Centre for Sustainable Agriculture-Vepada farm advisory
వేపాడ మండలం లో రాగల ఐదు రోజులు వాతావరణ సూచన – 0-2mm మోతదులో వేరువేరు చోట్ల తేలికపాటి వర్ష0 కురిసే సూచన ఉంది. గరిష్ట ఉష్ణోగ్రత 34-37 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 23-24డిగ్రీలు గా ఉండే అవకాశం ఉంది. గాలి గంటకి 5-11కి.మి. వేగం తో వీయవచ్చు.
Pkr పురం,SKSRపురం రామస్వామిపేట, దబ్బిరాజుపేట,చామలపల్లి, జగ్గయ్యపేట గ్రామాలలో టొమాటో వేసుకున్న రైతులు టమాటలో కాయ కుల్లుతెగులు& కాయ మాచ తెగులు ఉదృతి ఉన్నట్లైతే పుల్లటి మజ్జిగను లేదా సొంటిపాల కషాయం ను పిచికారి చేయగళరు.
Kg పూడి, పాతూరు, చిట్టివానిపాలెం, ధబ్బిరాజుపేట గ్రామాల్లో జీడిలో కాండం తోలుచు పురుగును గుర్తించి నాశనం చేయాలి. పురుగును గుర్తించుటకు ప్రధాన కాండం పైన రంద్రాలు ఏర్పడి చెక్కపొడి
లాంటి పదార్ధంను విసర్జిస్తూ నల్లటి బంక రూపంలో జిగురు కనిపిస్తుంది.
పురుగును నాశనం చేసాక కాండం పైన బెరడును తొలగించి కాండంపై వేపముద్దను పుయాలి& అగ్నాస్త్రం పిచ్కారి చేయవలెను. చెట్టు మొదల నుంచి 1mt ఎత్తు వరకు సున్నం గాని వేప లేపనం గాని 3నెలల ఒకసారి పూసుకోవాలి. మరింత సమాచారం కోసం 8500983300 ఈ నంబర్ కు కాల్ చేయండి.