14-1(6-4-2022) Vepada Farm Advisory

14-1(6-4-2022) Vepada Farm Advisory

Date: 6-4-2022
Centre for Sustainable Agriculture-Vepada farm advisories
వేపాడ మండలం లో రాగల ఐదు రోజులు వాతావరణ సూచన – వర్షం కురిసే సూచన లేదు. గరిష్ట ఉష్ణోగ్రత 35-37 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 23-25డిగ్రీలు గా ఉండే అవకాశం ఉంది. గాలి గంటకి 11-15కి.మి. వేగం తో వీయవచ్చు.
Pkr పురం, రామస్వామిపేట, దబ్బిరాజుపేట,జగ్గయ్యపేట, గ్రామాల్లో వంగ మరియు బెండలో కాయ తోలుచు పురుగు ఉదృతి ఉంది దీని నివారణకు రైతులు ఎకరంకు 10-12 లింగాకర్షక బుట్టలు అమర్చవలెను మరియు పంచపత్ర కషాయం లేద బ్రహ్మాస్త్రం పిచికారీ చేసుకోవలెను.
Pkr పురం,sksr పురం గ్రామాల్లో బరబాటిలో ఆకు మచ్చ తెగులు ఆసించడం వల్లన ఆకులుపై మచ్చలు ఏర్పడి మొక్క ఎదుగుదల తగ్గుతుంది దీని నివారణకు నీమాస్త్రం పిచికారి చేయవలెను.
కే.జీ పూడి, పాతురు, sksr పురం, Pkr పురం గ్రామలలో మామిడిలో తేనే మంచు పురుగును నివారించడానికి వేపనూనె లేదా కానుగ సంబందిత నూనెను పిచికారి చెయవలెను.
మరింత సమాచారం కోసం 8500983300 ఈ నంబర్ కు కాల్ చేయండి.

About the author

Anusha V administrator

Leave a Reply