Centre for Sustainable Agriculture-Vepada farm advisory
వేపాడ మండలం లో రాగల ఐదు రోజులు వాతావరణ సూచన వర్షం కురిసే సూచన లేదు. గరిష్ట ఉష్ణోగ్రత 34-36 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 19-20 డిగ్రీ లు గా ఉండే అవకాశం ఉంది. గాలి గంటకి 7-9కి.మి. వేగం తో వీయవచ్చు.
కోటయ్య గరువు , జగ్గయ్యపేట గ్రామాల్లో వరి వేసుకున్న రైతులు
ప్రతి 15 రోజులకు ఒకసారి ద్రవజీవామృతం పారించటం వలన మొక్క ఎదుగుదల మరియు దిగుబడి పెరుగుతోంది.
బోద్ధాం, రామస్వామిపేట, పి.కే.అర్. పురం, ఎస్.కే.ఎస్.అర్ పురం గ్రామాలలో బీర లో పల్లాకు తెగులు ఎక్కువగా ఉందీ దీనిని నివారించటం కోసం పుల్లటి మజ్జిగ పిచికారి చేయవలెను .
పి.కే.అర్. పురం, దబ్బిరాజు పేట గ్రామాలలో టోమాటోలో ఆకు మాడు తెగులు ఉదృతి ఎక్కువగా ఉందీ దీనిని నివారించడానికి రైతులు ముందుగా పొలం నుండి తెగులు సోకిన మొక్కల ను వేరుచేయాలి, తరువాత పుల్లటి మజ్జిగలో రాగిపాత్రను ఉంచి 3 రోజులు తర్వాత పిచికారి చేయవలెను.
పి.కే.అర్.పురం, ధబ్బిరాజుపేట గ్రామాలలో మిరప లో ఆంత్రాక్నోస్ తెగులు ఉంది దీనిని నివారణకు పెడ+మూత్రం+ఇంగువ ద్రావనం పిచికారి చేసుకోవాలి.
మరింత సమాచారం కోసం 8500983300 ఈ నంబర్ కు కాల్ చేయండి.