తల్లమపురం క్లస్టర్ సౌరెడ్డి పల్లి,కల్లూరు, తల్లమపురం, సీతంపల్లి,యారగుంట్లపల్లి లో గ్రామాలలో ప్రధాన పంట అయిన వరి నాట్లు సిద్ధం చేసుకుంటున్న రైతులు ముఖ్యంగా
వరిలో పాటించవలసిన మెళకువలు
1.భూసార యాజమాన్య పద్ధతులు
2.సేంద్రియ వ్యవసాయము లో చేయవలసిన పద్ధతులు
* నారుసుద్ది
*పసుపు, తెలుపు ప్లేట్స్
*రక్షకపంటలు
*లింకాకర్షక బుట్టల
*కోసలు తుంచి నాటడం
*కాలిబాటలు
*అజోళ్ళ
భూసార యాజమాన్య పద్ధతులు:
వివిధ రకాల విత్తనాలతో పచ్చి రొట్టె ఎరువులు పెంచి 40 రోజుల వయసులో భూమి లో దున్నాలి,మొక్కలకు పోషక పదార్థాలు అందించే సూక్ష్మ క్రిములు బాగా పెరిగి భూమిలో జీవపదారం అభివృద్ధి చెందుతుంది, సేంద్రియ పదార్థాలు సూక్ష్మజీవుల చర్య ద్వారా కుళ్ళి పోషకాలు విడుదల అవుతాయి.
ఈ విషయాలు రైతులు గమనించాలి.
*సేంద్రియ వ్యవసాయము లో చేయవలసిన పద్ధతులు
* నారుసుద్ది*
ఎపుడు; నారు నాటే ముందు
ఎందుకు: నారు ద్వారా ఆశించే తెగుళ్లు ను నివారించడానికి
*పసుపు, తెలుపు ప్లేట్స్
ఎపుడు; నారు నాట్లు వేసిన తర్వాత ,ప్లేట్స్ మొక్కలకు కొంచెం ఎత్తులో పెట్టుకోవాలి.
ఎందుకు: చిన్న చిన్న రసం పిలిచే పురుగుల యొక్క ఉధృతి ని తెలుసుకోవచ్చు, వాటిని నివారించవచ్చు.
ఎకరానికి 20నుండి 25 ప్లేట్స్ పెట్టాలి.
*రక్షకపంటలు
ఎపుడు:వరిలో నాట్లు వేసిన తర్వాత బంతి నారు నాట్లు వేయాలి.
ఎందుకు:పురుగుల, తెగుళ్లు వ్యాప్తి ని నివారించడానికి, మిత్ర పురుగుల అభివృద్ధి కి
*లింకాకర్షక బుట్టలు
వరిలో నాట్లు వేసిన తర్వాత 10నుంచి 15 పెట్టాలి, వరిలో కాండం తొలిచే పురుగు నివారించడానికి
కోసలు తుంచి నాటడం :
వరి నాట్లు వేయడానికి ముందు ,కాండంతొలిచే పురుగు గుడ్ల సముదాయం నివారించడానికి, నాటే ముందు కోసలు తుంచి నాటాని
*కాలిబాటలు
వరి నాట్లు వేసే సమయంలో దోమ పొట్టు మరియు రసం పీల్చే పురుగుల నియంత్రించేందుకు వరిలో ప్రతి 2 metres లకు 30 cm కాలి బాటలు వదలాలి.
వరిలో అజోళ్ళ
పంటకు నత్రజని అందించడానికి, కలుపు నివారణకు ఉపయోగపడతాయి.
మరింత సమాచారం కోసం 8500983300 ఈ నెంబర్ కు కాల్ చేయండి.
About the author