33-2022(19-08-22)Vempalli Farm Advisory

వేంపల్లె మండలం లో రాగల మరో 5 రోజుల యొక్క వాతావరణ సూచన – గరిష్ట ఉష్ణోగ్రత -36 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీలు గా వుండే అవకాశం వుంది. రాగల మరో 5 రోజుల్లో 2 ᵐᵐ వర్షపాతం ఉండును. గాలిలో తేమ 62%, అలాగే గంటకి 6 కి.మి. వేగంతో పడమర దిశ గ గాలులు వీయవచ్చును .
టివి పల్లె క్లస్టర్ లోనీ కుప్పలపల్లి , వెలమవారిపల్లి , బక్కన్నగారిపల్లి గ్రామాలలో ప్రధాన పంట అయినటువంటి పత్తి పంట లో రసం పీల్చు పురుగు ల నివారించుటకు ఒక ఎకరానికి 25 నుండి 30 వరకు పసుపు జిగురు పల్లెములు పెట్టాలి. ఆ తరువాత వావిలకు కషాయం 5 లిటర్స్ ను 100 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి..ఈ విధంగ చేయడం వలన పురుగుల ఉదృతి నివారణ అవుతుంది. పత్తి లో పేను బంక నివారణకై నీటిని స్ప్రే చేయండి. అలాగే పత్తి పంట లో గులాబీ రంగు పురుగు ఉధృతి ని గమనించుట కొరకై ఒక ఎకరా పొలం లో లింగ కర్షక బట్టలు 8 నుండి 10 పెట్టుకోవాలి. పురుగులను అదుపులో ఉంచుటకు పంట చుట్టూ ముందు జాగ్రత్తగా బార్డర్ క్రాప్ గా జొన్న, సజ్జ, అంతర పంటలుగా కంది, మటిక, బెండ, అలసంద , అనప ఎర పంటగా ఆముదం వేసుకోవాలి. ఇలా అన్ని రకాల పంటలు వేసుకోవడం వలన మిత్ర పురుగుల సంతతి పెరిగి పురుగులు,తెగుళ్లను నివారించు కోవచ్చు.
అలాగే పసుపు జిగురు పల్లాలు, లింగాకర్షక బుట్టలు, పశువుల దాణా, విత్తనాల కిట్లు ( అంతర పంటలు వేసుకోవడానికి 11 రకాల విత్తనాలు ), జీవామృతం తయారీకి కావాల్సిన బెల్లం, వేప నూనె మన వేంపల్లి రైతు ఉత్పత్తి దారుల సంఘం లో అందుబాటులో ఉన్నాయి.కావలసినటువంటి రైతులు 6300235907 కు ఫోన్ చేయగలరు.
అలాగే మీ వ్యవసాయానికి సంబంధించి ఏమైనా సమస్యలు ఎదుర్కొంటున్నారా.??
👉 భూమి రికార్డులు
👉పంట రుణాలు
👉 కౌలు రైతుల సమస్యలు
👉 విత్తన సమస్యలు
👉 మార్కెట్ యార్డులు, ధరలు
👉 వ్యవసాయ సబ్సిడీ, పెట్టుబడి పథకాలు
👉 ప్రకృతి వైపరీత్యాల వలన నష్టం
తదితర సమస్యల పరిష్కారం కొరకు csa కిసాన్ మిత్ర నెంబర్ 8500983300కు phone చేయండి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *