43-1(26.10.22) Vepada farm advisory

43-1(26.10.22) Vepada farm advisory

Date:26.10.2022
Vepada farm advisory-సుస్థిర వ్యవసాయ కేంద్రం-వేపాడ మండలం లో రాగల ఐదు రోజులు వాతావరణ సూచన – వర్షం కురిసే సూచన లేదు. గరిష్ట ఉష్ణోగ్రత 34-35డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 20-21డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. గాలి గంటకి 6-9km వేగంతో తూర్పు నుండీ వాయువ్య దిశగా వీయ్యవచ్చు. గాలిలో తేమసాతం 52-59% ఉండవచ్చును.
👉 Sksr పురం,K.G పూడి క్లస్టర్లలో వరిలో గింజ బరువు పెరగటానికి,నాన్యత మరియు మెరుపు రావటానికి రైతులు సప్త ధాన్యంకుర కషాయం ఎకరానికి 200lt నీటిలో 10lt ఆవు మూత్రం కలుపుకొని పిచికారి చేసుకున్నట్లైతే అధిక దిగుబడిని పొందవచ్చు.
👉Sksr పురం , బోద్ధం గ్రామంలో అరటి తోటలలో మొక్క ఎదుగుదలకు మరియు గెలలు పెద్దవిగా రావటానికి రైతులు ద్రవజీవామృతం పారించుకోవలెను.
👉 మరియు నాటుకోళ్లలో రాణిఖేత్ లేద కొక్కెర వ్యాధి ఎక్కువగా ఆశిస్తుంది. ఈ వ్యాధి వలన కోళ్లలో జీర్ణ,శ్వాసకోస సమస్యలతో పాటు గ్రుడ్ల ఉత్పత్తి తగ్గుతుంది. మరియు విపరీతమైన విరేచనాలతో కోల్లు చనిపోవడం జరుగుతుంది. ఈ వ్యాధికి చికిత్స లేదు.కావున వ్యాధిని నివారించడానికి పశు వైద్యుని పర్యవేక్షణలో R.D టీకాలు వేయించాలి.ద్వితీయ సంక్రమణంను నియంత్రించుటకు యాంటీబయాటిక్స్ మందులను వాడాలి. అలాగే వ్యాధి సోకిన కోళ్ల నుండి సురక్షిత కోల్లను వేరుచేసి ఉంచవలెను.
👉 మరింత సమాచారం కోసం 8500983300 ఈ నంబరును సంప్రదించగలరు.

About the author

Anusha V administrator

Leave a Reply