Monthly Archive September 28, 2022

39-1(28-9-2022) Vepada Farm advisory

Date : 28-9-2022
Centre for Sustainable Agriculture
వేపాడ మండలం లో రాగల ఐదు రోజులు వాతావరణ సూచన – 10-15mm మొతాదులో వర్షం కురిసే సూచన ఉంది. గరిష్ట ఉష్ణోగ్రత 35-37డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 23-24డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. గాలి గంటకి 5-6km వేగంతో నైరుతి దిశగా వీయ్యవచ్చు. కేజీ పూడి, SKSR Puram క్లస్టర్లలో ఉన్న రైతులు ప్రధాన పంట అయిన వరిలో పోషక లోపం నివారణ,మరియు పంట యేపుగా పెరుగుదలకు,రసం పీల్చు పురుగుల నివారణకు జిల్లెడు ద్రావణం పిచికారి చేసుకోవలెను. అలాగే జగ్గయ్యపేట, సోంపురం, పాతూరు,PKR పురం, రామస్వామిపేట గ్రామాల్లో కత్తెర పురుగు నివారణకు పచ్చిమిర్చి వెల్లుల్లి ద్రావణం పిచికారి చేసుకోని నివారించవచ్చును. అలాగే ఆకు ఏఁడు తెగులు,అగ్గి తెగులు నివారణకు 3కిలోల పసువుల పెడ 10లీ నీటికి కలిపి పిచికారి చేసుకోని నివారించవచ్చును. మరింత సమాచారం కోసం 8500983300 ఈ నంబర్ కు కాల్ చేయండి.

38-2(24-9-2022) Vepada Farm Advisory

Date : 24-9-2022
Centre for Sustainable Agriculture-Vepada Farm Advisory
వేపాడ మండలం లో రాగల ఐదు రోజులు వాతావరణ సూచన – 23-51mm మొతాదులో వర్షం కురిసే సూచన ఉంది. గరిష్ట ఉష్ణోగ్రత 32-34డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 22-23 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. గాలి గంటకి 6-8km వేగంతో పడమర దిశగా వీయ్యవచ్చు. తుఫాన్ హెచ్చరిక ఉన్న కారణంగా ఆకాశం మేఘవృతమై ఉండి మోస్తరు వర్షాలు కురిసే సూచన ఉంది కావున కేజీ పూడి, SKSR Puram క్లస్టర్లలో ఉన్న రైతులందరూ పొలాల్లో ఎరువులు వేయుట కానీ, కషాయాలు పిచికారి చేయటం వంటి పనులు వాయిద వేసుకోవాలి.మరియు పోలాల్లో వర్షపు నీరు బయటికి పోయేలా నీటి కాలవలు తీసుకోవలెను. మరియు పండ్ల తోటలు అయిన అరటి,బొప్పాయి మో|| వాటిలో పక్వానికి వచ్చిన పళ్లను వెంటనే కోయాలి.అలాగే తుఫాన్ గాలికి పడిపోకుండ మొక్కల పక్కన వెదురు కర్రలను పాతి ఊతమివ్వాలి. తధుపరి మొక్కలకు వర్షల కారణంగా తెగులు సోకే అవకాశం ఉన్నందున రైతులు అందరు పెడ,మూత్రం,ఇంగువ ద్రావణం గానీ సొంటిపాల కాషాయం కాని పిచికారి చేసుకోవలెను.అలాగే Kg pudi,Sksr puram క్లస్టర్లులో e-cropలో పంట నమొదుకు ఈ నెల25వ తేదీ వరకు గడువున్నది కనుక ఈ-క్రాప్ నమోధు చేసుకోలేని రైతులు తమ గ్రామ పరిధిలో ఉన్న RBK లను సంప్రదించగలరు. మరింత సమాచారం కోసం 8500983300 ఈ నంబర్ కు కాల్ చేయండి.

37-2(17-9-2022) Vepada Farm Advisory

Date : 17-9-2022
Centre for Sustainable Agriculture- Vepada Farm Advisory
వేపాడ మండలం లో రాగల ఐదు రోజులు వాతావరణ సూచన – 8-31mm మొతాదులో వర్షం కురిసే సూచన ఉంది. గరిష్ట ఉష్ణోగ్రత 33-36డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 23-24 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. గాలి గంటకి 8-10km వేగంతో నైరుతి దిశగా వీయవచ్చు. జగ్గయ్యపేట, బొద్ధం పోతుబంధిపాలెం, Sksr పురం గ్రామాల్లో వరిలో ఆకుపచ్చ కొమ్ము పురుగు,కత్తెర పురుగు ఉదృతి ఉన్నది కావున రైతులు నీమాస్త్రం కాని పంచపత్ర కషాయం కాని పిచికారి చేసుకోవలెను. మరియు కరకవలస, సోంపురం, R.S పేట,sksr puram గ్రామలలో మిడతల ఉదృతి ఉన్నధి కావున రైతులు వెల్లుల్లి ద్రావణం పిచికారి చేసుకోవలెను. అలాగే Kg pudi,Sksr puram క్లస్టర్లులో e-cropలో పంట నమొదుకు ఈ నెల25వ తేదీ వరకు గడువున్నది కనుక ఇంకా ఎవరైనా రైతులు పంట నమోదు చేయించుకోకుండా ఉంటె ఈ నెల 20 తేదీ లోగా పంట నమోదు చేయించుకుని Biometric చేయించుకోగలరు. మరింత సమాచారం కోసం 8500983300 ఈ నంబర్ కు కాల్ చేయండి.

37-1(14-9-2022) Vepada Farm Advisory

Date : 14-9-2022
Centre for Sustainable Agriculture- Vepada Farm Advisory
వేపాడ మండలం లో రాగల ఐదు రోజులు వాతావరణ సూచన – 2-21mm మొతాదులో వర్షం కురిసే సూచన ఉంది. గరిష్ట ఉష్ణోగ్రత 30-33డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 22-26 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. గాలి గంటకి 10-15km వేగంతో నైరుతి దిశగా వీయవచ్చు. Sksr పురం, KG పూడి క్లస్టర్లలో ప్రస్తుత వాతావరణ పరిస్థితుల వలన వరిలో అగ్గితెగులు,పొడతెగులు ఆశించే అవకాశం ఉంది కావున రైతులందరు అగ్గితెగులు నివారణకు అడవి తులసి కషాయం పిచికారి చేసుకోవలను. మరియు పొడ తెగులు నివారణకు రైతులు 1లీ.ఆవు మూత్రం+1లీ. మజ్జిగ తీసుకొని 8లీ. నీటిలో కలుపుకొని పిచికారి చేసుకోవలెను. సారవానిపాలెం, కోటయ్యగరువు,దుంగాడ గ్రామాల్లో వేరుశనగ వేసుకున్న రైతులు తిక్క ఆకు మచ్చ తెగులు నివారణకు పెడ+మూత్రం+ఇంగువ ద్రావణం పిచికారి చేసుకోవలెను. మారిక గ్రామంలో మొక్కజొన్నలో కత్తెర పురుగు నివారణకు రైతులు పచ్చిమిర్చి వెల్లుల్లి ద్రావణం పిచికారి చేసుకోవలెను. మరింత సమాచారం కోసం 8500983300 ఈ నంబర్ కు కాల్ చేయండి.

36-2022(09-09-22)Vempalli Farm Advisory

వేంపల్లె మండలం లో రాగల మరో 5 రోజుల యొక్క వాతావరణ సూచన – గరిష్ట ఉష్ణోగ్రత -34 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 20 డిగ్రీలు గా వుండే అవకాశం వుంది. రాగల మరో 5 రోజుల్లో 19mm వర్షపాతం ఉండును. గాలిలో తేమ 50-71 %, అలాగే గంటకి 23 కి.మి. వేగంతో ఉత్తరం మరియు పడమర దిశ గ గాలులు వీయవచ్చును .
టివి పల్లె క్లస్టర్ లోనీ కుప్పలపల్లి , వెలమవారిపల్లి , బక్కన్నగారిపల్లి గ్రామాలలో ప్రధాన పంట అయినటువంటి పత్తి పంట లో రసం పీల్చు పురుగు ల నివారించుటకు ఒక ఎకరానికి 25 నుండి 30 వరకు పసుపు జిగురు పల్లెములు పెట్టాలి. అలాగే మెగ్నేషియం లోప నివారణకై ఆవు మూత్రం ఇంగువ ద్రావణం పిచికారీ చేయాలి.. అలాగే పత్తి పంట లో గులాబీ రంగు పురుగు ఉధృతి నివారణ కొరకై ఒక ఎకరా పొలం లో లింగ కర్షక బట్టలు 8 నుండి 10 వరకు పెట్టుకోవాలి. ఇవి పెట్టడం వలన పత్తి కాయలో వచ్చే ఎర్ర పురుగును నివారించవచ్చు.అలాగే చీనీ,నిమ్మ పంటలలో ఇగురు లో వచ్చే పేను బంక,పురుగు నివారణకు, వేపనూనె పిచికారి చేయాలి. అలాగే ఎదుగుదళ కొరకై జీవామృతం ని పారించాలి.అలాగే పూత కొరకు కోడి గుడ్ల ద్రావణం లేదా పంచగవ్య పిచికారి చేయాలి.
అలాగే పసుపు జిగురు పల్లాలు, లింగాకర్షక బుట్టలు, పశువుల దాణా, విత్తనాల కిట్లు ( అంతర పంటలు వేసుకోవడానికి 11 రకాల విత్తనాలు ), జీవామృతం తయారీకి కావాల్సిన బెల్లం, వేప నూనె మన వేంపల్లి రైతు ఉత్పత్తి దారుల సంఘం లో అందుబాటులో ఉన్నాయి.కావలసినటువంటి రైతులు 6300235907 కు ఫోన్ చేయగలరు.
అలాగే మీ వ్యవసాయానికి సంబంధించి ఏమైనా సమస్యలు ఎదుర్కొంటున్నారా.??
👉 భూమి రికార్డులు
👉పంట రుణాలు
👉 కౌలు రైతుల సమస్యలు
👉 విత్తన సమస్యలు
👉 మార్కెట్ యార్డులు, ధరలు
👉 వ్యవసాయ సబ్సిడీ, పెట్టుబడి పథకాలు
👉 ప్రకృతి వైపరీత్యాల వలన నష్టం
తదితర సమస్యల పరిష్కారం కొరకు csa కిసాన్ మిత్ర నెంబర్ 8500983300కు phone చేయండి.

36-1(7-9-2022) Vepada Farm Advisory

Date: 7-9-2022
Centre for Sustainable Agriculture-Vepada farm advisory
వేపాడ మండలం లో రాగల ఐదు రోజులు వాతావరణ సూచన – 18-30mm మొతాదులో వర్షం కురిసే సూచన ఉంది. గరిష్ట ఉష్ణోగ్రత 32-37డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 23-25 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. గాలి గంటకి 6-11km వేగంతో దక్షిణం దిశగా వీయవచ్చు. బోద్ధం,R S పేట, జగ్గయ్యపేట ,కరకవలస గ్రామాల్లో ఆకు ముడత పురుగు ఉదృతి ఉన్నందున కంప లాగి లార్వ దశలలో పురుగులను అధుపు చేయుటకు పచ్చిమిర్చి+వెల్లుల్లి కషాయం పిచికారి చేసుకోగలరు.మరియు పొడ తెగులు నివారణకు రైతులు 1లీ.ఆవు మూత్రం+1లీ. మజ్జిగ తీసుకొని 8లీ. నీటిలో కలుపుకొని పిచికారి చేసుకోవలెను. మరియు పేరటి తోటలలో పెంచుకుంటున్న అరటి మొక్కలకు వర్షాల కారణంగా సిగటోక తెగులు వృద్ధి చెందే అవకాశం ఉన్నందున రైతులు Trichoderma viridae లేధా సొంటిపాల కషాయం పిచికారి చేసుకోవలెను.అలాగే కెజి పూడి, Sksr పురం క్లస్టర్లులో ఉద్యానవన పంటలు అయిన జీడి మామిడిలో కొత్త చిగుర్లు వచ్చి పూత అధికంగా వస్తు దిగుబడి పెంపొందించుటకు కొమ్మ కత్తిరింపులు చేసుకోవలెను.మరియు YSR రైతు భరోసా పోర్టల్లో కొత్త రిజిస్ట్రేషన్ పోర్టల్ ప్రారంబించ బడినది కావున వైఎస్ఆర్ రైతు భరోసా కి సంబందించి 2022-23 సం. గాను అర్హత ఉన్న రైతులందరూ మీ స‌మీప RBK లలో సంప్రదించి రిజిస్ట్రేషన్ చేయించుకోవలెను.గత సం.లబ్దిపొందిన రైతులకు కొత్తగా నమోదు అవసరం లేదు. మరింత సమాచారం కోసం 8500983300 ఈ నంబర్ కు కాల్ చేయండి.

35-2022(03-09-22)Vempalli Farm Advisory

వేంపల్లె మండలం లో రాగల మరో 5 రోజుల యొక్క వాతావరణ సూచన – గరిష్ట ఉష్ణోగ్రత -34 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 24 డిగ్రీలు గా వుండే అవకాశం వుంది. రాగల మరో 5 రోజుల్లో 2 mm వర్షపాతం ఉండును. గాలిలో తేమ 76%, అలాగే గంటకి 6 కి.మి. వేగంతో పడమర దిశ గ గాలులు వీయవచ్చును .
టివి పల్లె క్లస్టర్ లోనీ కుప్పలపల్లి , వెలమవారిపల్లి , బక్కన్నగారిపల్లి గ్రామాలలో ప్రధాన పంట అయినటువంటి పత్తి పంట లో రసం పీల్చు పురుగు ల నివారించుటకు ఒక ఎకరానికి 25 నుండి 30 వరకు పసుపు జిగురు పల్లెములు పెట్టాలి. అలాగే మెగ్నేషియం లోప నివారణకై ఆవు మూత్రం ఇంగువ ద్రావణం పిచికారీ చేయాలి.. అలాగే పత్తి పంట లో గులాబీ రంగు పురుగు ఉధృతి నివారణ కొరకై ఒక ఎకరా పొలం లో లింగ కర్షక బట్టలు 8 నుండి 10 వరకు పెట్టుకోవాలి. ఇవి పెట్టడం వలన పత్తి కాయలో వచ్చే ఎర్ర పురుగును నివారించవచ్చు.అలాగే చీనీ,నిమ్మ పంటలలో ఇగురు లో వచ్చే పేను బంక,పురుగు నివారణకు, వేపనూనె పిచికారి చేయాలి. అలాగే ఎదుగుదళ కొరకై జీవామృతం ని పారించాలి.అలాగే పూత కొరకు కోడి గుడ్ల ద్రావణం లేదా పంచగవ్య పిచికారి చేయాలి.
అలాగే పసుపు జిగురు పల్లాలు, లింగాకర్షక బుట్టలు, పశువుల దాణా, విత్తనాల కిట్లు ( అంతర పంటలు వేసుకోవడానికి 11 రకాల విత్తనాలు ), జీవామృతం తయారీకి కావాల్సిన బెల్లం, వేప నూనె మన వేంపల్లి రైతు ఉత్పత్తి దారుల సంఘం లో అందుబాటులో ఉన్నాయి.కావలసినటువంటి రైతులు 6300235907 కు ఫోన్ చేయగలరు.
అలాగే మీ వ్యవసాయానికి సంబంధించి ఏమైనా సమస్యలు ఎదుర్కొంటున్నారా.??
👉 భూమి రికార్డులు
👉పంట రుణాలు
👉 కౌలు రైతుల సమస్యలు
👉 విత్తన సమస్యలు
👉 మార్కెట్ యార్డులు, ధరలు
👉 వ్యవసాయ సబ్సిడీ, పెట్టుబడి పథకాలు
👉 ప్రకృతి వైపరీత్యాల వలన నష్టం
తదితర సమస్యల పరిష్కారం కొరకు csa కిసాన్ మిత్ర నెంబర్ 8500983300కు phone చేయండి.

35-2(3-9-2022) Vepada Farm Advisory

Date: 3-9-2022
Centre for Sustainable Agriculture-Vepada farm advisory
వేపాడ మండలం లో రాగల ఐదు రోజులు వాతావరణ సూచన – 2-11mm మొతాదులో వర్షం కురిసే సూచన ఉంది. గరిష్ట ఉష్ణోగ్రత 34-36డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 24 డిగ్రీలు గా ఉండే అవకాశం ఉంది. గాలి గంటకి 2-8km వేగంతో దక్షిణం దిశగా వీయవచ్చు. KG పూడి, sksr పురం క్లస్టర్స్ లో వరి ప్రధాన పంటగా వేసుకున్న రైతుల పోలాల్లో మిడతల ఉదృతి అధికంగా ఉన్న కారణంగా రైతులు పొలాల్లో ఎకరానికి 15-20వరకు పక్షి స్థావరాలు ఏర్పాటు చేసుకొని వెల్లుల్లి ద్రావణం పిచికారి చేసుకోవలెను. మరియు సారవాణి పాలెం, కెజి పూడి, మారిక మరియు ఇతర మెట్ట ప్రాంతాలలో చిరుధాన్యాలు వేసుకున్న రైతులు తెగుల్ల నివారణకు పెడ+మూత్రం+ఇంగువ ద్రావణం పిచికారి చేసుకోవలెను.అలాగే మారిక గ్రామంలో మొక్క జొన్న వేసుకున్న రైతులు కత్తెర పురుగు ఆశించే అవకాశం ఉన్నందున లార్వ దశలలో ఉన్న పురుగులను నివారించుటకు మొక్క సుడులలో లేధా మొవ్వులో ఇసుక మరియు సున్నం కలుపుకొని 9:1నిష్పత్తిలో ఆ పొడిని వేయవలెను అలాగె వేపనూనె 1500ppm నీటిలో కలుపుకొని పిచికారి చేయటం వలన కత్తెర పురుగును నివారించవచ్చును.మరింత సమాచారం కోసం 8500983300 ఈ నంబర్ కు కాల్ చేయండి.