Centre for Sustainable Agriculture-Vepada farm advisory
వేపాడ మండలం లో రాగల ఐదు రోజులు వాతావరణ సూచన – వర్షం కురిసే సూచన లేదు. గరిష్ట ఉష్ణోగ్రత 34-36 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 19-20 డిగ్రీ లు గా ఉండే అవకాశం ఉంది. గాలి గంటకి 3-8కి.మి. వేగం తో వీయవచ్చు.
p.k.r పురం, Sksr పురం, రామస్వామిపేట, దబ్బిరాజుపేట గ్రామలలో మిరపలో పేనుబంక, తెల్లదోమ ఉదృతి ఎక్కువగా ఉంది. దీని ఉదృతి తెలుసుకోడానికి ఎకరాకు10 పసుపు రంగు జిగురు అట్టలు పెట్టవలెను మరియు లీటరు నీటిలో 1000ppm వేపనూనెను కలిపి పిచికారి చేయవలెను.
బొద్దాం,రామస్వామిపేట, పి.కే.అర్. పురం
గ్రామాలలో బీర లో పల్లాకు తెగులు ఉదృతి యెక్కువగా ఉంది. దీనినీ గుర్తించటానికి ముదురు ఆకులపైన వలయాకారం లో నీటి మచ్చలు ఏర్పడి గోధుమవర్ణం లోకి మారుతు యెండిపోతు ఉంటాయి. దీనిని నివారించడానికి పుల్లటి మజ్జిగ ను లేదా సొంటిపాల కషాయం పిచికారి చేయవలెను.
కోటయ్యగరువు, దబ్బిరాజు పేట,Sksr పురం, కె.జీ పూడి,పోతుబంధివానిపాలెం,వెంకటయ్యపాలెం,గుడివాడగ్రామాలలో మామిడిలో తేనెమంచు పురుగు
ఉదృతి ఎక్కువగా ఉంది దీని వల్ల పువ్వు నల్లగా మారి మసిపూసినట్టుగా ఉండి పూత, పిందె పండుబారి రాలిపోతుంది. దీని నివారణకు పేడ+మూత్రం+ఇంగువ ద్రావనం లేదా 6lt పుల్లటిమజ్జిగ+6lt ఆవు మూత్రం ను 100లీ. నీటిలో కలిపి చెట్టు మొత్తం తడిచేల పిచికారి చేసుకోవలెను.మరింత సమాచారం కోసం 8500983300 ఈ నంబర్ కు కాల్ చేయండి.