Monthly Archive October 26, 2022

43-1(26.10.22) Vepada farm advisory

Date:26.10.2022
Vepada farm advisory-సుస్థిర వ్యవసాయ కేంద్రం-వేపాడ మండలం లో రాగల ఐదు రోజులు వాతావరణ సూచన – వర్షం కురిసే సూచన లేదు. గరిష్ట ఉష్ణోగ్రత 34-35డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 20-21డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. గాలి గంటకి 6-9km వేగంతో తూర్పు నుండీ వాయువ్య దిశగా వీయ్యవచ్చు. గాలిలో తేమసాతం 52-59% ఉండవచ్చును.
👉 Sksr పురం,K.G పూడి క్లస్టర్లలో వరిలో గింజ బరువు పెరగటానికి,నాన్యత మరియు మెరుపు రావటానికి రైతులు సప్త ధాన్యంకుర కషాయం ఎకరానికి 200lt నీటిలో 10lt ఆవు మూత్రం కలుపుకొని పిచికారి చేసుకున్నట్లైతే అధిక దిగుబడిని పొందవచ్చు.
👉Sksr పురం , బోద్ధం గ్రామంలో అరటి తోటలలో మొక్క ఎదుగుదలకు మరియు గెలలు పెద్దవిగా రావటానికి రైతులు ద్రవజీవామృతం పారించుకోవలెను.
👉 మరియు నాటుకోళ్లలో రాణిఖేత్ లేద కొక్కెర వ్యాధి ఎక్కువగా ఆశిస్తుంది. ఈ వ్యాధి వలన కోళ్లలో జీర్ణ,శ్వాసకోస సమస్యలతో పాటు గ్రుడ్ల ఉత్పత్తి తగ్గుతుంది. మరియు విపరీతమైన విరేచనాలతో కోల్లు చనిపోవడం జరుగుతుంది. ఈ వ్యాధికి చికిత్స లేదు.కావున వ్యాధిని నివారించడానికి పశు వైద్యుని పర్యవేక్షణలో R.D టీకాలు వేయించాలి.ద్వితీయ సంక్రమణంను నియంత్రించుటకు యాంటీబయాటిక్స్ మందులను వాడాలి. అలాగే వ్యాధి సోకిన కోళ్ల నుండి సురక్షిత కోల్లను వేరుచేసి ఉంచవలెను.
👉 మరింత సమాచారం కోసం 8500983300 ఈ నంబరును సంప్రదించగలరు.

42-2(22.10.22) Vepada farm advisory/

Date: 22.10.2022
Vepada farm advisory-సుస్థిర వ్యవసాయ కేంద్రం-వేపాడ మండలం లో రాగల ఐదు రోజులు వాతావరణ సూచన – 1-4mm మొతాదులో ఆకాశం మేఘవృతమై ఉండి వేరు వేరు ఛోట్ల తెలికపాటి వర్షం కురిసే సూచన ఉంది. గరిష్ట ఉష్ణోగ్రత 33-34డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 22-23డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. గాలి గంటకి 9-12km వేగంతో తూర్పు నుండీ వాయువ్య దిశగా వీయ్యవచ్చు. గాలిలో తేమసాతం 59-70% ఉండవచ్చును.
👉 Sksr పురం,K.G పూడి క్లస్టర్లలో ప్రధాన పంట అయిన వరిలో నల్లి పురుగులు పొట్ట దసలలో ఉన్న వరి పైరుపై చేరి గింజల లోపల అండాశయాన్ని, పుప్పొడిని నష్టపరచటం వలన వెన్నులో అక్కడక్కడ తాలు గింజలు ఏర్పడి ఊదా రంగు మచ్చలు ఏర్పడుతున్నాయి.దీ నిని నల్లకంకి అని కూడా అంటారు కావున రైతులు ఈ లక్షనాలు గల గింజలు కనిపించినట్టైతే పంచపత్ర కషాయం పిచికారి చేయవలెను.
👉 మరియు వరిలో పొడ తెగులు,అగ్గి తెగులు,ఆకు యెండు తెగులు నివారణకు రైతులు గట్లపై కలుపు మొక్కలను తీసి , పశువుల పెడ-మూత్రం-ఇంగువ ద్రావణం పిచికారి చేయవలెను.
👉అలాగే pkr పురం, Sksr పురం గ్రామలలో బెండలో సెర్కోస్పోరా ఆకు మచ్చ తెగులు ఉదృతి ఉన్న0దువలన రైతులు 6lt పుల్లటి మజ్జిగలో 100gmల ఇంగువను 100lt నీటికి కలుపుకొని పిచికారి చేసుకోగలరు.
👉Pkr పురం, సారవానిపాలెం, కోటయ్యగరువు,చిట్టివానిపాలెం గ్రామాలలో బరబాటి,చిక్కుడు లో పేను బంక నివారణకు వేపనూనెను లేధా నీమాస్త్రం పిచికారి చేసుకొని నివారించవచ్చును.
👉అలాగే వరి పొలాల్లో ఎలుకలు నివారణకు రైతులు ఎకరానికి 4పచ్చి బొప్పాయి కాయలను తీసుకోని చిన్న చిన్న ముక్కలుగా కోసి పొలం గట్లపై చల్లాలి. పచ్చి బొప్పాయిలో ఉన్న ఒక రసాయనం ఎలుక నోటి కండరాలకు హానీ కలుగచేస్తుంది లేధా సిమెంట్ ను,మైదా పిండిని సమబాగాల్లో కలిపి పొట్లాలు కట్టి కలుగుల వద్ద ఉంచితే అవి తిన్న ఎలుకల నోటి భాగాలు పిడచగట్టుకుపోయి నశిస్థాయి.
👉 మరింత సమాచారం కోసం 8500983300 ఈ నంబర్ను సంప్రదించగలరు

42-2022(21-10-22)Thungabhadra Farm Advisory

కిసాన్ మిత్ర ఫోన్ రేడియో రైతు మిత్రులందరికీ స్వాగతం పలుకుతోంది.C. బెలగల్ మండలం లో రాగల ఐదు రోజులలో వాతావరణ సూచన. వర్షం 12 మిల్లీమీటర్ల దాకా పడవచ్చు . కనిష్ట ఉష్ణోగ్రత 19 డిగ్రీలు మరియు గరిష్ట ఉష్ణోగ్రత 32 డిగ్రీలు గా ఉండే అవకాశం వుంది. గాలిలో తేమశాతం 59% – 87% దాకా ఉండవచ్చు. గాలి గంటకి 10 కిలోమీటర్ల వేగంతో తూర్పు దిశగా వీయవచ్చు. కొండాపురం, పలదొడ్డి, ముడుమాల మరియు ఈర్లదిన్నె గ్రామాలలోని వరి పొలాలలో రసం పీల్చు పురుగుల ఉధృతి ఎక్కువగా ఉన్నందున నివారణ కొరకు జిగురు అట్టలు పెట్టుకోవాలని, అలాగే నీమాస్త్రం లేదా వావిలాకు కషాయం పిచ్చికారి చేసుకోవాలని, ఆకు ముడత పురుగు నివారణకు బ్రహ్మాస్త్రం పిచికారి చేయాలని తెలియజేయడం జరిగింది. మిరప పంటలలో త్రిప్స్ ఉధృతి ఎక్కువగా ఉన్నందున నివారణకు పసుపు, నీలం రంగు జిగురు అట్టలు పెట్టుకోవాలని, వావిలాకు కషాయం పిచికారి చేయాలని, ఆకు ముడత నివారణకు పచ్చిపాలు లేదా పుల్లటి మజ్జిగ పిచికారి చేయాలని, తెగుళ్ల నివారణ కొరకు ఆవుపేడ మూత్రం ఇంగువ ద్రావణం పిచికారి చేసుకోవాలని చెప్పడం జరిగింది.పత్తి పంటలలో గులాబీ రంగు పురుగు మరియు మొక్కజొన్న పంటలలో కత్తెర పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నందున నివారణకు బ్రహ్మాస్త్రం పిచికారి చేయాలని, అలాగే ఎకరానికి 8 నుంచి 10 లింగాకర్షణ బుట్టలు పెట్టుకోవాలని తెలియజేయడం జరిగింది. తుంగభద్ర FPO ఆఫీస్ నందు 250 రూపాయలు విలువ చేసే జిగురు అట్టలు 100/- రూపాయలకు,45 రూపాయలు విలువ చేసే పత్తి,వేరుశనగ, వరి, మిరప పంటలకు కావలసిన లింగాకర్షక బుట్టలను 10/- రూపాయలకు, వేప నూనె ఒక లీటర్ 380/- రూపాయలకు,40 కిలోల వేప పిండి బస్తా 950/- రూపాయలకు, డబుల్ మోటార్ బ్యాటరీ స్ప్రేయర్స్ 3500/- రూపాయలకు అందుబాటులో ఉన్నాయి. కావలసినవారు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు 9177427817 మరియు 9492761257. మరింత సమాచారం కోసం కొండాపురం మరియు ముడుమాల గ్రామాలలో ఉన్న తుంగభద్ర సేంద్రియ రైతు ఉత్పత్తి దారుల సంఘం ఆఫీస్ నందు కలవండి. వ్యవసాయానికి సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కారం కొరకు CSA సంస్థ కిసాన్ మిత్ర కాల్ సెంటర్ 8500983300 నెంబర్ కు కాల్ చేయండి.

42-1(19.10.2022) Vepada farm advisory

Centre for Sustainable Agriculture
Vepada farm advisory
Date: 17.10.2022
సుస్థిర వ్యవసాయ కేంద్రం-వేపాడ మండలం లో రాగల ఐదు రోజులు వాతావరణ సూచన – 6-15mm మొతాదులో తెలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే సూచన ఉంది. గరిష్ట ఉష్ణోగ్రత 33-36డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 23-24డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. గాలి గంటకి 4-7km వేగంతో పడమర దిశగా వీయ్యవచ్చు. గాలిలో తేమసాతం 59-87% ఉండవచ్చును.
👉 బొద్దాం,R.S పేట,PKR పురం,Sksr పురం,సోంపురం, జగ్గయ్యపేట, చామలపల్లి గ్రామలలో వరిలో పొడ తెగులు ఉదృతి ఎక్కువగా ఉన్నాఁధున రైతులు గట్లపై ఉన్న కలుపు మొక్కలను తీసి ,5%వేప కషాయం పిచికారి చేయవలెను.లేధ పెడ, మూత్రం, ఇంగువ ద్రావణం పిచికారి చేయవచ్చును.
👉కోటయ్యగరువు, సారవానిపాలెం గ్రామాల్లో వరిలో ఆకుపచ్చ కొమ్ము పురుగు నివారణకు రైతులు లార్వాలను నసింపచేసి పంచపత్ర కషాయం పిచికారి చేయవలెను.
👉 మరియు వరిలో ఎలుకల నివారణకు రైతులు పొలం లో ఉన్న బొరియలను పూడ్చి , విషపు ఎరలుగా గ్లైరిసిడియా ఆకులను మెత్తగా నూరి టమాటతో కాని గోధుమ పిండిలో కానీ కలిపి ముద్దలుగా చేసి పొలాల్లో ఉంచినట్లైతే ఎలుకలు అవి తిని చనిపోయే అవకాశం ఉంధీ.అలాగే పొలాల్లో పాములు రాకుండా సర్పగంధ,నిమ్మ గడ్డిని పెంచుకుని నివారించవచ్చును.
👉మరియు మెట్టప్రాంతాలలో చిరుధాన్యాలు,పండ్ల తోటలలో అంతర పంటలుగా మినుములు,పెసలు,ఉలవలు మో|| పంటలను వేసుకుంటున్న రైతులు బీజామృతంతో విత్తన సుద్ధి చేసుకొని విత్తుకున్నట్లైతే విత్తనములు నుండి సంక్రమించే వ్యాధులు రాకుండ రక్షణ కలిగించవచ్చును.
👉 మరింత సమాచారం కోసం 8500983300 ఈ నంబర్ కు కాల్ చేయండి.

41-2022(14-10-22)Thungabhadra Farm Advisory

కిసాన్ మిత్ర ఫోన్ రేడియో రైతు మిత్రులందరికీ స్వాగతం పలుకుతోంది.C. బెలగల్ మండలం లో రాగల ఐదు రోజులలో వాతావరణ సూచన. వర్షం 28 మిల్లీమీటర్ల దాకా పడవచ్చు . కనిష్ట ఉష్ణోగ్రత 21 డిగ్రీలు మరియు గరిష్ట ఉష్ణోగ్రత 34 డిగ్రీలు గా ఉండే అవకాశం వుంది. గాలిలో తేమశాతం 54% – 91% దాకా ఉండవచ్చు. గాలి గంటకి 10 కిలోమీటర్ల వేగంతో తూర్పు దిశగా వీయవచ్చు. కొండాపురం, పలదొడ్డి, ముడుమాల మరియు ఈర్లదిన్నె గ్రామాలలోని వరి పొలాలలో రసం పీల్చు పురుగుల ఉధృతి ఎక్కువగా ఉన్నందున నివారణ కొరకు జిగురు అట్టలు పెట్టుకోవాలని అలాగే నీమాస్త్రం లేదా వావిలాకు కషాయం పిచ్చికారి చేసుకోవాలని తెలియజేయడం జరిగింది. మిరప పంటలలో తెల్ల దోమ, పచ్చ దోమ మరియు తామర పురుగుల ఉధృతి ఎక్కువగా ఉన్నందున నివారణకు పసుపు, నీలం రంగు జిగురు అట్టలు పెట్టుకోవాలని, వావిలాకు కషాయం పిచికారి చేయాలని, ఆకు ముడత నివారణకు పచ్చిపాలు లేదా పుల్లటి మజ్జిగ పిచికారి చేయాలని, తెగుళ్ల నివారణ కొరకు ఆవుపేడ మూత్రం ఇంగువ ద్రావణం పిచికారి చేసుకోవాలని చెప్పడం జరిగింది.పత్తి పంటలలో గులాబీ రంగు పురుగు మరియు మొక్కజొన్న పంటలలో కత్తెర పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నందున నివారణకు బ్రహ్మాస్త్రం పిచికారి చేయాలని, అలాగే ఎకరానికి 8 నుంచి 10 లింగాకర్షణ బుట్టలు పెట్టుకోవాలని తెలియజేయడం జరిగింది. తుంగభద్ర FPO ఆఫీస్ నందు 250 రూపాయలు విలువ చేసే జిగురు అట్టలు 100/- రూపాయలకు,45 రూపాయలు విలువ చేసే పత్తి,వేరుశనగ, వరి, మిరప పంటలకు కావలసిన లింగాకర్షక బుట్టలను 10/- రూపాయలకు, వేప నూనె ఒక లీటర్ 380/- రూపాయలకు,40 కిలోల వేప పిండి బస్తా 950/- రూపాయలకు, డబుల్ మోటార్ బ్యాటరీ స్ప్రేయర్స్ 3500/- రూపాయలకు అందుబాటులో ఉన్నాయి. కావలసినవారు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు 9177427817 మరియు 9492761257. మరింత సమాచారం కోసం కొండాపురం మరియు ముడుమాల గ్రామాలలో ఉన్న తుంగభద్ర సేంద్రియ రైతు ఉత్పత్తి దారుల సంఘం ఆఫీస్ నందు కలవండి. వ్యవసాయానికి సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కారం కొరకు CSA సంస్థ కిసాన్ మిత్ర కాల్ సెంటర్ 8500983300 నెంబర్ కు కాల్ చేయండి.

41-2022(14-10-2022)

వేంపల్లె మండలం లో రాగల మరో 5 రోజుల యొక్క వాతావరణ సూచన – గరిష్ట ఉష్ణోగ్రత -35 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 20 డిగ్రీలు గా వుండే అవకాశం వుంది. రాగల మరో 5 రోజుల్లో 17mm వర్షపాతం ఉండును. గాలిలో తేమ 53-93 %, అలాగే గంటకి 9 కి.మి. వేగంతో తూర్పు దిశ గ గాలులు వీయవచ్చును .
. టివి పల్లె క్లస్ట ర్ లోనీ కుప్పా లపల్లి , ముసల్ రెడ్డి గారి పల్లె లో ప్రధాన పంట అయిన చీనీ నిమ్మ పంటలలో పెరుగు దల కొరకై జీవామృతం ని పారించాలి. అలాగే పూత కొరకు కోడి గుడ్ల ద్రావణం లేదా చేపల ద్రావణం పిచికారి చేయాలి. అలాగే కాయలు ఉన్న చీనీ తోటలలో పండు ఈగ కొరకు ఫ్రూట్ ఫ్లే ట్రాప్ పెట్టడం వలన పండు ఈగ ఉద్రుతిని తగ్గించవచ్చు. బక్కన్న గారి పల్లె, వెలమ వారి పల్లె గ్రామాలలో ప్రధాన పంట అయిన అరటి పంటలలో సిగ టోగ తెగులును గుర్తించడం జరిగింది.దీని నివారణకు ఎకరాకు 2 కిలోల ట్రై కో డ ర్మ విరిడి పౌడర్ ను 200 లీటర్స్ నీటిలో కలిపి పిచకారీ చేయాలి ఇలా 15 రోజులకు ఒకసారి పిచి కారి చేస్తూ భూమి కి కూడా ఇవ్వడం వలన నివారించ వచ్చు. అలాగే పత్తి పంటలో దోమ,కాయ తొలుచు పురుగు ఉదృతి ఎక్కువగా ఉంది.దీని నివారణకు ఎకరాకు 25-30 జిగురు పల్లాలు, 10 లింగ కర్షక బుట్టలు పెట్టడం వలన ఉదృతి తగ్గించవచ్చు మరియు వేపనూనె పిచికారి చేయాలి.
అలాగే పసుపు జిగురు పల్లాలు, లింగాకర్షక బుట్టలు, పశువుల దాణా, వేప నూనె , తార్పాలిన్ పంటలు మన వేంపల్లి రైతు ఉత్పత్తి దారుల సంఘం లో అందుబాటులో ఉన్నాయి.కావలసినటువంటి రైతులు 6300235907 కు ఫోన్ చేయగలరు.
అలాగే మీ వ్యవసాయానికి సంబంధించి ఏమైనా సమస్యలు ఎదుర్కొంటున్నారా.??
👉 భూమి రికార్డులు
👉పంట రుణాలు
👉 కౌలు రైతుల సమస్యలు
👉 విత్తన సమస్యలు
👉 మార్కెట్ యార్డులు, ధరలు
👉 వ్యవసాయ సబ్సిడీ, పెట్టుబడి పథకాలు
👉 ప్రకృతి వైపరీత్యాల వలన నష్టం
అయితే పరిష్కారం కొరకు కిసాన్ మిత్ర నెంబర్ 8500983300కు phone చేయండి

41-2022(14-10-22)Vemula Farm Advisory

వేముల మండలం లో రాగల మరో 5 రోజుల యొక్క వాతావరణ సూచన – సాధారణంగా ఆకాశం మేఘావృతమై ఉంటుంది.వర్షపాతం 17 MM ఉండును.,కనిష్ట ఉష్ణోగ్రత :2oడిగ్రీల సెంటిగ్రేడ్, గరిష్టఉష్ణోగ్రత: 31 డిగ్రీల సెంటిగ్రేడ్ సరాసరి గా వుండే అవకాశం వుంది. గాలి గంటకి 9 కి.మి. వేగంతో తూర్పు దిశగా గాలులు వీయును..గాలిలో తేమశాతం 53-93% ఉంటుంది,
వేముల,వేల్పుల గ్రామాలలో పత్తి పంట లో పచ్చదోమ,తెల్లదొమ ఉధృతి ఎక్కువ వుంది ,కావున రైతులు జిగురు పల్లాలు ఎకరాకు 25 చొప్పున పెట్టుకోవాలి,మరియు దోమ నివారణకు వేపగింజల కషాయం పిచికారీ చేయాలి.. అలాగే పత్తి పంట లో గులాబీ రంగు పురుగు ఉధృతి ని గమనించుట కొరకై ఒక ఎకరా పొలం లో లింగ కర్షక బట్టలు 10 నుండి 12 పెట్టుకోవాలి.
అలాగే వేల్పుల.వేముల గ్రామాలలో చీనీ పంటలో ఆకు ముడత ఎక్కువగా వుంది.నివారణకు వేప నూనె 35-40ml tank కలిపి పిచికారి చేయాలి.అరటి లో చిగాట కు తేగులు ఎక్కువగా వున్నది దీని నివారణకు ఒక ఎకరాకు 2 కేజీలు. టీ వీ రీ డి నీ రెండు వందల లీటర్ల. నీటిలో కలి పి పిచికారి లేదా పారించా లి భూమయ్య గారి పల్లి. వేముల మబ్బు చింతల పల్లి గ్రామాలలో
టొమాటో లో బ్యాక్టీరియా ఆకు మచ్చ తెగులు నివారణకు శొంఠి పాల కషాయం నీ పిచికారి చేయాలి.
పురుగులను అదుపులో ఉంచుటకు పంట చుట్టూ ముందు జాగ్రత్తగా బార్డర్ క్రాప్ గా జొన్న, సజ్జ, అంతర పంటలుగా కంది, మటిక, బెండ, అలసంద , అనప ఎర పంటగా ఆముదం వేసుకోవాలి. ఇలా అన్ని రకాల పంటలు వేసుకోవడం వలన మిత్ర పురుగుల సంతతి పెరిగి పురుగులు,తెగుళ్లను నివారించు కోవచ్చు. అలాగే ప్రతి 15 రోజుల కు ఒకసారి జీవామృతం ను పారించి,ప్రకృతి వ్యవసాయ సాగు విధానంలోని రాజీలేని సూత్రాలను పాటించినట్లైతే పత్తి పంటలో రైతులు అధిక దిగుబడులు సాధిస్తారు. అలాగే జామ తోటల్లో పండు ఈగ ఉధృతి ఎక్కువగా వుంది కాబట్టి దీని నివారణకు పండు ఈగ బుట్టలు పెట్టుకోవాలి.
అలాగే పసుపు జిగురు పల్లాలు, లింగాకర్షక బుట్టలు, పండు ఈగ బుట్టలు, విత్తనాల కిట్లు ( అంతర పంటలు వేసుకోవడానికి 11 రకాల విత్తనాలు ), మన వేముల రైతు ఉత్పత్తి దారుల సంఘం లో అందుబాటులో ఉన్నాయి.కావలసినటువంటి రైతులు 9347723277 కు ఫోన్ చేయగలరు.
అలాగే మీ వ్యవసాయానికి సంబంధించి ఏమైనా సమస్యలు వుంటే క్రింది నంబర్ కు ఫోన్ చేయగలరు
8500983300.
ధన్యవాదాలు.

40-2022(07-10-22)Thalupula Farm Advisory

తలుపుల మండలం లో రాగల 5 రోజుల వాతావరణ సూచన – 18 m m వర్షం కురిసే సూచనలు ఉన్నవి. గరిష్ట ఉష్ణోగ్రత -28 డిగ్రీల c ఉండగా, కనిష్ట ఉష్ణోగ్రత 18 డిగ్రీల c గా వుండే అవకాశం వుంది. గాలి గంటకి 15 కి.మి. వేగంతో నైరుతి దిశా గ వీయవచ్చు . గాలిలొ తేమ గరిష్ట 86% ఉండగా, కనిష్టంగా 75% గా ఉండే అవకాశం వుంది.
గొల్లపల్లి తండా క్లస్టర్ లోనీ ఉడుముల కుర్తి, ఓదులపల్లి మరియు కుర్లి గ్రామ పంచాయతీ లలో వరి పంటలో పచ్చ దోమ మరియు కాండం తొలిచే పురుగు అక్కడక్కడా ఉంది.దీనిని నివారణ చేయడానికి ఒక ఎకరానికి జిగురు పల్లాలు 25 నుండి 30 వరకు పెట్టాలి. తరువాత వేపనూనె ఒక ట్యాంక్ కు 30 ml చొప్పున వేసుకోవాలి. వేపనూనె నీటిలో కలవడానికి షాంపు ప్యాకెట్ కానీ ఒక కోడిగుడ్డు కానీ వేసుకొని మిక్స్ చేసుకొని స్ప్రే చేయాలి.ఈ విధంగ చేయడం వలన పురుగుల ఉదృతి నివారణ అవుతుంది. తలుపుల రైతు ఉత్పత్తి దారుల సంఘం లో పశువుల దాణా, టార్పలిన్ కవర్లు తక్కువ ధరకే FPO ఆఫీసు లో అందుబాటులో ఉన్నవి కావలసిన వారు FPO ఆఫీసు దగ్గరకు వచ్చి తీసుక కొనుగోలు చేయగలరు మరింత సమాచారం కొరకు 8500983300 ఈ నంబర్ కు కాల్ చేయండి. మరింత సమాచారం తో వచ్చే వారం కలుసు కుందాం..

40-2022(07-10-22)Proddatur Farm Advisory

ప్రొద్దటూరు మండలం లో రాగల 5 రోజుల వాతావరణ సూచన – 25mm. గరిష్ట ఉష్ణోగ్రత -31డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 21డిగ్రీలు గా వుండే అవకాశం వుంది. గాలి గంటకి 9కి.మి. వేగంతో పడమర దిశా గ వీయవచ్చు .
👉 తల్లమా పురం క్లస్టర్ లో సౌరెడ్డి పల్లి,కల్లూరు, తల్లమా పురం, సీతంపల్లి,యారగుంట్లపల్లి , రేగుల్లపల్లి లో ఇప్పుడు అధిక వర్షాలకు పంట పొలాల్లో మురుగు నీటి కాల్వలను ఏర్పాటు చేసుకోవాలి , పొలంలో ఎరువులు వేయడం అపుకోవాలి,
వర్షాలు తగిన తర్వత
మురుగు నీటి ని
వీలైనంత వరకు బయటకు పంపించాలి
రైతులకు ముఖ్య సూచనలు
ఈ-క్రాప్ EKYC :-
👉 ఇప్పటివరకు ఎవరైతే పంట నమోదు చేపించి ఉన్నారో, అటువంటి రైతులు అందరూ ఇన్సూరెన్స్ కొరకు మరల మీయొక్క ఈకేవైసీని చేపించవలసి ఉన్నది.
కావున ఇందు కొరకు రైతులందరూ మీ యొక్క ఆధార్ కార్డు, పొలం పాస్ బుక్కు , ఆధార్ కి లింక్ అయిన సెల్ ఫోన్ తీసుకుని రైతు భరోసా కేంద్రం వద్దకు రావలెను.
🚨ఈకేవైసీ చేపించనటువంటి రైతులకు ఇన్సూరెన్స్, ఇతర పథకములు వర్తించవు. కావున పంట నమోదు చేపించిన ప్రతి ఒక్క రైతు EKYC చేపించవలెను.
సమయం :- ఉదయం 9.00 కి మొదలు పెట్టి, 11 గంటల వరకు చేయడం జరుగుతుంది. 11 గంటల తర్వాత సర్వర్ పని చేయదు.
*వర్షాకాలంలో పశువుల పెంపకం మరియు పోషణ
వర్షాకాలంలో పశువుల పెంపకం మరియు పోషణ తగివిధంగా జాగ్రత్తలు పాటిస్తే పాల దిగబడి తగ్గకుండా అలాగే రోగాల బారి న పడకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు.
పశువులను పాకలో పెట్టాలి, అధిక వర్షాలకు, గాలికి తడవకుండా ఏర్పాట్లు చేసుకోవాలి.
నీరు నిల్వ ఉండడం వల్ల దోమలు, ఈగలు పెరిగి వ్యాధుల వ్యాప్తికి కారణం అవుతాయి, కాబట్టి వీటి నిర్మూలనకు చర్యలు చేపట్టాలి.
అన్ని పశువులకు వ్యాధినిరోధక టీకాలు వేయించాలి.
మరింత సమాచారం కోసం 8500983300 ఈ నెంబర్ కు కాల్ చేయండి.

40-2022(07-10-22)Thungabhadra Farm Advisory

కిసాన్ మిత్ర ఫోన్ రేడియో రైతు మిత్రులందరికీ స్వాగతం పలుకుతోంది.C. బెలగల్ మండలం లో రాగల ఐదు రోజులలో వాతావరణ సూచన. వర్షం 38 మిల్లీమీటర్ల దాకా పడవచ్చు . కనిష్ట ఉష్ణోగ్రత 20 డిగ్రీలు మరియు గరిష్ట ఉష్ణోగ్రత 30 డిగ్రీలు గా ఉండే అవకాశం వుంది. గాలిలో తేమశాతం 68% – 90% దాకా ఉండవచ్చు. గాలి గంటకి 8 కిలోమీటర్ల వేగంతో పడమర, దక్షిణ దిశగా వీయవచ్చు. కొండాపురం క్లస్టర్, ఈర్లదిన్నె రైతు K.భద్రయ్య వరి పొలంలో రసం పీల్చు పురుగులను గుర్తించి నివారణ కొరకు జిగురు అట్టలు పెట్టుకోవాలని అలాగే నీమాస్త్రం లేదా వావిలాకు కషాయం పిచ్చికారి చేసుకోవాలని తెలియజేయడం జరిగింది. ముడుమాల గ్రామం K. గిడ్డయ్య మిరప పంటలో తెల్ల దోమ, పచ్చ దోమ మరియు తామర పురుగులను గుర్తించి నివారణకు పసుపు, నీలం రంగు జిగురు అట్టలు పెట్టుకోవాలని మరియు ఆవుపేడ మూత్రం ఇంగువ ద్రావణం పిచికారి చేసుకోవాలని చెప్పడం జరిగింది. ముడుమాల గ్రామం M. రాముడు పత్తి పంటలో పేనుబంక, తామర పురుగులను గుర్తించి నివారణ కొరకు వేప నూనె పిచికారి చేసుకోవాలని మరియు జిగురు అట్టలు పెట్టుకోవాలని మరియు గులాబీ రంగు పురుగును గుర్తించి నివారణకు బ్రహ్మాస్త్రం పిచికారి చేయాలని, అలాగే గులాబీ రంగు పురుగుల ఉధృతి తెలుసుకోవడానికి ఒక ఎకరానికి 8 నుంచి 10 లింగాకర్షణ బుట్టలు పెట్టుకోవాలని తెలియజేయడం జరిగింది. కొండాపురం క్లస్టర్ లోని మొక్కజొన్న వేసే రైతులకు విత్తన శుద్ధి బీజామృతం లేదా ట్రైకోడెర్మావిరిడి తో చేసుకోవాలని తెలియజేయడం జరిగింది.తుంగభద్ర FPO ఆఫీస్ నందు 250 రూపాయలు విలువ చేసే జిగురు అట్టలు 100/- రూపాయలకు,45 రూపాయలు విలువ చేసే పత్తి,వేరుశనగ, వరి, మిరప పంటలకు కావలసిన లింగాకర్షక బుట్టలను 10/- రూపాయలకు, వేప నూనె ఒక లీటర్ 380/- రూపాయలకు,40 కిలోల వేప పిండి బస్తా 950/- రూపాయలకు, డబుల్ మోటార్ బ్యాటరీ స్ప్రేయర్స్ 3500/- రూపాయలకు అందుబాటులో ఉన్నాయి. కావలసినవారు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు 9177427817 మరియు 9492761257. మరింత సమాచారం కోసం కొండాపురం మరియు ముడుమాల గ్రామంలో ఉన్న తుంగభద్ర సేంద్రియ రైతు ఉత్పత్తి దారుల సంఘం ఆఫీస్ నందు కలవండి. వ్యవసాయానికి సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కారం కొరకు CSA సంస్థ కిసాన్ మిత్ర కాల్ సెంటర్ 8500983300 నెంబర్ కు కాల్ చేయండి.