35-2(3-9-2022) Vepada Farm Advisory

35-2(3-9-2022) Vepada Farm Advisory

Date: 3-9-2022
Centre for Sustainable Agriculture-Vepada farm advisory
వేపాడ మండలం లో రాగల ఐదు రోజులు వాతావరణ సూచన – 2-11mm మొతాదులో వర్షం కురిసే సూచన ఉంది. గరిష్ట ఉష్ణోగ్రత 34-36డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 24 డిగ్రీలు గా ఉండే అవకాశం ఉంది. గాలి గంటకి 2-8km వేగంతో దక్షిణం దిశగా వీయవచ్చు. KG పూడి, sksr పురం క్లస్టర్స్ లో వరి ప్రధాన పంటగా వేసుకున్న రైతుల పోలాల్లో మిడతల ఉదృతి అధికంగా ఉన్న కారణంగా రైతులు పొలాల్లో ఎకరానికి 15-20వరకు పక్షి స్థావరాలు ఏర్పాటు చేసుకొని వెల్లుల్లి ద్రావణం పిచికారి చేసుకోవలెను. మరియు సారవాణి పాలెం, కెజి పూడి, మారిక మరియు ఇతర మెట్ట ప్రాంతాలలో చిరుధాన్యాలు వేసుకున్న రైతులు తెగుల్ల నివారణకు పెడ+మూత్రం+ఇంగువ ద్రావణం పిచికారి చేసుకోవలెను.అలాగే మారిక గ్రామంలో మొక్క జొన్న వేసుకున్న రైతులు కత్తెర పురుగు ఆశించే అవకాశం ఉన్నందున లార్వ దశలలో ఉన్న పురుగులను నివారించుటకు మొక్క సుడులలో లేధా మొవ్వులో ఇసుక మరియు సున్నం కలుపుకొని 9:1నిష్పత్తిలో ఆ పొడిని వేయవలెను అలాగె వేపనూనె 1500ppm నీటిలో కలుపుకొని పిచికారి చేయటం వలన కత్తెర పురుగును నివారించవచ్చును.మరింత సమాచారం కోసం 8500983300 ఈ నంబర్ కు కాల్ చేయండి.

About the author

Anusha V administrator

Leave a Reply