19-1(11-5-2022)Vepada Farm Advisory

19-1(11-5-2022)Vepada Farm Advisory

Date: 11-5-2022
Centre for Sustainable Agriculture-Vepada farm advisory
వేపాడ మండలం లో రాగల ఐదు రోజులు వాతావరణ సూచన -అసని తుఫాన్ కారణంగా 8-30mm మోతదులో వర్ష0 కురిసే సూచన ఉంది. గరిష్ట ఉష్ణోగ్రత 30-36 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 20-25డిగ్రీలు గా ఉండే అవకాశం ఉంది. గాలి గంటకి 8-18km వేగంతో వీయవచ్చు. కె.జి.పూడి,SKSRపురం, క్లస్టర్లులో నువ్వులు వేసుకున్న రైతులు పొలంలో అధనపు నీరు బయటికి పోయేలా కాలువలను తయారు చేసుకోవలెను. మరియు జీడి,మామిడి మరియు అధనపు పండ్ల తోటలులో గాలికి విరిగిపోయిన కొమ్మలను తీసేసి విరిగిన చోట చదునుగా కత్తిరించి సున్నం గాని వేప లేపనం గాని పూయవలెను. నీట మునగిన , వేర్లతో పెకిలించుకుపోయిన మొక్కలలో అధిక నీరుని తీసి వర్షం తగ్గిన తరువాత జీవామృతం గాని ఘనజీవామృతం గాని వేసినట్లైతె మొక్కలకు తిరిగి జీవం పొందించవచ్చు . అధిక వర్షాలు కారణంగా కురగాయలలో తెగుల్లు త్వరగా సోకవచ్చు కనుక ఆవుపేడ+ఆవుమూత్రం+ఇంగువ ద్రావణంను పిచికారి చేయవలెను.
మరింత సమాచారం కోసం 8500983300 ఈ నంబర్ కు కాల్ చేయండి.

About the author

Anusha V administrator

Leave a Reply