41-2022(14-10-2022)

41-2022(14-10-2022)

వేంపల్లె మండలం లో రాగల మరో 5 రోజుల యొక్క వాతావరణ సూచన – గరిష్ట ఉష్ణోగ్రత -35 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 20 డిగ్రీలు గా వుండే అవకాశం వుంది. రాగల మరో 5 రోజుల్లో 17mm వర్షపాతం ఉండును. గాలిలో తేమ 53-93 %, అలాగే గంటకి 9 కి.మి. వేగంతో తూర్పు దిశ గ గాలులు వీయవచ్చును .
. టివి పల్లె క్లస్ట ర్ లోనీ కుప్పా లపల్లి , ముసల్ రెడ్డి గారి పల్లె లో ప్రధాన పంట అయిన చీనీ నిమ్మ పంటలలో పెరుగు దల కొరకై జీవామృతం ని పారించాలి. అలాగే పూత కొరకు కోడి గుడ్ల ద్రావణం లేదా చేపల ద్రావణం పిచికారి చేయాలి. అలాగే కాయలు ఉన్న చీనీ తోటలలో పండు ఈగ కొరకు ఫ్రూట్ ఫ్లే ట్రాప్ పెట్టడం వలన పండు ఈగ ఉద్రుతిని తగ్గించవచ్చు. బక్కన్న గారి పల్లె, వెలమ వారి పల్లె గ్రామాలలో ప్రధాన పంట అయిన అరటి పంటలలో సిగ టోగ తెగులును గుర్తించడం జరిగింది.దీని నివారణకు ఎకరాకు 2 కిలోల ట్రై కో డ ర్మ విరిడి పౌడర్ ను 200 లీటర్స్ నీటిలో కలిపి పిచకారీ చేయాలి ఇలా 15 రోజులకు ఒకసారి పిచి కారి చేస్తూ భూమి కి కూడా ఇవ్వడం వలన నివారించ వచ్చు. అలాగే పత్తి పంటలో దోమ,కాయ తొలుచు పురుగు ఉదృతి ఎక్కువగా ఉంది.దీని నివారణకు ఎకరాకు 25-30 జిగురు పల్లాలు, 10 లింగ కర్షక బుట్టలు పెట్టడం వలన ఉదృతి తగ్గించవచ్చు మరియు వేపనూనె పిచికారి చేయాలి.
అలాగే పసుపు జిగురు పల్లాలు, లింగాకర్షక బుట్టలు, పశువుల దాణా, వేప నూనె , తార్పాలిన్ పంటలు మన వేంపల్లి రైతు ఉత్పత్తి దారుల సంఘం లో అందుబాటులో ఉన్నాయి.కావలసినటువంటి రైతులు 6300235907 కు ఫోన్ చేయగలరు.
అలాగే మీ వ్యవసాయానికి సంబంధించి ఏమైనా సమస్యలు ఎదుర్కొంటున్నారా.??
👉 భూమి రికార్డులు
👉పంట రుణాలు
👉 కౌలు రైతుల సమస్యలు
👉 విత్తన సమస్యలు
👉 మార్కెట్ యార్డులు, ధరలు
👉 వ్యవసాయ సబ్సిడీ, పెట్టుబడి పథకాలు
👉 ప్రకృతి వైపరీత్యాల వలన నష్టం
అయితే పరిష్కారం కొరకు కిసాన్ మిత్ర నెంబర్ 8500983300కు phone చేయండి

About the author

Bhairava Kumar M administrator

Leave a Reply