కిసాన్ మిత్ర ఫోన్ రేడియో రైతు మిత్రులందరికీ స్వాగతం పలుకుతోంది.C. బెలగల్ మండలం లో రాగల ఐదు రోజులలో వాతావరణ సూచన. వర్షం 12 మిల్లీమీటర్ల దాకా పడవచ్చు . కనిష్ట ఉష్ణోగ్రత 19 డిగ్రీలు మరియు గరిష్ట ఉష్ణోగ్రత 32 డిగ్రీలు గా ఉండే అవకాశం వుంది. గాలిలో తేమశాతం 59% – 87% దాకా ఉండవచ్చు. గాలి గంటకి 10 కిలోమీటర్ల వేగంతో తూర్పు దిశగా వీయవచ్చు. కొండాపురం, పలదొడ్డి, ముడుమాల మరియు ఈర్లదిన్నె గ్రామాలలోని వరి పొలాలలో రసం పీల్చు పురుగుల ఉధృతి ఎక్కువగా ఉన్నందున నివారణ కొరకు జిగురు అట్టలు పెట్టుకోవాలని, అలాగే నీమాస్త్రం లేదా వావిలాకు కషాయం పిచ్చికారి చేసుకోవాలని, ఆకు ముడత పురుగు నివారణకు బ్రహ్మాస్త్రం పిచికారి చేయాలని తెలియజేయడం జరిగింది. మిరప పంటలలో త్రిప్స్ ఉధృతి ఎక్కువగా ఉన్నందున నివారణకు పసుపు, నీలం రంగు జిగురు అట్టలు పెట్టుకోవాలని, వావిలాకు కషాయం పిచికారి చేయాలని, ఆకు ముడత నివారణకు పచ్చిపాలు లేదా పుల్లటి మజ్జిగ పిచికారి చేయాలని, తెగుళ్ల నివారణ కొరకు ఆవుపేడ మూత్రం ఇంగువ ద్రావణం పిచికారి చేసుకోవాలని చెప్పడం జరిగింది.పత్తి పంటలలో గులాబీ రంగు పురుగు మరియు మొక్కజొన్న పంటలలో కత్తెర పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నందున నివారణకు బ్రహ్మాస్త్రం పిచికారి చేయాలని, అలాగే ఎకరానికి 8 నుంచి 10 లింగాకర్షణ బుట్టలు పెట్టుకోవాలని తెలియజేయడం జరిగింది. తుంగభద్ర FPO ఆఫీస్ నందు 250 రూపాయలు విలువ చేసే జిగురు అట్టలు 100/- రూపాయలకు,45 రూపాయలు విలువ చేసే పత్తి,వేరుశనగ, వరి, మిరప పంటలకు కావలసిన లింగాకర్షక బుట్టలను 10/- రూపాయలకు, వేప నూనె ఒక లీటర్ 380/- రూపాయలకు,40 కిలోల వేప పిండి బస్తా 950/- రూపాయలకు, డబుల్ మోటార్ బ్యాటరీ స్ప్రేయర్స్ 3500/- రూపాయలకు అందుబాటులో ఉన్నాయి. కావలసినవారు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు 9177427817 మరియు 9492761257. మరింత సమాచారం కోసం కొండాపురం మరియు ముడుమాల గ్రామాలలో ఉన్న తుంగభద్ర సేంద్రియ రైతు ఉత్పత్తి దారుల సంఘం ఆఫీస్ నందు కలవండి. వ్యవసాయానికి సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కారం కొరకు CSA సంస్థ కిసాన్ మిత్ర కాల్ సెంటర్ 8500983300 నెంబర్ కు కాల్ చేయండి.
తలుపుల మండలం లో రాగల 5 రోజుల వాతావరణ సూచన – 18 m m వర్షం కురిసే సూచనలు ఉన్నవి. గరిష్ట ఉష్ణోగ్రత -28 డిగ్రీల c ఉండగా, కనిష్ట ఉష్ణోగ్రత 18 డిగ్రీల c గా వుండే అవకాశం వుంది. గాలి గంటకి 15 కి.మి. వేగంతో నైరుతి దిశా గ వీయవచ్చు . గాలిలొ తేమ గరిష్ట 86% ఉండగా, కనిష్టంగా 75% గా ఉండే అవకాశం వుంది.
గొల్లపల్లి తండా క్లస్టర్ లోనీ ఉడుముల కుర్తి, ఓదులపల్లి మరియు కుర్లి గ్రామ పంచాయతీ లలో వరి పంటలో పచ్చ దోమ మరియు కాండం తొలిచే పురుగు అక్కడక్కడా ఉంది.దీనిని నివారణ చేయడానికి ఒక ఎకరానికి జిగురు పల్లాలు 25 నుండి 30 వరకు పెట్టాలి. తరువాత వేపనూనె ఒక ట్యాంక్ కు 30 ml చొప్పున వేసుకోవాలి. వేపనూనె నీటిలో కలవడానికి షాంపు ప్యాకెట్ కానీ ఒక కోడిగుడ్డు కానీ వేసుకొని మిక్స్ చేసుకొని స్ప్రే చేయాలి.ఈ విధంగ చేయడం వలన పురుగుల ఉదృతి నివారణ అవుతుంది. తలుపుల రైతు ఉత్పత్తి దారుల సంఘం లో పశువుల దాణా, టార్పలిన్ కవర్లు తక్కువ ధరకే FPO ఆఫీసు లో అందుబాటులో ఉన్నవి కావలసిన వారు FPO ఆఫీసు దగ్గరకు వచ్చి తీసుక కొనుగోలు చేయగలరు మరింత సమాచారం కొరకు 8500983300 ఈ నంబర్ కు కాల్ చేయండి. మరింత సమాచారం తో వచ్చే వారం కలుసు కుందాం..