44-2022(5-11-2022) Vepada Farm Advisory

44-2022(5-11-2022) Vepada Farm Advisory

Centre for Sustainable Agriculture
Date: 5/11/2022
సుస్థిర వ్యవసాయ కేంద్రం-వేపాడ మండలం లో రాగల ఐదు రోజులు వాతావరణ సూచన – ఆకాశం మేఘవృతమై ఉండి 3-10mm మోతదులో తేలికపాటి వర్షం కురిసే సూచన ఉంది.
గరిష్ట ఉష్ణోగ్రత 32-36డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 18-20డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. గాలి గంటకి 6-8km వేగంతో తూర్పు నుండీ ఆఘ్నేయ దిశగా వీయ్యవచ్చు. గాలిలో తేమసాతం 49-68% ఉండవచ్చును.
👉బోద్ధం, R.S పేట, Pkr పురం, Sksr పురం, సోంపురం,జగ్గయ్యపేట, చామలపల్లి గ్రామాల్లో బాక్టీరియా కంకి యెండు తెగులు నివారణకు రైతులు సొంటిపాల కషాయం పిచికారి చేసుకోవలెను.
👉KG పూడి, Sksr పురం క్లస్టర్లులో జీడి,మామిడి,అరటి తోటలలో మొక్క ఏధుగుధలకు,పురుగులు,తెగుళ్లు అధుపులో ఉండుటకు, మరియు పంటకు కావాల్సిన అన్నీ సూక్ష్మ,స్థూల మూలకాలు మొక్కలకు అందించుటకు ఎకరానికి 3lt పంచగవ్యను 100lt నీటికి కలుపుకొని పిచికారి చేసుకోవలెను.
👉 మరియు రబీలో అంతర పంటలుగా చిరు ధాన్యాలు,పప్పు దినుసులు వేసుకుంటున్న రైతులు బీజామృతంతో విత్తనశుద్ధి చేసుకొని విత్తుకోవలెను.
👉 మరింత సమాచారం కోసం 8500983300 ఈ నంబరును సంప్రదించగలరు.

About the author

Anusha V administrator

Leave a Reply