Farm advisory
Date-2/10/2022
Centre for Sustainable Agriculture (CSA)
Kisan Mitra centre -Farm Advisory
Proddatur మండలం లో రాగల 5 రోజుల వాతావరణ సూచన – 18mm. గరిష్ట ఉష్ణోగ్రత -31 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 23 డిగ్రీలు గా వుండే అవకాశం వుంది. గాలి గంటకి 8 కి.మి. వేగంతో పడమర దిశా గ వీయవచ్చు .
తల్లమాపురము క్లస్టర్ లో సౌరెడ్డి పల్లి,రేగుల్లపల్లి కల్లూరు,తల్లమాపురం సీతంపల్లి,యారగుంట్లపల్లి లో గ్రామాలలో
ఇప్పుడు అధిక వర్షాల కు
👉వరిలో, పత్తి లో వేరుసనగలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు పొలంలో మురుగు నీటి కాలువలను ఏర్పాటు చేసుకోవాలి. ఎరువులు వేయడం ఆపుకోవాలి. వర్షాలు తగ్గిన తరువాత మురుగు నీటిని వీలైనంత త్వరగా బయటకు పంపించాలి. వర్షాలు తగ్గిన తరువాత, నీటి ముంపునకు గురి అయిన వరిలో పాము పొడ తెగులు, కాండం కుళ్ళు తెగులు ఆశించే అవకాశం ఉంది. పొడ తెగులు, కాండం కుళ్ళు తెగులు నివారణకు పేడమూత్రం ఇంగువ ద్రావణం స్ప్రే చేయాలి
*పొలంలోకరానికి లింకాకర్షక బుట్టలు 10 అమార్చుకొని అడా మగ పురుగులను కలవానియకుండా చేయడం వల్ల పురుగును అదుపు చేయవచ్చు.
వేపాడ మండలం లో రాగల ఐదు రోజులు వాతావరణ సూచన – 23-51mm మొతాదులో వర్షం కురిసే సూచన ఉంది. గరిష్ట ఉష్ణోగ్రత 32-34డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 22-23 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. గాలి గంటకి 6-8km వేగంతో పడమర దిశగా వీయ్యవచ్చు. తుఫాన్ హెచ్చరిక ఉన్న కారణంగా ఆకాశం మేఘవృతమై ఉండి మోస్తరు వర్షాలు కురిసే సూచన ఉంది కావున కేజీ పూడి, SKSR Puram క్లస్టర్లలో ఉన్న రైతులందరూ పొలాల్లో ఎరువులు వేయుట కానీ, కషాయాలు పిచికారి చేయటం వంటి పనులు వాయిద వేసుకోవాలి.మరియు పోలాల్లో వర్షపు నీరు బయటికి పోయేలా నీటి కాలవలు తీసుకోవలెను. మరియు పండ్ల తోటలు అయిన అరటి,బొప్పాయి మో|| వాటిలో పక్వానికి వచ్చిన పళ్లను వెంటనే కోయాలి.అలాగే తుఫాన్ గాలికి పడిపోకుండ మొక్కల పక్కన వెదురు కర్రలను పాతి ఊతమివ్వాలి. తధుపరి మొక్కలకు వర్షల కారణంగా తెగులు సోకే అవకాశం ఉన్నందున రైతులు అందరు పెడ,మూత్రం,ఇంగువ ద్రావణం గానీ సొంటిపాల కాషాయం కాని పిచికారి చేసుకోవలెను.అలాగే Kg pudi,Sksr puram క్లస్టర్లులో e-cropలో పంట నమొదుకు ఈ నెల25వ తేదీ వరకు గడువున్నది కనుక ఈ-క్రాప్ నమోధు చేసుకోలేని రైతులు తమ గ్రామ పరిధిలో ఉన్న RBK లను సంప్రదించగలరు. మరింత సమాచారం కోసం 8500983300 ఈ నంబర్ కు కాల్ చేయండి.
కిసాన్ మిత్ర ఫోన్ రేడియో రైతు మిత్రులందరికీ స్వాగతం పలుకుతోంది.C. బెలగల్ మండలం లో రాగల ఐదు రోజులలో వాతావరణ సూచన. వర్షం 10 మిల్లీమీటర్ల దాకా పడవచ్చు . కనిష్ట ఉష్ణోగ్రత 23 డిగ్రీలు మరియు గరిష్ట ఉష్ణోగ్రత 32 డిగ్రీలు గా ఉండే అవకాశం వుంది. గాలి గంటకి 6 కిలోమీటర్ల వేగంతో పడమర దిశగా వీయవచ్చు. వరి రైతులు పొలంలో రసం పీల్చు పురుగుల నివారణ కొరకు పసుపు మరియు నీలం రంగు జిగురు అట్టలు పెట్టుకోవలెను, కాండం తోలుచు పురుగు నివారణకు లింగాకర్షక బుట్టలు పెట్టుకోవలెను . మిరప రైతులందరూ నారు వేసేటప్పుడు బీజామృతం లేదా ట్రైకోడెర్మా విరిడి తో నారా శుద్ధి చేసుకోవలెను, అలాగే మిరప పంటలో రసం పీల్చు పురుగుల ఉధృతి తగ్గించుకోవడానికి సరిహద్దు పంటగా జొన్న, అంతర పంటలుగా ముల్లంగి, ధనియాలు, ఉల్లి, ఎర పంటలుగా బంతి మరియు ఆముదం వేసుకోవలెను. పత్తి పంటలో పేనుబంక మరియు తామర పురుగుల నివారణ కొరకు వేప నూనె పిచికారి చేసుకోవలెను మరియు జిగురు అట్టలు పెట్టుకోవలెను. పత్తి పంటలో పూత మరియు పిందెలు రాలకుండా ఉండడానికి మరియు కాయ సైజ్ పెరగడానికి సప్త ధాన్యంకుర కషాయం పిచికారి చేసుకోవలెను.తుంగభద్ర FPO సభ్యులకు 250 రూపాయలు విలువ చేసే జిగురు అట్టలు 100 రూపాయలకు,45 రూపాయలు విలువ చేసే పత్తి,వేరుశనగ, వరి, మిరప పంటలకు కావలసిన లింగాకర్షక బుట్టలను 10 రూపాయలకు, వేప నూనె ఒక లీటర్ 380/- రూపాయలకు,డబుల్ మోటార్ బ్యాటరీ స్ప్రేయర్స్ 3500/- రూపాయలకు ఇవ్వడం జరుగుతుంది.కావున తుంగభద్ర FPO సభ్యులందరూ ఈ అవకాశాలను ఉపయోగించుకోవాలని మనవి. మరింత సమాచారం కోసం కొండాపురం మరియు ముడుమాల గ్రామంలో ఉన్న తుంగభద్ర సేంద్రియ రైతు ఉత్పత్తి దారుల సంఘం ఆఫీస్ నందు కలవండి లేదా 8500983300 నెంబర్ కు కాల్ చేయండి.
వేముల మండలం లో రాగల మరో 4 రోజుల యొక్క వాతావరణ సూచన – సాధారణంగా ఆకాశం మేఘావృతమై ఉంటుంది.వర్షపాతం 18 MM ఉండును.,కనిష్ట ఉష్ణోగ్రత :23డిగ్రీల సెంటిగ్రేడ్, గరిష్టఉష్ణోగ్రత: 31 డిగ్రీల సెంటిగ్రేడ్ సరాసరి గా వుండే అవకాశం వుంది. గాలి గంటకి 8 కి.మి. వేగంతో పడమర దిశగా గాలులు వీయును..గాలిలో తేమశాతం 82%-94% ఉంటుంది,
వేముల,వేల్పుల గ్రామాలలో పత్తి పంట లో పచ్చదోమ,తెల్లదొమ ఉధృతి ఎక్కువ వుంది ,కావున రైతులు జిగురు పల్లాలు ఎకరాకు 25 చొప్పున పెట్టుకోవాలి,మరియు దోమ నివారణకు వేపగింజల కషాయం పిచికారీ చేయాలి.
పత్తి లో పేను బంక నివారణకై నీటిని స్ప్రే చేయండి. అలాగే పత్తి పంట లో గులాబీ రంగు పురుగు ఉధృతి ని గమనించుట కొరకై ఒక ఎకరా పొలం లో లింగ కర్షక బట్టలు 8 నుండి 10 పెట్టుకోవాలి. పురుగులను అదుపులో ఉంచుటకు పంట చుట్టూ ముందు జాగ్రత్తగా బార్డర్ క్రాప్ గా జొన్న, సజ్జ, అంతర పంటలుగా కంది, మటిక, బెండ, అలసంద , అనప ఎర పంటగా ఆముదం వేసుకోవాలి. ఇలా అన్ని రకాల పంటలు వేసుకోవడం వలన మిత్ర పురుగుల సంతతి పెరిగి పురుగులు,తెగుళ్లను నివారించు కోవచ్చు. అలాగే ప్రతి 15 రోజుల కు ఒకసారి జీవామృతం ను పారించి,ప్రకృతి వ్యవసాయ సాగు విధానంలోని రాజీలేని సూత్రాలను పాటించినట్లైతే పత్తి పంటలో రైతులు అధిక దిగుబడులు సాధిస్తారు. అలాగే భోనుయగారిపల్లి.
వేముల ,వేల్పుల కొన్ని గ్రామాలలో అరటి పంటలో చికటోగ సమస్య ఎక్కువగా ఉంది. కావున రైతులు 1 ఎకరాకు 2 కేజీల ట్రైకోడర్మ వీరిడి ని 200 lit నీటిలో కలిపి పారించాలి లేదా పిచికారి చేయాలి.అలాగే జామ తోటల్లో పండు ఈగ ఉధృతి ఎక్కువగా వుంది దీని నివారణకు పండు ఈగ బుట్టలు పెట్టుకోవాలి.భుమయ్యగరిపల్లి వేల్పుల.వేముల.మొబ్బుచింతలపల్లి గ్రామాలలో ట మోటా పంటలో పచ్చ దోమ తెళ్లదోమ వుధృతి ఎక్కువగా వున్నది .. టొమాటో లో వూదు నిర్మూలనకు పండు ఈగ బుట్టలు అమర్చాలి.
అలాగే పసుపు జిగురు పల్లాలు, లింగాకర్షక బుట్టలు, పండు ఈగ బుట్టలు, విత్తనాల కిట్లు ( అంతర పంటలు వేసుకోవడానికి 11 రకాల విత్తనాలు ), మన వేముల రైతు ఉత్పత్తి దారుల సంఘం లో అందుబాటులో ఉన్నాయి.కావలసినటువంటి రైతులు 9347723277 కు ఫోన్ చేయగలరు.
అలాగే మీ వ్యవసాయానికి సంబంధించి ఏమైనా సమస్యలు ఎదుర్కొంటున్నారా.??
👉 భూమి రికార్డులు
👉పంట రుణాలు
👉 కౌలు రైతుల సమస్యలు
👉 విత్తన సమస్యలు
👉 మార్కెట్ యార్డులు, ధరలు
👉 వ్యవసాయ సబ్సిడీ, పెట్టుబడి పథకాలు
👉 ప్రకృతి వైపరీత్యాల వ వులన నష్టం
తదితర సమస్యల పరిష్కారం కొరకు csa కిసాన్ మిత్ర నెంబర్ 8500983300కు phone చేయండి.
వేంపల్లె మండలం లో రాగల మరో 5 రోజుల యొక్క వాతావరణ సూచన – గరిష్ట ఉష్ణోగ్రత -31 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 23 డిగ్రీలు గా వుండే అవకాశం వుంది. రాగల మరో 5 రోజుల్లో 18mm వర్షపాతం ఉండును. గాలిలో తేమ 82-94 %, అలాగే గంటకి 8 కి.మి. వేగంతో పడమర దిశ గ గాలులు వీయవచ్చును .
టివి పల్లె క్లస్టర్ లోనీ కుప్పలపల్లి , వెలమవారిపల్లి , బక్కన్నగారిపల్లి గ్రామాలలో ప్రధాన పంట అయినటువంటి పత్తి పంట లో దోమ నివారణ కొరకై వావిలాకు కషాయం ని పిచికారీ చేయవలెను. అలాగే ఎకరానికి 25 నుండి 30 వరకు పసుపు జిగురు పల్లెములు పెట్టాలి. అలాగే మెగ్నేషియం లోప నివారణకై ఆవు మూత్రం ఇంగువ ద్రావణం పిచికారీ చేయాలి.. అలాగే పత్తి పంట లో గులాబీ రంగు పురుగు ఉధృతి నివారణ కొరకై ఒక ఎకరా పొలం లో లింగ కర్షక బట్టలు 8 నుండి 10 వరకు పెట్టుకోవాలి. ఇవి పెట్టడం వలన పత్తి కాయలో వచ్చే ఎర్ర పురుగును నివారించవచ్చు.అలాగే చీనీ నిమ్మ లో ఎదుగుదళ కొరకై జీవామృతం ని పారించాలి.అలాగే పూత కొరకు కోడి గుడ్ల ద్రావణం లేదా పంచగవ్య పిచికారి చేయాలి.
అలాగే పసుపు జిగురు పల్లాలు, లింగాకర్షక బుట్టలు, పశువుల దాణా, విత్తనాల కిట్లు ( అంతర పంటలు వేసుకోవడానికి 11 రకాల విత్తనాలు ), జీవామృతం తయారీకి కావాల్సిన బెల్లం, వేప నూనె మన వేంపల్లి రైతు ఉత్పత్తి దారుల సంఘం లో అందుబాటులో ఉన్నాయి.కావలసినటువంటి రైతులు 6300235907 కు ఫోన్ చేయగలరు.
అలాగే మీ వ్యవసాయానికి సంబంధించి ఏమైనా సమస్యలు ఎదుర్కొంటున్నారా.??
భూమి రికార్డులు
పంట రుణాలు
కౌలు రైతుల సమస్యలు
విత్తన సమస్యలు
మార్కెట్ యార్డులు, ధరలు
వ్యవసాయ సబ్సిడీ, పెట్టుబడి పథకాలు
ప్రకృతి వైపరీత్యాల వలన నష్టం
తదితర సమస్యల పరిష్కారం కొరకు csa కిసాన్ మిత్ర నెంబర్ 8500983300కు ఫోన్ చేయండి.