలో ఎక్కువగా ఉంది. దీనిని నివారించడానికి కంపను లాగించాలి, అలానే 5% వేప కషాయం పిచికారి చేసుకోవాలి.
వంగలో కాయ తొలుచు పురుగు ఉదృతి P.K.R. పురం, SkSR పురం, కె.జి. పూడి, ఉంది దీని నివారించడానికి వేప కషాయం పిచ్చికారి చేయాలి.
మరింత సమాచారం కోసం 8500983300 ఈ నంబర్ కు కాల్ చేయండి.