42-1(19.10.2022) Vepada farm advisory

42-1(19.10.2022) Vepada farm advisory

Centre for Sustainable Agriculture
Vepada farm advisory
Date: 17.10.2022
సుస్థిర వ్యవసాయ కేంద్రం-వేపాడ మండలం లో రాగల ఐదు రోజులు వాతావరణ సూచన – 6-15mm మొతాదులో తెలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే సూచన ఉంది. గరిష్ట ఉష్ణోగ్రత 33-36డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 23-24డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. గాలి గంటకి 4-7km వేగంతో పడమర దిశగా వీయ్యవచ్చు. గాలిలో తేమసాతం 59-87% ఉండవచ్చును.
👉 బొద్దాం,R.S పేట,PKR పురం,Sksr పురం,సోంపురం, జగ్గయ్యపేట, చామలపల్లి గ్రామలలో వరిలో పొడ తెగులు ఉదృతి ఎక్కువగా ఉన్నాఁధున రైతులు గట్లపై ఉన్న కలుపు మొక్కలను తీసి ,5%వేప కషాయం పిచికారి చేయవలెను.లేధ పెడ, మూత్రం, ఇంగువ ద్రావణం పిచికారి చేయవచ్చును.
👉కోటయ్యగరువు, సారవానిపాలెం గ్రామాల్లో వరిలో ఆకుపచ్చ కొమ్ము పురుగు నివారణకు రైతులు లార్వాలను నసింపచేసి పంచపత్ర కషాయం పిచికారి చేయవలెను.
👉 మరియు వరిలో ఎలుకల నివారణకు రైతులు పొలం లో ఉన్న బొరియలను పూడ్చి , విషపు ఎరలుగా గ్లైరిసిడియా ఆకులను మెత్తగా నూరి టమాటతో కాని గోధుమ పిండిలో కానీ కలిపి ముద్దలుగా చేసి పొలాల్లో ఉంచినట్లైతే ఎలుకలు అవి తిని చనిపోయే అవకాశం ఉంధీ.అలాగే పొలాల్లో పాములు రాకుండా సర్పగంధ,నిమ్మ గడ్డిని పెంచుకుని నివారించవచ్చును.
👉మరియు మెట్టప్రాంతాలలో చిరుధాన్యాలు,పండ్ల తోటలలో అంతర పంటలుగా మినుములు,పెసలు,ఉలవలు మో|| పంటలను వేసుకుంటున్న రైతులు బీజామృతంతో విత్తన సుద్ధి చేసుకొని విత్తుకున్నట్లైతే విత్తనములు నుండి సంక్రమించే వ్యాధులు రాకుండ రక్షణ కలిగించవచ్చును.
👉 మరింత సమాచారం కోసం 8500983300 ఈ నంబర్ కు కాల్ చేయండి.

About the author

Anusha V administrator

Leave a Reply