Tag Archive Farm advisories

23-2(11-6-2022)Vepada Farm Advisory

Date: 11-6-2022
Centre for Sustainable Agriculture-Vepada Farm Advisory
వేపాడ మండలం లో రాగల ఐదు రోజులు వాతావరణ సూచన – 22-37milli mitre మోతదులో అతి తక్కువ వర్షపాతం నమోదు అయ్యే సూచన ఉంది. గరిష్ట ఉష్ణోగ్రత 35-37 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 26- 28డిగ్రీలు గా ఉండే అవకాశం ఉంది. గాలి గంటకి 8-11km వేగంతో వీయవచ్చు. కె.జి.పూడి, ఎస్.కె.ఎస్.ఆర్ పురం క్లస్టర్లలో ఉన్న రైతులు మామిడి , జీడి తోటలలో అంతరపంటలుగా కూరగాయలు, ఆకుకూరలుతో పాటు నవధాన్యాల సాగును చేసుకోవడం వలన అదనపు ఆదాయంతో పాటు భూమి కొతకు గురికాకుండా, చెట్లకు కావాల్సిన పోషకాలను అందించి అధిక దిగుబడిని తెచిపెడుతుంది మరియు అంతర పంటల వలన కీటకాలు, తెగుల్లు ఉదృతి తగ్గి కలుపు మొక్కలు నివారణ జరుగుతుంది. మరియు అరటి , జామ ఇతర పండ్ల తోటలలో ద్రవజీవామృతం పారించవలెను దీనివలన మొక్క పెరుగుదల బాగుండి దిగుబడిని పెంచుతుంది.
మరింత సమాచారం కోసం 8500983300 ఈ నంబర్ కు కాల్ చేయండి.

21-2(28-5-2022) Vepada Farm Advisory

Date: 28-5-2022
Centre for Sustainable Agriculture-Vepada farm advisory
వేపాడ మండలం లో రాగల ఐదు రోజులు వాతావరణ సూచన – 0-5mm మోతదులో వేరువేరు చోట్ల తేలీకపాటి వర్ష0 కురిసే సూచన ఉంది. గరిష్ట ఉష్ణోగ్రత 34-37 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 23- 26డిగ్రీలు గా ఉండే అవకాశం ఉంది. గాలి గంటకి 6-15km వేగంతో వీయవచ్చు. కె.జి.పూడి, ఎస్.కె.ఎస్.ఆర్ పురం క్లస్టర్లలో ఉన్న రైతులు ప్రధాన పంట వేసుకునే 2నెలల ముందు నవధాన్యాల సాగును చేసుకొని30-40రోజులు పెరగనిచ్చి బూమిలో కలియదున్నాలి. మరియు ఘన జీవామృతం తయారు చేసుకొని ఆఖరి దుక్కులలో 200-400kg వరకు వేసుకోవలెనుఇలా చెయ్యడం వలన భూమిలో సూక్ష్మ జీవులు వృద్ధి పెరిగి భూమిని గుల్ల బారుస్తాయి. నేల సారం మరియు తేమ శాతం పెరుగుతోంది. దీనితో ఎక్కువ దిగుబడిని రైతులు పొందవచ్చు.
మరింత సమాచారం కోసం 8500983300 ఈ నంబర్ కు కాల్ చేయండి.

21-1(25-5-2022) Vepada Farm Advisories

Date: 25-5-2022
Centre for Sustainable Agriculture- Vepada farm advisory
వేపాడ మండలం లో రాగల ఐదు రోజులు వాతావరణ సూచన – 0-8mm మోతదులో తేలికపాటి వర్ష0 కురిసే సూచన ఉంది. గరిష్ట ఉష్ణోగ్రత 36-41 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 22-29డిగ్రీలు గా ఉండే అవకాశం ఉంది. గాలి గంటకి 5-11km వేగంతో వీయవచ్చు. కె.జి.పూడి,SKSRపురం, క్లస్టర్లులో
రైతులు భూమిలో కర్బన శాతాన్ని పెంపొందించుకొనుటకు మరియు మొక్కకు కావాల్సిన అన్నీ పోషకాలు వృద్ధి చెంది అధిక దిగుబడిని మరియు నాన్యత గల ఆరోగ్యకరమైన పంటను పొందుటకు నవధాన్యాలు సాగును చేసుకోవలెను. జీడి,మామిడి, కొబ్బరి మరియు ఇతర పండ్ల తోటలలో వేసవి దుక్కులు చేసుకొని 1.5 అడుగుల దూరం వరకు మొక్క చుట్టు గుంతలు తవ్వుకొని సూర్యరష్మి తగిలేల చేయవలెను. ఇలా చెయడం వలన కోశస్త దశలో ఉన్న పురుగులు, లార్వాలు నశించిపోవటం జరుగుతుంది.మరింత సమాచారం కోసం 8500983300 ఈ నంబర్ కు కాల్ చేయండి.

20-2(21-5-2022) Vepada Farm Advisory

Date: 21-5-2022
Centre for Sustainable Agriculture-Vepada farm advisory
వేపాడ మండలం లో రాగల ఐదు రోజులు వాతావరణ సూచన – వర్ష0 కురిసే సూచన లేదు. గరిష్ట ఉష్ణోగ్రత 35-38 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 27డిగ్రీలు గా ఉండే అవకాశం ఉంది. గాలి గంటకి 8-16km వేగంతో వీయవచ్చు. కె.జి.పూడి,SKSRపురం, క్లస్టర్లులో
ప్రధాన పంటకు సిద్దం చేసుకుంటున్న పొలంలో నవధాన్యాలు సాగు చేసుకుని 30-40రోజులు పెరగనిచ్చి భూమిలో కలియదున్నవలెను.మరియు రైతులందరూ ఘన జీవామృతమును తయారు చేసుకొని అఖరి దుక్కులలో ఎకరానికి 200-400kgలు వరకు వేసుకోవలెను.ఘనజీవామృతం వలన భూమిలో సూక్ష్మ జీవుల వృద్ధి అధికంగా పెరిగి మొక్కకు కావాల్సిన పోషకాలను అందించి అధిక దిగుబడిని ఇస్తోంది.మరింత సమాచారం కోసం 8500983300 ఈ నంబర్ కు కాల్ చేయండి.

20-1(18-5-2022) Vepada Farm Advisory

Date: 18-5-2022
Centre for Sustainable Agriculture-Vepada farm advisory
వేపాడ మండలం లో రాగల ఐదు రోజులు వాతావరణ సూచన – 7-30mm మోతదులో వర్ష0 కురిసే సూచన ఉంది. గరిష్ట ఉష్ణోగ్రత 35-40 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 27డిగ్రీలు గా ఉండే అవకాశం ఉంది. గాలి గంటకి 5-15km వేగంతో వీయవచ్చు. కె.జి.పూడి,SKSRపురం, క్లస్టర్లులో నువ్వులు వేసుకుంటున్న రైతులు అంతర పంటలుగా నవధాన్యాలు సాగు లేదా
ప్రధాన పంటకు సిద్దం చేసుకుంటున్న పొలంలో నవధాన్యాలు సాగు చేసుకోవలెను. వీటి వలన భూమికి సత్తువ పెరిగి సూక్ష్మ జీవుల వృద్ధి అధికంగా ఉంటుంది. మరియు భూమి గుల్లబరి ,తేమసాతం పెరుగుతుంది. మరియు అధిక దిగుబడిని కూడా రైతులు పొందవచ్చు.మరింత సమాచారం కోసం 8500983300 ఈ నంబర్ కు కాల్ చేయండి.

19-2(14-5-2022) Vepada Farm Advisory

Date: 14-5-2022
Centre for Sustainable Agriculture-Vepada farm advisory
వేపాడ మండలం లో రాగల ఐదు రోజులు వాతావరణ సూచన – 3-15milli mitre మోతదులో వర్ష0 కురిసే సూచన ఉంది. గరిష్ట ఉష్ణోగ్రత 34- 35 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 24-26డిగ్రీలు గా ఉండే అవకాశం ఉంది. గాలి గంటకి 5-14km వేగంతో వీయవచ్చు. కె.జి.పూడి,SKSRపురం, క్లస్టర్లులో నువ్వులు వేసుకుంటున్న రైతులు అంతర పంటలుగా నవధాన్యాలు వేసుకోవడం వలన భూమికి సత్తువ పెరిగి సూక్ష్మ జీవుల వృద్ధి అధికంగా ఉంటుంది. మరియు భూమి గుల్లబరి ,తేమసాతం పెరుగుతుంది. మరియు ఇలా నవధాన్యాలు వేసుకోవడం వలన అధిక దిగుబడిని కూడా రైతులు పొందవచ్చు.మరింత సమాచారం కోసం 8500983300 ఈ నంబర్ కు కాల్ చేయండి.

19-1(11-5-2022)Vepada Farm Advisory

Date: 11-5-2022
Centre for Sustainable Agriculture-Vepada farm advisory
వేపాడ మండలం లో రాగల ఐదు రోజులు వాతావరణ సూచన -అసని తుఫాన్ కారణంగా 8-30mm మోతదులో వర్ష0 కురిసే సూచన ఉంది. గరిష్ట ఉష్ణోగ్రత 30-36 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 20-25డిగ్రీలు గా ఉండే అవకాశం ఉంది. గాలి గంటకి 8-18km వేగంతో వీయవచ్చు. కె.జి.పూడి,SKSRపురం, క్లస్టర్లులో నువ్వులు వేసుకున్న రైతులు పొలంలో అధనపు నీరు బయటికి పోయేలా కాలువలను తయారు చేసుకోవలెను. మరియు జీడి,మామిడి మరియు అధనపు పండ్ల తోటలులో గాలికి విరిగిపోయిన కొమ్మలను తీసేసి విరిగిన చోట చదునుగా కత్తిరించి సున్నం గాని వేప లేపనం గాని పూయవలెను. నీట మునగిన , వేర్లతో పెకిలించుకుపోయిన మొక్కలలో అధిక నీరుని తీసి వర్షం తగ్గిన తరువాత జీవామృతం గాని ఘనజీవామృతం గాని వేసినట్లైతె మొక్కలకు తిరిగి జీవం పొందించవచ్చు . అధిక వర్షాలు కారణంగా కురగాయలలో తెగుల్లు త్వరగా సోకవచ్చు కనుక ఆవుపేడ+ఆవుమూత్రం+ఇంగువ ద్రావణంను పిచికారి చేయవలెను.
మరింత సమాచారం కోసం 8500983300 ఈ నంబర్ కు కాల్ చేయండి.

18-2(7-5-2022) Vepada Farm Advisory

Date: 7-5-2022
Centre for Sustainable Agriculture-Vepada farm advisory
వేపాడ మండలం లో రాగల ఐదు రోజులు వాతావరణ సూచన – 4-18milli mitre మోతదులో వేరువేరు చోట్ల వర్ష0 కురిసే సూచన ఉంది. గరిష్ట ఉష్ణోగ్రత 35 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 24-25డిగ్రీలు గా ఉండే అవకాశం ఉంది. గాలి గంటకి 6-8km వేగంతో వీయవచ్చు. కె.జి.పూడి, SKSRపురం క్లస్టర్లులో ఉన్న రైతులు ప్రధాన పంటకు సిద్దం చేసుకుంటున్న బూమిలో 30-40 రోజుల ముందు నవధాన్య సాగును చేసుకోవలెను. మరియు భూసార పెరుగుదలకు, భూమిలో సూక్ష్మ మరియు స్థూల పోషకాలను అందించడం కోరకు సహజ సిద్దంగా తయరుచేసిన ఎరువులలో ఘనజీవామృతం అత్యంత కీలక పాత్ర పోసిస్తుంది. దీనిని తయారుచేసుకోవటం కోరకు ఎకరానికి 100 కిలోల ఆవు పేడను నేలపై పరిచి 2 కిలోలు పప్పుదినుసుల పిండిని, 2 కిలోలు బెల్లాన్ని, 1kg పుట్టమన్నును ఒకదాని తర్వాత ఒకటిగా చల్లి 5lt ఆవు మూత్రంను చల్లుతూ పార సాయంతో అన్నీ కలిసేటట్లు చేసి ఉండలుగా చుట్టి వాతవరణ పరిస్తితుల బట్టి 6-8రోజులు నీడలో ఆరబెట్టాలి. ఇలా తయారుచేసుకున్న ఘనజీవామృతంను దుక్కులలో వేసి ఎరువుగా ఉపయోగించవలెను .
మరింత సమాచారం కోసం 8500983300 ఈ నంబర్ కు కాల్ చేయండి.

18-1(4-5-2022) Vepada Farm Advisory

Date: 4-5-2022
Centre for Sustainable Agriculture-Vepada farm advisory
వేపాడ మండలం లో రాగల ఐదు రోజులు వాతావరణ సూచన – 0-22mm మోతదులో వేరువేరు చోట్ల వర్ష0 కురిసే సూచన ఉంది. గరిష్ట ఉష్ణోగ్రత 35-39 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 25-26డిగ్రీలు గా ఉండే అవకాశం ఉంది. గాలి గంటకి 8-14km వేగంతో వీయవచ్చు. కె.జి.పూడి,కోటయ్యగరువు, చిట్టివానిపాలెం, SKSRపురం, చామలపల్లి, ధబ్బిరాజుపేట గ్రామాల్లో మామిడిలో పండు ఈగ ఉదృతి ఉంది. దీనిని గుర్తించుటకు కాయలపైన రంద్రాలుతో నల్ల మచ్చలు ఏర్పడి పండు కుల్లిపోతుంది. దీని వలన పండు యొక్క నాన్యత తగ్గిపోయి పంటకు నష్టం కలిగించి దిగుబడి తగ్గిపోయేలా చేస్తుంది. దీని నివారణ చర్యగా ఎకరానికి 6-8 పండు ఈగ ఉచ్చులను అమర్చి 5మి.మీ వేప నునెను లీటరు నీటిలో కలిపి పిచికారి చేయవలెను. మరియు పక్వానికి వస్తున్న పండ్లకు కవర్లు అమర్చవలెను.
మరింత సమాచారం కోసం 8500983300 ఈ నంబర్ కు కాల్ చేయండి.

17-2(30-4-2022) Vepada Farm Advisory

Date: 30-4-2022
Centre for Sustainable Agriculture-Vepada farm advisory
వేపాడ మండలం లో రాగల ఐదు రోజులు వాతావరణ సూచన – 0-4mm మోతదులో వేరువేరు చోట్ల తేలీకపాటి వర్ష0 కురిసే సూచన ఉంది. గరిష్ట ఉష్ణోగ్రత 34-40 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 26డిగ్రీలు గా ఉండే అవకాశం ఉంది. గాలి గంటకి 7-12km వేగంతో వీయవచ్చు. కె.జి.పూడి, ఎస్.కె.ఎస్.ఆర్ పురం క్లస్టర్లలో ఉన్న రైతులు ప్రధాన పంట వేసుకునే 2నెలల ముందు నవధాన్యాల సాగును చేసుకొని30-40రోజులు పెరగనిచ్చి బూమిలో కలియదున్నాలి. మరియు ఘన జీవామృతం తయారు చేసుకొని ఆఖరి దుక్కులలో 200-400kg వరకు వేసుకోవలెనుఇలా చెయ్యడం వలన నేల భూమిలో సూక్ష్మ జీవులు వృద్ధి పెరిగి భూమిని గుల్ల బారుస్తాయి. నేల సారం మరియు తేమ శాతం పెరుగుతోంది. దీనితో ఎక్కువ దిగుబడిని రైతులు పొందవచ్చు.
మరింత సమాచారం కోసం 8500983300 ఈ నంబర్ కు కాల్ చేయండి