27-2( 9-7-2022) Vepada Farm Advisory

27-2( 9-7-2022) Vepada Farm Advisory

Date: 9-7-2022
Centre for Sustainable Agriculture-Vepada farm advisory
వేపాడ మండలం లో రాగల ఐదు రోజులు వాతావరణ సూచన – 6-40mm మొతాదులో వర్షం కురిసే సూచన ఉంది. గరిష్ట ఉష్ణోగ్రత 34-35 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 23-25డిగ్రీలు గా ఉండే అవకాశం ఉంది. గాలి గంటకి 9-15km వేగంతో దక్షిణం నుండి పడమర దిశగా వీయవచ్చు. కె.జి.పూడి,SKSR పురం క్లస్టర్లులో నారు మడులలో వరి విత్తనాలు వేసుకోవాలనుకునే రైతులు బీజామృతం తో విత్తనశుద్ధి చేసుకొని విత్తుకోవలెను. బీజమృతం తయారు చేసుకొనుటకు 20lt నీరు, 5kg ఆవు పేడ, 5lt ఆవు మూత్రం,50gm సున్నం, పిడికెడు పుట్టమన్ను తీసుకోవాలి. 20lt నీటిలో పెడను గుడ్డలో మూటకట్టి vrelada deeyavalenu. ఇందులో ఆవు మూత్రం ,సున్నం కలుపుకొని 12hrs అలాగే ఉంచు రోజుకి రెండు సార్లు కర్ర సహాయంతో కలుపుకోవాలి. ఇలా తయారుచేసుకున్న బీజామృతమును విత్తడానికి సిద్ధముగా ఉన్న విత్తనలపై చల్లి నీడలో ఆరబెట్టిన తర్వాత విత్తుకోవలెను. దీనివలన విత్తనం బాగా మొలకెత్తి, విత్తనం నుండి సంక్రమించే వ్యాధులను నియ0త్రిస్తుంది.మరింత సమాచారం కోసం 8500983300 ఈ నంబర్ కు కాల్ చేయండి.

About the author

Anusha V administrator

Leave a Reply