Date:13/05/2023
Centre for Sustainable Agriculture
సుస్థిర వ్యవసాయ కేంద్రం-వేపాడ మండలం లో రాగల ఐదు రోజులు వాతావరణ సూచన- వర్షం కురిసే సూచన లేదు.
గరిష్ట ఉష్ణోగ్రత 35-41డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 25-27డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. గాలి గంటకి 9-16km వేగంతో ఆగ్నేయం నుండీ దక్షిణ దిశగా వీయ్యవచ్చు. గాలిలో తేమసాతం 23-76% ఉండవచ్చును.
👉🏻K G పూడి, కోటయ్యగరువు, చిట్టివానిపాలెం,SKSR పురం, చామలాపల్లి, దబ్బిరాజుపేట గ్రామాల్లో మామిడిలో పండు ఈగ ఉదృతి ఉంది కావున రైతులు దీనిని గుర్తించుటకు కాయలుపై రంధ్రాలుతో నల్ల మచ్చలు ఏర్పడి పండు కుళ్లిపోతుంది దీని వల్ల పండు యొక్క నాన్యత తగ్గిపోయి పంటకు నష్టం కలిగించి దిగుబడి తగ్గిపోయేలా చేస్తుంది. పండు ఈగ నివారణకు రైతులు ఎకరానికి 6-8 పండు ఈగ ఉచ్చులను అమర్చి 5mm వేప నూనెను లీటర్ నీటికి కలిపి పిచికారి చేయవలెను అలాగె పక్వానికి వస్తున్న పండ్లకు కవర్లు అమర్చవలెను.
👉🏻SKSR పురం, PKR పురం , బోద్ధం గ్రామల్లో అరటిలో సిగటోకా తెగులు ఉన్నది కావున రైతులు దీని నివారణకు 5% వేప కషాయం లేధా ఆవు పేడ+మూత్రం+ఇంగువ ద్రావణం పిచికారి చేయవలెను.
👉🏻 KG పూడి, కరకవలస క్లస్టర్ గ్రామాల్లో ఉన్న రైతులు ప్రధాన పొలం లో ఎరువులగ వేయుటకు ఘన జీవామృతం తయారుచేసుకోవలెను. అలాగే తధుపరి రాగల వర్షాలను వినియోగించుకొని నేలను దున్ని తయారు చేసుకొని ప్రధాన పొలంలో వేయుటకు పచ్చిరొట్ట పైర్ల విత్తనాలను కూడ సిద్దం చేసికోవలెను. రైతులు ఈ విత్తనాలను గ్రామాల్లో ఉన్న సుస్థిర వ్యవసాయ సిబ్బంది దగ్గర కాని బోద్దాం CSA ఆఫీస్ లో కానీ ఎకరానికి సరిపడ విత్తనాలను 500-700రూ. కిట్ ను రైతులు కొనుగోలు చేసుకోగలరు.
👉 మరింత సమాచారం కోసం 8500983300 ఈ నంబరును సంప్రదించగలరు.