Date:08/04/2023
Centre for Sustainable Agriculture
సుస్థిర వ్యవసాయ కేంద్రం-వేపాడ మండలం లో రాగల ఐదు రోజులు వాతావరణ సూచన – ఆకాశం మేఘావృతమై ఉండి 0-9mm మొతాధులో తెలికపాటి వర్షం కురిసే సూచన ఉంది.
గరిష్ట ఉష్ణోగ్రత 34డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 22-24డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. గాలి గంటకి 14km వేగంతో తూర్పు నుండి దక్షిణ దిశగా వీయ్యవచ్చు. గాలిలో తేమసాతం 67-71% ఉండవచ్చును.
👉🏻కెజి పూడి, కరకవలస క్లస్టర్లు అయిన గ్రామాల్లో ప్రస్తుతం నువ్వులు వేస్తున్న రైతులు బీజరక్షతో విత్తన సుద్ధి చేసుకొని వెదజల్లవలెను. మరియు నువ్వులతో పాటు పలు రకాల పోషకాలు లభించె నవధాన్యాలు అయిన పప్పుజాతి,నూనెజాతి,తీగజాతి, సుగంధద్రవ్యాలు, కూరగాయలు,ఆకుకూరలు మొ// విత్తనాలను కలిపి వేసుకున్నట్లైతే భూమిలో సత్తువ పెరిగి అధిక దిగుబడి మరియు అదనపు ఆధాయం కూడా రైతులు పొందవచ్చు.
👉🏻అలాగే ఇంటి వెనుక పెరటి తోటలలో గాని మిద్దె పైన గాని గృహ అవసరాలకు సరిపడ కురగాయాలు కూడా రైతులు వేసుకోవలెను
👉🏻డబ్బిరాజుపేట, సారవానిపాలెం, సొంటివానిపాలెం,SKSR పురం బొద్ధం గ్రామాల్లో రాగులు,కూరగాయలు వేసుకున్న రైతులు రసం పీల్చు పురుగుల నివారణకు జిగురు అట్టలను పొలాల్లో 20-25వరకు ఎకరానికీ ఏర్పరచవలెను మరియు మొక్కల ఎధుగుదలకు ద్రవజీవామృతం పారించవలెను
👉🏻మరియు అధిక ఉష్ణోగ్రత కారణంగా పశువులను నీడలో కట్టి గడ్డి మరియు నీరు అందుబాటులో ఉండే విధముగా ఉంచవలెను
👉 మరింత సమాచారం కోసం 8500983300 ఈ నంబరును
About the author