30-2022(25-07-22)Vempalli Farm Advisory

30-2022(25-07-22)Vempalli Farm Advisory

వేంపల్లె మండలం లో రాగల మరో 5 రోజుల యొక్క వాతావరణ సూచన – గరిష్ట ఉష్ణోగ్రత -36డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 21 డిగ్రీలు గా వుండే అవకాశం వుంది. రాగల 5 రోజుల్లో 11mm వర్షపాతం రాగలదని సూచన. అలాగే గంటకి 22 కి.మి. వేగంతో పడమర దిశా గ గాలులు వీయవచ్చును .
టివి పల్లె క్లస్టర్ లోనీ కుప్పలపల్లి ,టీవీ పల్లె, బక్కన్నగారిపల్లి గ్రామాలలో ప్రధాన పంట అయినటువంటి పత్తి పంట లో రసం పీల్చు పురుగుల ఉదృతి ఎక్కువగా ఉండటం వలన ఆకుముడత వస్తుంది.అలాగే పచ్చ దోమ వలన ఆకు చివర్లు ఎర్రగా మారి ఎండి పాలిపోవును. దీనిని నివారణ చేయడానికి ఒక ఎకరానికి జిగురు పల్లాలు 25 నుండి 30 వరకు పెట్టాలి. తరువాత వావిలకు కషాయం 5 లిటర్స్ ను 100 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి..ఈ విధంగ చేయడం వలన పురుగుల ఉదృతి నివారణ అవుతుంది. అలాగే పత్తి పంట లో గులాబీ రంగు పురుగు ఉధృతి ని గమనించుట కొరకై ఒక ఎకరా పొలం లో లింగ కర్షక బట్టలు 8 నుండి 10 పెట్టి ఎప్పటికప్పుడు పురుగు ల ఉదృతినీ గమనిస్తూ వుండాలి. అలాగే పత్తి లో మెగ్నీషియం మరియు చీనీ పంటలలో పోషక లోపల కొరకు జీవామృతం పారించలి. అలాగే అరటి పంటలలో ఇగురు వచ్చే సమయం లో పచ్చ పురుగు నివారణకు నీమస్త్రం లేదా వేపనూనె పిచికారి చేయాలి. అలాగే వర్షం ఆధారంగా వేసుకొనే పత్తి రైతులు ముందుగా బీజామృతం లేదా టి విరిడి తో విత్తన శుద్ధి చేసుకోవాలి. అలాగే మన ప్రాంతాల్లో అధిక గాలులు వీయడం వలన పూత, పిందెలు రాలిపోతున్నాయి. దీని చుట్టూ బార్డర్ క్రాప్ గా జొన్న, అంతర పంటలుగా కంది, మటిక, బెండ, అలసంద , అనప ఎర పంటగా బంతి,ఆముదం ఇలా అన్ని రకాల పంటలు వేసుకోవడం వలన పురుగులు,తెగుళ్లను నివారించు కోవచ్చు. మరింత సమాచారం కొరకు 8500983300 ఈ నంబర్ కు కాల్ చేయండి. జిగురు పల్లాలు, కాషాయ లు విత్తనాల కిట్ వేంపల్లి . రైతుల ఉత్పత్తి దారుల సంఘం లో అందుబాటులో ఉన్నాయి.కావలసిన రైతులు 6300235907 కు ఫోన్ చేయగలరు.

About the author

Bhairava Kumar M administrator

Leave a Reply