46-2022(19-11-2022) Vepada Farm Advisory

సుస్థిర వ్యవసాయ కేంద్రం-వేపాడ మండలం లో రాగల ఐదు రోజులు వాతావరణ సూచన – వర్షం కురిసే సూచన లేధు.
గరిష్ట ఉష్ణోగ్రత 32-34డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 18-21డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. గాలి గంటకి 6-10km వేగంతో పడమర నుండీ వాయువ్య దిశగా వీయ్యవచ్చు. గాలిలో తేమసాతం 42-72% ఉండవచ్చును.
👉 బొద్ధం, R.S పేట, PKR పురం, sksr పురం, జగ్గయ్యపేట, సోంపురం, గుడివాడ, కరకవలస గ్రామాల్లో వరిలో మానిపండు తెగులు ఉదృతి ఉన్నాందువలన రైతులు వావిలకు కషాయం కాని సీతాఫల కషాయం పిచికారి చేయవలెను.
మరియు KG పూడి ,SKSR పురం క్లస్టర్స్ లో వరిలో నాన్యత మరియు గింజ బరువు పెరుగుదలకు రైతులు సప్త ధాన్యంకుర కషాయం పిచికారి చేయవలెను.
👉 బొద్ధం, జగ్గయ్యపేట, pkr పురం గ్రామలలో మిరపలో ఆకుముడత ఉన్నందువలన రైతులు ఎకరానికీ 15-20నీలి రంగు జిగురు అట్టలను ఏర్పరచి వేపనూనె కానీ నీమాస్త్రం కానీ పిచికారి చేసుకోవలెను.
👉KG పూడి, Sksr పురం క్లస్టర్‌లో జీడి,మామిడి,అరటి తోటలలో అంతర పంటలుగా పప్పు దినుసులు, కూరగాయలు వేసుకోవలెను ఇలా చేయటం వలన 365రో. భూమిని కప్పి ఉంచడమే కాకుండ అంతర పంటల ఆధాయం కూడా రైతులకు లబిస్తుంది. అలాగే RDS పద్దతిలో పలు అంతర పంటలు వేసుకుంటున్న రైతులు బీజామృతంతో విత్తన శుద్ధి చేసుకొని విత్తుకోవలెను.
👉 మరింత సమాచారం కోసం 8500983300 ఈ నంబరును సంప్రదించగలరు.
Tags

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *