Centre for Sustainable Agriculture-Vepada farm advisory
వేపాడ మండలం లో రాగల ఐదు రోజులు వాతావరణ సూచన వర్షం కురిసే సూచన లేదు. గరిష్ట ఉష్ణోగ్రత 32-36 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 15-12 డిగ్రీ లు గా ఉండే అవకాశం ఉంది. గాలి గంటకి 3-10కి.మి. వేగం తో వీయవచ్చు.
కోటయ్య గరువు, సారవాని పాలెం,పోతుబందీపాలెం,పాతురు , వెంకయ్యపాలెం , కే. జీ పుడి, బంగారయ్య పేట, చిట్టివానిపాలెం గ్రామాలలో జీడిమామిడి పూత దశ నుండి పిందె దశకు వస్తుంది కావున పంచగవ్య పిచికారి చేసుకుంటే పిక్క బరువు ఎక్కువ గా పెరుగుతుంది.
వరి లో ఆకు ముడత ఉదృతి జగ్గయ్య పేట,కోటయ్య గరువు గ్రామాలలో ఎక్కువగా ఉంది. దీనిని నివారించడానికి కంపను లాగించాలి, అలానే 5% వేప కషాయం పిచికారి చేసుకోవాలి.
వంగలో కాయ తొలుచు పురుగు ఉదృతి P.K.R. పురం, SkSR పురం, కె.జి. పూడి, ఉంది దీని నివారించడానికి వేప కషాయం పిచ్చికారి చేయాలి.
మరింత సమాచారం కోసం 8500983300 ఈ నంబర్ కు కాల్ చేయండి.