27-2022(09-07-2022) Proddatur Farm Advisory

27-2022(09-07-2022) Proddatur Farm Advisory

ప్రొద్దటూరు మండలం లో రాగల 5 రోజుల వాతావరణ సూచన – వర్షము 8mm కురిసే అవకాశం వుంది. గరిష్ట ఉష్ణోగ్రత -35 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 20 డిగ్రీలు గా వుండే అవకాశం వుంది. గాలి గంటకి 22 కి.మి. వేగంతో పడమర దిశా గ వీయవచ్చు .
తల్లమపురం క్లస్టర్ సౌరెడ్డి పల్లి,కల్లూరు, తల్లమపురం, సీతంపల్లి,యారగుంట్లపల్లి లో గ్రామాలలో ప్రధాన పంట కు సిద్ధం చేసుకుంటున్న రైతులు ముఖ్యంగా గత వారం లో చెపుకున్న విషయాలు మళ్ళీ ఒక సారి గుర్తు కు చేసుకున్నాము,విత్తనసుద్ది, ఘనజీవమృతం, ద్రావజీవమృతం
ఇప్పుడు ఈ వారంలో రైతులు మంచి విత్తనం యంపీక చేసుకోవాలి,, నారు పెట్టడానికి , అనువైన పొలాన్ని నారు మడి కోసం యంపీక చేసుకోవాలి,
నారుమడిలో మెళకువలు తెలీసుకున్నాము:
బెంగాల్ పద్ధతి నాట్లు,
సంప్రదాయం నాట్లు, బెంగాల్ వాళ్ళు నాట్లకు 2 సెంట్స్ నారు మడ్డి అయితే సరిపోతుంది, ఎకరాకు,
అదేవిధంగా సంప్రదాయం నాట్లు అయితే 4 నుంచి 5 సెంట్స్ లో నారు మడి సరిపోతుంది ఎకరాకు,
*నారు మడి ని వారం రోజుల వ్యవధిలో 3 సార్లు దమ్ము చేసి చదును చేయాలి ,బాగా చివికిన పశువుల ఎరువును 200 కిలోల 5 సెంట్స్ నారు మడికి వేయాలి,
*చివరి దమ్ము లో తయారు చేసుకున్న ఘనజీవమృతం, వేసుకోవాలి, ట్రైకోడర్మ 1kg నారు మడి కి వేసుకోవాలి,
మొలక కట్టిన విత్తనాన్ని బీజామృతం తో విత్తనసుద్ది చేయాలి, సెంటు నారు మడికి 4 to 5 కిలో చొప్పున నారు మడిలో పలుచగా నీరు పెట్టి చలలి, మరుసటి రోజు మడి నుంచి నీటిని పూర్తిగా తీసివేయాలి, ఆకులు బయటకు వచ్చే వరకు ఆరుతడి పెట్టాలి,
విత్తనం చలిన 7 to8 రోజుల కు 5 సెంట్స్ నారు మాడి కి 10:1 లో ద్రావజీవమృతం పారించాలి, అంటే 100 లీటర్ కు ఒక లీటర్ చొప్పున పారించాలి, ఇలా చేవడం వల్ల నారు బాగా ఉండి ,పిలకలు ఎక్కువ వచ్చి ,దిగుబడి అధికంగా ఉంటుంది.
మరింత సమాచారం కోసం 8500983300 ఈ నెంబర్ కు కాల్ చేయండి.

About the author

Bhairava Kumar M administrator

Leave a Reply