34-1(24-8-2022) Vepada Farm Advisory

34-1(24-8-2022) Vepada Farm Advisory

Date: 24-8-2022
Centre for Sustainable Agriculture-Vepada farm advisory
వేపాడ మండలం లో రాగల ఐదు రోజులు వాతావరణ సూచన – 8-25mm మొతాదులో వర్షం కురిసే సూచన ఉంది. గరిష్ట ఉష్ణోగ్రత 33-36డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 23-27డిగ్రీలు గా ఉండే అవకాశం ఉంది. గాలి గంటకి 4-9km వేగంతో దక్షిణం దిశగా వీయవచ్చు. కరకవలస,జగ్గయ్యపేట గ్రామాల్లో వరిలో ఆకుముడత పురుగు ఉన్న0దువలన రైతులు కంప లాగి, మడిలో నీరును వదిలి మల్లీ నీరు కట్టవలెను. అలాగే బోద్ధం, కరకవలస,ధబ్బిరాజుపేట గ్రామాల్లో కాండం తొలుచు పురుగు నివారణకు ఎకరానికి 5-6లింగాకర్షక బుట్టలను అమర్చి, 5% వేప కషాయం పిచికారి చేసుకోవలెను. మరియు kg PUDI, sksr puram క్లస్టర్లులో రైతులు పచ్చ దోమ, తెల్ల ధోమ పురుగుల నివారణకు పసుపు పల్లాలు ఎకరానికి 15-20వరకు అమర్చి, తూటికాడ కషాయం పిచికారి చేసుకోవలెను. అలాగే పొలంలో పక్షి స్థావరాలు ఏర్పాటు చేయడం వల్ల పక్షులు ఆ పురుగులను తిని పంట నాశనం జరగకుండా తోడ్పడతాయి. మరింత సమాచారం కోసం 8500983300 ఈ నంబర్ కు కాల్ చేయండి.

About the author

Anusha V administrator

Leave a Reply