5-2023(4-2-2023) Vepada Farm Advisory

5-2023(4-2-2023) Vepada Farm Advisory

Centre for Sustainable Agriculture
Date:4/2/2023
సుస్థిర వ్యవసాయ కేంద్రం-వేపాడ మండలం లో రాగల ఐదు రోజులు వాతావరణ సూచన – వర్షం కురిసే సూచన లేధు.
గరిష్ట ఉష్ణోగ్రత 32-36డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 16-18డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. గాలి గంటకి 6-9km వేగంతో తూర్పు నుండి దక్షిణ దిశగా వీయ్యవచ్చు. గాలిలో తేమసాతం 18-77% ఉండవచ్చును.
👉 KG పూడి క్లస్టర్ లో బొడ్డం, రామస్వామిపేట,PkR పురం గ్రామాల్లో బీరలో పెంకు పురుగులు ఆకులను మరియు పుష్పాలను కోరికి పిందె రాకుండా చేస్తుంది. వీటి ఉదృతి ఎక్కువుగా ఉన్నందున రైతులు పసుపు రంగు జిగురు అట్టలను 15-20వరకు ఎకరానికి ఏర్పరచి, వేప కషాయం లేద వేపనూనెను 10రోజుల వ్యవధీలో రెండు సార్లు పిచికారి చేయవలెను.
👉🏻మరియు ఆకు అడుగు బాగంలో బూజు మాదిరిగా ఏర్పడి, ఆకులపై భాగాన పసుపు రంగు మచ్చలుతో బూజు తెగులు పంటను మరింత నష్టపరుస్తుంది. దీని నివారణకు పులిసిన మజ్జిగ+ఇంగువ ద్రావణాన్ని 10రోజుల వ్యవధిలో 2సార్లు పంటపై పిచికారి చేయవలెను
👉🏻SKSR పురం, చిట్టివానిపాలెం, జగ్గయ్యపేట,బొద్ధం గ్రామాల్లో మిరప మరియు బరబాటిలో రసం పీల్చు పురుగుల నివారణకు వేప నూనె లేద వావిలకు కషాయం 2-3సార్లు 10రోజుల వ్యవధిలో పంటపై పిచికారీ చేయవలెను
👉🏻కోటయ్యగరువు, చిట్టివానిపాలెం,వెంకయ్యపాలెం,పోతుబంధీ పాలెం గ్రామాల్లో మామిడి మరియు జీడి తోటలలో తేనె మంచు పురుగు నివారణకు నీమాస్త్రం లేధా వేపనూనెను రైతులు పిచికారీ చేయవలెను
👉 మరింత సమాచారం కోసం 8500983300 ఈ నంబరును సంప్రదించగలరు.

About the author

Anusha V administrator

Leave a Reply