హామీ…మాఫీ

హామీ…మాఫీ

మోహన్ రుషి
ముఖ్యమంత్రిగా చంద్రబాబు అధికారం చేపట్టి ఐదు నెలలు పూర్తయింది. కానీ గెలవగానే తొలి సంతకం చేస్తానంటూ ఎన్నికల్లో ఆయనిచ్చిన హామీ మాత్రం ఇప్పటికీ నెరవేరలేదు. తమ పార్టీ గెలిస్తే రైతు రుణాలన్నీ మాఫీ చేస్తానని, తొలి సంతకం ఆ ఫైలుపైనే అని చెప్పిన చంద్రబాబు చేసిందేంటో తెలుసా?  ఎలా చేయాలో చెప్పండంటూ ఓ కమిటీని మాత్రం వేశారు. ఆ తరవాత మాఫీపై ఎన్ని మాయదారి ఫీట్లు వేశారో తెలుసా? అడుగడుగునా ఆంక్షలు విధించారు.
సాధ్యమైనంత ఎక్కువ మంది రైతులకు ప్రయోజనం కల్పించాల్సిన ముఖ్యమంత్రి… వీలైనంత ఎక్కువ మందిని ఈ మాఫీ పరిధి నుంచి తప్పించడానికి బోలెడంత కసరత్తు చేశారు. ఆ ఫీట్ల ఫలితమేంటో తెలుసా? రైతులకు ఇప్పటికీ ఒక్క రూపాయి మాఫీ కాలేదు. సరికదా… రాష్ట్రంలోని రైతులు, డ్వాక్రా మహిళలపై ఇప్పటికి దాదాపు 17,500 కోట్ల వడ్డీ భారం (16 నెలలకు) పడింది. రుణ మాఫీ విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు మాయదారి ఫీట్ల తీరుతెన్నులు మీరే చూడండి…
బాబు ఏ సందర్భంలో ఏం చెప్పారో… తరవాత ఆ మాట ఎలా తప్పారో ఒక్కసారి చూస్తే…
►రైతులు, డ్వాక్రా మహిళల రుణాలన్నింటినీ మాఫీ చేస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. టీడీపీ ఎన్నికల ప్రణాళికలో కూడా ఇదే హామీని పొందు పరిచారు. ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన వేదికపై రుణాలు మాఫీ చేస్తూ సంతకం పెట్టలేదు. రుణాల మాఫీ విధివిధానాల ఖరారు కోసం కోటయ్య కమిటీని ఏర్పాటు చేస్తూ ఆ ఫైలుపై సంతకం చేశారు.
►కోటయ్య కమిటీ నివేదిక ఇవ్వక ముందే మంత్రులు మాట్లాడుతూ.. రుణ మాఫీకి ఆధార్ లింక్ పెడతామన్నారు. ఆ తర్వాత లక్ష రూపాయల వరకే మాఫీ అన్నారు. మరోసారి లక్షన్నర వరకు మాఫీ అన్నారు. మరో మంత్రి బంగారంపై తీసుకున్న రుణాల మాఫీ సాధ్యం కాదని చెప్పేశారు.
►ఇక ముఖ్యమంత్రి జూన్ 22న కోటయ్య కమిటీతో నిర్వహించిన సమీక్షలో ‘రుణ మాఫీ తర్వాత చూద్దాం. ప్రస్తుతానికి గత ఖరీఫ్‌లో కరువు, తుపాను ప్రభావిత 575 మండలాల్లో రైతుల రుణాలను రీ షెడ్యూల్ చేయిద్దాం.
►ఆర్‌బీఐ గవర్నర్‌తో మాట్లాడండి..’ అంటూ ఆదేశించారు. ళీ జూన్ 29న రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో వ్యవసాయ రుణాలు రూ.87,612 వేల కోట్లు, మహిళా సంఘాల రుణాలు రూ.14,204 వేల కోట్లు ఉన్నట్లు తేల్చారు. ళీ ఆర్‌బీఐ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాస్తూ రైతు రుణ బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి బ్యాంకులకు చెల్లిస్తే రుణ మాఫీకి అభ్యంతరం లేదన్నారు.
►కోటయ్య కమిటీ ఆర్‌బీఐతో రుణాల రీ షెడ్యూల్‌పై జరిపిన చ ర్చలు విఫలం అయ్యాయి. ఆర్‌బీఐ కేవలం నాలుగు జిల్లాల్లో 120 మండలాల్లోని పంట రుణాల రీ షెడ్యూల్‌కే అనుమతించింది.
►జూలై 21న కోటయ్య కమిటీ ముఖ్యమంత్రికి నివేదిక అందజేసింది. అదేరోజు చంద్రబాబు విలేకరులతో మాట్లాడుతూ ఈ ఏడాది మార్చి నెలాఖరు వరకు ఉన్న వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించారు. ఒక్కో కుటుంబానికి లక్షన్నర వరకు మాఫీ చేస్తామన్నారు. డ్వాక్రా సంఘాలకు మాఫీ చేయబోమని, మూల ధన సాయంగా ఒక్కో సంఘానికి లక్ష రూపాయల వరకు ఇస్తామని చెప్పారు.
►ఆగస్టు 14న మాఫీకి పలు ఆంక్షలు విధిస్తూ ఆర్థిక శాఖ మార్గదర్శకాలను జారీ చేసింది. గత ఏడాది డిసెంబర్ 31వ తేదీ వరకు తీసుకున్న పంట రుణాలు, బంగారం కుదవ పెట్టి తీసుకున్న వ్యవసాయ రుణాలు, ఆ రుణాలపై ఈ ఏడాది మార్చి వరకు అయ్యే వడ్డీ కలిపి ఒక్కో కుంటుంబానికి లక్షన్నర వరకు మాఫీ పరిధిలోకి వస్తాయని అందులో పేర్కొన్నారు.
►ఆర్థిక శాఖ తొలి మార్గదర్శకాలను సవరిస్తూ ఈ నెల 1న మరో జీవో జారీ అరుుంది. దాన్లోనూ గత ఏడాది డిసెంబర్ 31వ తేదీ వరకు తీసుకున్న రుణాలకు, అప్పటిదాకా వడ్డీకి మాత్రమే మాఫీ అంటూ వడ్డీలోనూ కోత పెట్టారు.
►23 అంశాలతో రూపొందించిన నమూనా పత్రంలో బ్యాంకులు రైతుల ఖాతాల వివరాలను రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ప్రత్యేక వెబ్‌సైట్‌కు అందజేయాలని పేర్కొన్నారు. ఆ గడువు ఈ నెల 1తో ముగిసింది. చివరకు బ్యాంకులు చచ్చీచెడీ మొత్తం డేటాను అందజేసినా… మాఫీకి అర్హులైన వారి జాబితాను ఇంకా ప్రకటించలేదు

About the author

admin administrator

Leave a Reply