ప్రొద్దటూరు మండలం లో రాగల 5 రోజుల వాతావరణ సూచన – 25mm. గరిష్ట ఉష్ణోగ్రత -31డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 21డిగ్రీలు గా వుండే అవకాశం వుంది. గాలి గంటకి 9కి.మి. వేగంతో పడమర దిశా గ వీయవచ్చు .
👉 తల్లమా పురం క్లస్టర్ లో సౌరెడ్డి పల్లి,కల్లూరు, తల్లమా పురం, సీతంపల్లి,యారగుంట్లపల్లి , రేగుల్లపల్లి లో ఇప్పుడు అధిక వర్షాలకు పంట పొలాల్లో మురుగు నీటి కాల్వలను ఏర్పాటు చేసుకోవాలి , పొలంలో ఎరువులు వేయడం అపుకోవాలి,
వర్షాలు తగిన తర్వత
మురుగు నీటి ని
వీలైనంత వరకు బయటకు పంపించాలి
రైతులకు ముఖ్య సూచనలు
ఈ-క్రాప్ EKYC :-
👉 ఇప్పటివరకు ఎవరైతే పంట నమోదు చేపించి ఉన్నారో, అటువంటి రైతులు అందరూ ఇన్సూరెన్స్ కొరకు మరల మీయొక్క ఈకేవైసీని చేపించవలసి ఉన్నది.
కావున ఇందు కొరకు రైతులందరూ మీ యొక్క ఆధార్ కార్డు, పొలం పాస్ బుక్కు , ఆధార్ కి లింక్ అయిన సెల్ ఫోన్ తీసుకుని రైతు భరోసా కేంద్రం వద్దకు రావలెను.
🚨ఈకేవైసీ చేపించనటువంటి రైతులకు ఇన్సూరెన్స్, ఇతర పథకములు వర్తించవు. కావున పంట నమోదు చేపించిన ప్రతి ఒక్క రైతు EKYC చేపించవలెను.
సమయం :- ఉదయం 9.00 కి మొదలు పెట్టి, 11 గంటల వరకు చేయడం జరుగుతుంది. 11 గంటల తర్వాత సర్వర్ పని చేయదు.
*వర్షాకాలంలో పశువుల పెంపకం మరియు పోషణ
వర్షాకాలంలో పశువుల పెంపకం మరియు పోషణ తగివిధంగా జాగ్రత్తలు పాటిస్తే పాల దిగబడి తగ్గకుండా అలాగే రోగాల బారి న పడకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు.
పశువులను పాకలో పెట్టాలి, అధిక వర్షాలకు, గాలికి తడవకుండా ఏర్పాట్లు చేసుకోవాలి.
నీరు నిల్వ ఉండడం వల్ల దోమలు, ఈగలు పెరిగి వ్యాధుల వ్యాప్తికి కారణం అవుతాయి, కాబట్టి వీటి నిర్మూలనకు చర్యలు చేపట్టాలి.
అన్ని పశువులకు వ్యాధినిరోధక టీకాలు వేయించాలి.
మరింత సమాచారం కోసం 8500983300 ఈ నెంబర్ కు కాల్ చేయండి.