16-2(23-4-2022) Vepada Farm Advisory

16-2(23-4-2022) Vepada Farm Advisory

Date: 23-4-2022
Centre for Sustainable Agriculture-Vepada farm advisories
వేపాడ మండలం లో రాగల ఐదు రోజులు వాతావరణ సూచన – 0-11milli mitre మోతదులో వేరువేరు చోట్ల తేలీకపాటి వర్ష0 కురిసే సూచన ఉంది. గరిష్ట ఉష్ణోగ్రత 38-41 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 26-27డిగ్రీలు గా ఉండే అవకాశం ఉంది. గాలి గంటకి 12-16km వేగంతో వీయవచ్చు. కె.జి.పూడి, ఎస్.కె.ఎస్.ఆర్ పురం క్లస్టర్లలో ఉన్న రైతులు ప్రధాన పంట వేసుకునే 2నెలల ముందు నవధాన్యాల సాగును చేసుకోవాలి. 1 పంట విధానం కాకుండ 9రకాల పంట విత్తనాలు విట్టుకోవడాన్నే నవధాన్య సాగు అంటారు. నవధాన్యాలు అనగా కందులు, పెసలు, ఉలవలు, మినుములు, జనుమ, జీలుగ, పిల్లి పెసర, కొర్ర, గోగులు, జొన్న, అలసందలు, సజ్జలను 30-40రోజులు పెరగనిచ్చి బూమిలో కలియదున్నాలి. ఇలా చెయ్యడం వలన నేల సారాన్ని పెంచుకోవచ్చు, నీటిని ఎక్కువ రోజులు నిల్వ చేసుకునే సామర్ధ్యం నేలకు అందించవచ్చు. పురుగు,తెగులు శాతం అదుపులో ఉంటుంది. మొక్కకు కావల్సిన పోషకాలు సమానంగా అందింఛి ఎక్కువ దిగుబడిని రైతులు పొందవచ్చు.
మరింత సమాచారం కోసం 8500983300 ఈ నంబర్ కు కాల్ చేయండి.

About the author

Anusha V administrator

Leave a Reply