రాజధాని కి ముప్పై వేల ఎకరాలు అవసరమా?

రాజధాని కి ముప్పై వేల ఎకరాలు అవసరమా?

Land Grab
హర్ష గజ్జారపు
a) ప్రపంచ అతి పెద్ద ప్రజాస్వామ్యం చిహ్నమయిన ‘భారతీయ ప్రలమెంటరీ భవనం’ కేవలం 9.8 ఎకరాల మొత్తం ప్రాంగణంలో కేవలం 6 ఎకరాలలో నిర్మించబడింది.
b) అగ్రరాజ్యం అమెరికాలోని ‘వైట్ హౌస్’ కుడా కేవలం 18 ఎకరాలలో నిర్మించబడింది.
c) హైదరాబాద్ లోని అసెంబ్లీ, సెక్రటేరియట్, MLA క్వాటర్ మరయు ఇతర అభికారుల భవానాలు అన్ని కలిపి కేవలం 250 ఎకరాలలో నిర్మించబడ్డాయి.
వీటినిబట్టి, కొత్త  నిర్మాణానికి అసలు “30,000 ఎకరాల భూమి” ఎందుకుకావాలి..??
30,000 ఎకారాలంటే, సుమారు 121 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణత.
బెంగుళూరు లోని విధాన్ సౌధా, MLA క్వాటర్ మరయు రాజ్ భవన్ అన్ని కలిపి కేవలం 1.5 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణతలో నిర్మించబడ్డాయి.
మరి, కొత్త రాజదానికి 30,000 ఎకారాలు (121 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణత) భూములు అవసరమా.??
30,000 ఎకారాలు (121 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణత) అంటే, అది విజయవాడ-గుంటూరు రెండు నగరాలను కలపగా వచ్చే విస్తీర్ణత కంటే ఎక్కువ!
దేనికోసం అంత భూమి.??
దానికి తోడు, ఆ పొలాల్లో నాలుగు పంటలు పండుతాయి.
ఆ భూముల్లో 20 అడుగుల్లోనే నీరు ఉంటుంది.
ఐదేళ్లుగా వర్షం పడకపోయినా, ఆ భూముల్లో బంగారం లాంటి పంటలు పండుతున్నాయి.
ఇటువంటి అమూల్యమైన వ్యవసాయ భూములను, రైతులనుండి లాక్కొని, వారికి నష్టం కలిగించేలా, వారి జీవనోపాధి దూరంచీసి, వారి భూములను రియల్ ఎస్టేట్ వ్యాపార-బిల్డర్లకు కట్టబెట్టడం, ‘ధర్మమా’..??

About the author

admin administrator

Leave a Reply