Category Archive Farm Advisories

36-2022(09-09-22)Vempalli Farm Advisory

వేంపల్లె మండలం లో రాగల మరో 5 రోజుల యొక్క వాతావరణ సూచన – గరిష్ట ఉష్ణోగ్రత -34 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 20 డిగ్రీలు గా వుండే అవకాశం వుంది. రాగల మరో 5 రోజుల్లో 19mm వర్షపాతం ఉండును. గాలిలో తేమ 50-71 %, అలాగే గంటకి 23 కి.మి. వేగంతో ఉత్తరం మరియు పడమర దిశ గ గాలులు వీయవచ్చును .
టివి పల్లె క్లస్టర్ లోనీ కుప్పలపల్లి , వెలమవారిపల్లి , బక్కన్నగారిపల్లి గ్రామాలలో ప్రధాన పంట అయినటువంటి పత్తి పంట లో రసం పీల్చు పురుగు ల నివారించుటకు ఒక ఎకరానికి 25 నుండి 30 వరకు పసుపు జిగురు పల్లెములు పెట్టాలి. అలాగే మెగ్నేషియం లోప నివారణకై ఆవు మూత్రం ఇంగువ ద్రావణం పిచికారీ చేయాలి.. అలాగే పత్తి పంట లో గులాబీ రంగు పురుగు ఉధృతి నివారణ కొరకై ఒక ఎకరా పొలం లో లింగ కర్షక బట్టలు 8 నుండి 10 వరకు పెట్టుకోవాలి. ఇవి పెట్టడం వలన పత్తి కాయలో వచ్చే ఎర్ర పురుగును నివారించవచ్చు.అలాగే చీనీ,నిమ్మ పంటలలో ఇగురు లో వచ్చే పేను బంక,పురుగు నివారణకు, వేపనూనె పిచికారి చేయాలి. అలాగే ఎదుగుదళ కొరకై జీవామృతం ని పారించాలి.అలాగే పూత కొరకు కోడి గుడ్ల ద్రావణం లేదా పంచగవ్య పిచికారి చేయాలి.
అలాగే పసుపు జిగురు పల్లాలు, లింగాకర్షక బుట్టలు, పశువుల దాణా, విత్తనాల కిట్లు ( అంతర పంటలు వేసుకోవడానికి 11 రకాల విత్తనాలు ), జీవామృతం తయారీకి కావాల్సిన బెల్లం, వేప నూనె మన వేంపల్లి రైతు ఉత్పత్తి దారుల సంఘం లో అందుబాటులో ఉన్నాయి.కావలసినటువంటి రైతులు 6300235907 కు ఫోన్ చేయగలరు.
అలాగే మీ వ్యవసాయానికి సంబంధించి ఏమైనా సమస్యలు ఎదుర్కొంటున్నారా.??
👉 భూమి రికార్డులు
👉పంట రుణాలు
👉 కౌలు రైతుల సమస్యలు
👉 విత్తన సమస్యలు
👉 మార్కెట్ యార్డులు, ధరలు
👉 వ్యవసాయ సబ్సిడీ, పెట్టుబడి పథకాలు
👉 ప్రకృతి వైపరీత్యాల వలన నష్టం
తదితర సమస్యల పరిష్కారం కొరకు csa కిసాన్ మిత్ర నెంబర్ 8500983300కు phone చేయండి.

36-1(7-9-2022) Vepada Farm Advisory

Date: 7-9-2022
Centre for Sustainable Agriculture-Vepada farm advisory
వేపాడ మండలం లో రాగల ఐదు రోజులు వాతావరణ సూచన – 18-30mm మొతాదులో వర్షం కురిసే సూచన ఉంది. గరిష్ట ఉష్ణోగ్రత 32-37డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 23-25 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. గాలి గంటకి 6-11km వేగంతో దక్షిణం దిశగా వీయవచ్చు. బోద్ధం,R S పేట, జగ్గయ్యపేట ,కరకవలస గ్రామాల్లో ఆకు ముడత పురుగు ఉదృతి ఉన్నందున కంప లాగి లార్వ దశలలో పురుగులను అధుపు చేయుటకు పచ్చిమిర్చి+వెల్లుల్లి కషాయం పిచికారి చేసుకోగలరు.మరియు పొడ తెగులు నివారణకు రైతులు 1లీ.ఆవు మూత్రం+1లీ. మజ్జిగ తీసుకొని 8లీ. నీటిలో కలుపుకొని పిచికారి చేసుకోవలెను. మరియు పేరటి తోటలలో పెంచుకుంటున్న అరటి మొక్కలకు వర్షాల కారణంగా సిగటోక తెగులు వృద్ధి చెందే అవకాశం ఉన్నందున రైతులు Trichoderma viridae లేధా సొంటిపాల కషాయం పిచికారి చేసుకోవలెను.అలాగే కెజి పూడి, Sksr పురం క్లస్టర్లులో ఉద్యానవన పంటలు అయిన జీడి మామిడిలో కొత్త చిగుర్లు వచ్చి పూత అధికంగా వస్తు దిగుబడి పెంపొందించుటకు కొమ్మ కత్తిరింపులు చేసుకోవలెను.మరియు YSR రైతు భరోసా పోర్టల్లో కొత్త రిజిస్ట్రేషన్ పోర్టల్ ప్రారంబించ బడినది కావున వైఎస్ఆర్ రైతు భరోసా కి సంబందించి 2022-23 సం. గాను అర్హత ఉన్న రైతులందరూ మీ స‌మీప RBK లలో సంప్రదించి రిజిస్ట్రేషన్ చేయించుకోవలెను.గత సం.లబ్దిపొందిన రైతులకు కొత్తగా నమోదు అవసరం లేదు. మరింత సమాచారం కోసం 8500983300 ఈ నంబర్ కు కాల్ చేయండి.

35-2022(03-09-22)Vempalli Farm Advisory

వేంపల్లె మండలం లో రాగల మరో 5 రోజుల యొక్క వాతావరణ సూచన – గరిష్ట ఉష్ణోగ్రత -34 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 24 డిగ్రీలు గా వుండే అవకాశం వుంది. రాగల మరో 5 రోజుల్లో 2 mm వర్షపాతం ఉండును. గాలిలో తేమ 76%, అలాగే గంటకి 6 కి.మి. వేగంతో పడమర దిశ గ గాలులు వీయవచ్చును .
టివి పల్లె క్లస్టర్ లోనీ కుప్పలపల్లి , వెలమవారిపల్లి , బక్కన్నగారిపల్లి గ్రామాలలో ప్రధాన పంట అయినటువంటి పత్తి పంట లో రసం పీల్చు పురుగు ల నివారించుటకు ఒక ఎకరానికి 25 నుండి 30 వరకు పసుపు జిగురు పల్లెములు పెట్టాలి. అలాగే మెగ్నేషియం లోప నివారణకై ఆవు మూత్రం ఇంగువ ద్రావణం పిచికారీ చేయాలి.. అలాగే పత్తి పంట లో గులాబీ రంగు పురుగు ఉధృతి నివారణ కొరకై ఒక ఎకరా పొలం లో లింగ కర్షక బట్టలు 8 నుండి 10 వరకు పెట్టుకోవాలి. ఇవి పెట్టడం వలన పత్తి కాయలో వచ్చే ఎర్ర పురుగును నివారించవచ్చు.అలాగే చీనీ,నిమ్మ పంటలలో ఇగురు లో వచ్చే పేను బంక,పురుగు నివారణకు, వేపనూనె పిచికారి చేయాలి. అలాగే ఎదుగుదళ కొరకై జీవామృతం ని పారించాలి.అలాగే పూత కొరకు కోడి గుడ్ల ద్రావణం లేదా పంచగవ్య పిచికారి చేయాలి.
అలాగే పసుపు జిగురు పల్లాలు, లింగాకర్షక బుట్టలు, పశువుల దాణా, విత్తనాల కిట్లు ( అంతర పంటలు వేసుకోవడానికి 11 రకాల విత్తనాలు ), జీవామృతం తయారీకి కావాల్సిన బెల్లం, వేప నూనె మన వేంపల్లి రైతు ఉత్పత్తి దారుల సంఘం లో అందుబాటులో ఉన్నాయి.కావలసినటువంటి రైతులు 6300235907 కు ఫోన్ చేయగలరు.
అలాగే మీ వ్యవసాయానికి సంబంధించి ఏమైనా సమస్యలు ఎదుర్కొంటున్నారా.??
👉 భూమి రికార్డులు
👉పంట రుణాలు
👉 కౌలు రైతుల సమస్యలు
👉 విత్తన సమస్యలు
👉 మార్కెట్ యార్డులు, ధరలు
👉 వ్యవసాయ సబ్సిడీ, పెట్టుబడి పథకాలు
👉 ప్రకృతి వైపరీత్యాల వలన నష్టం
తదితర సమస్యల పరిష్కారం కొరకు csa కిసాన్ మిత్ర నెంబర్ 8500983300కు phone చేయండి.

35-2(3-9-2022) Vepada Farm Advisory

Date: 3-9-2022
Centre for Sustainable Agriculture-Vepada farm advisory
వేపాడ మండలం లో రాగల ఐదు రోజులు వాతావరణ సూచన – 2-11mm మొతాదులో వర్షం కురిసే సూచన ఉంది. గరిష్ట ఉష్ణోగ్రత 34-36డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 24 డిగ్రీలు గా ఉండే అవకాశం ఉంది. గాలి గంటకి 2-8km వేగంతో దక్షిణం దిశగా వీయవచ్చు. KG పూడి, sksr పురం క్లస్టర్స్ లో వరి ప్రధాన పంటగా వేసుకున్న రైతుల పోలాల్లో మిడతల ఉదృతి అధికంగా ఉన్న కారణంగా రైతులు పొలాల్లో ఎకరానికి 15-20వరకు పక్షి స్థావరాలు ఏర్పాటు చేసుకొని వెల్లుల్లి ద్రావణం పిచికారి చేసుకోవలెను. మరియు సారవాణి పాలెం, కెజి పూడి, మారిక మరియు ఇతర మెట్ట ప్రాంతాలలో చిరుధాన్యాలు వేసుకున్న రైతులు తెగుల్ల నివారణకు పెడ+మూత్రం+ఇంగువ ద్రావణం పిచికారి చేసుకోవలెను.అలాగే మారిక గ్రామంలో మొక్క జొన్న వేసుకున్న రైతులు కత్తెర పురుగు ఆశించే అవకాశం ఉన్నందున లార్వ దశలలో ఉన్న పురుగులను నివారించుటకు మొక్క సుడులలో లేధా మొవ్వులో ఇసుక మరియు సున్నం కలుపుకొని 9:1నిష్పత్తిలో ఆ పొడిని వేయవలెను అలాగె వేపనూనె 1500ppm నీటిలో కలుపుకొని పిచికారి చేయటం వలన కత్తెర పురుగును నివారించవచ్చును.మరింత సమాచారం కోసం 8500983300 ఈ నంబర్ కు కాల్ చేయండి.

35-2022(28-08-22)Vempalli Farm Advisory

వేంపల్లె మండలం లో రాగల మరో 5 రోజుల యొక్క వాతావరణ సూచన – గరిష్ట ఉష్ణోగ్రత -36 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 21 డిగ్రీలు గా వుండే అవకాశం వుంది. రాగల మరో 5 రోజుల్లో 2 5mm వర్షపాతం ఉండును. గాలిలో తేమ 74%, అలాగే గంటకి 14 కి.మి. వేగంతో ఉత్తరం మరియు పడమర దిశ గ గాలులు వీయవచ్చును .
టివి పల్లె క్లస్టర్ లోనీ కుప్పలపల్లి , వెలమవారిపల్లి , బక్కన్నగారిపల్లి గ్రామాలలో ప్రధాన పంట అయినటువంటి పత్తి పంట లో రసం పీల్చు పురుగు ల నివారించుటకు ఒక ఎకరానికి 25 నుండి 30 వరకు పసుపు జిగురు పల్లెములు పెట్టాలి. ఆ తరువాత వావిలకు కషాయం 5 లిటర్స్ ను 100 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి..ఈ విధంగ చేయడం వలన పురుగుల ఉదృతి నివారణ అవుతుంది. అలాగే పత్తి పంట లో గులాబీ రంగు పురుగు ఉధృతి నివారణ కొరకై ఒక ఎకరా పొలం లో లింగ కర్షక బట్టలు 8 నుండి 10 పెట్టుకోవాలి. ఇవి పెట్టడం వలన పత్తి కాయలో వచ్చే పురుగును నివారించవచ్చు.అలాగే చీనీ,నిమ్మ పంటలలో ఇగురు లో వచ్చే పేను బంక,పురుగు నివారణకు, వేపనూనె పిచికారి చేయాలి.మరియు భూమి సారవంతం కొరకు జీవామృతం 15 రోజులకు ఒకసారి పాటించాలి..అలాగే పూత కొరకు కోడి గుడ్ల ద్రావణం లేదా పంచగవ్య పిచికారి చేయాలి.
అలాగే పసుపు జిగురు పల్లాలు, లింగాకర్షక బుట్టలు, పశువుల దాణా, విత్తనాల కిట్లు ( అంతర పంటలు వేసుకోవడానికి 11 రకాల విత్తనాలు ), జీవామృతం తయారీకి కావాల్సిన బెల్లం, వేప నూనె మన వేంపల్లి రైతు ఉత్పత్తి దారుల సంఘం లో అందుబాటులో ఉన్నాయి.కావలసినటువంటి రైతులు 6300235907 కు ఫోన్ చేయగలరు.
అలాగే మీ వ్యవసాయానికి సంబంధించి ఏమైనా సమస్యలు ఎదుర్కొంటున్నారా.??
👉 భూమి రికార్డులు
👉పంట రుణాలు
👉 కౌలు రైతుల సమస్యలు
👉 విత్తన సమస్యలు
👉 మార్కెట్ యార్డులు, ధరలు
👉 వ్యవసాయ సబ్సిడీ, పెట్టుబడి పథకాలు
👉 ప్రకృతి వైపరీత్యాల వలన నష్టం
తదితర సమస్యల పరిష్కారం కొరకు csa కిసాన్ మిత్ర నెంబర్ 8500983300కు phone చేయండి.

34-2(27-8-2022) Vepada Farm Advisory

Date : 27-8-2022
Centre for Sustainable Agriculture-Vepada farm advisory
వేపాడ మండలం లో రాగల ఐదు రోజులు వాతావరణ సూచన – 6-15mm మొతాదులో వర్షం కురిసే సూచన ఉంది. గరిష్ట ఉష్ణోగ్రత 36-38డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 24-25డిగ్రీలు గా ఉండే అవకాశం ఉంది. గాలి గంటకి 2-8km వేగంతో ఆఘ్నేయ దిశగా వీయవచ్చు. ,Sksr Puram, Boddam,R.S, పేట, Jaggayyapeta,Sompuram, Gudivada గ్రామాల్లో వరిలో ఆకుముడత పురుగు ఉన్న0దువలన రైతులు కంప లాగి, మడిలో నీరును వదిలి మల్లీ నీరు కట్టవలెను. అలాగే , Sksr పురం, R.S పేట గ్రామాల్లో రెల్ల రాల్చు Purugu లేధా కత్తెర పురుగు ఉన్నందున 5% వేప కషాయం మరింత ఎక్కువ ఉదృతి ఉన్నట్లైతే అగ్నాస్త్రం పిచికారి చేసుకోవలెను. మరియు సారవానిపాలెం, చామలపల్లి గ్రామాల్లో కురగాయలు వేసుకున్న రైతులు వంగలో మొవ్వు ,కాయ తోలుచు పురుగుల నివారణకు ఎకరానికీ 5-6లింగాకర్షక బుట్టలు అమర్చి పచ్చిమిర్చి-వెల్లుల్లి ద్రావణం పిచికారి చేసుకోవలెను.మరింత సమాచారం కోసం 8500983300 ఈ నంబర్ కు కాల్ చేయండి.

34-1(24-8-2022) Vepada Farm Advisory

Date: 24-8-2022
Centre for Sustainable Agriculture-Vepada farm advisory
వేపాడ మండలం లో రాగల ఐదు రోజులు వాతావరణ సూచన – 8-25mm మొతాదులో వర్షం కురిసే సూచన ఉంది. గరిష్ట ఉష్ణోగ్రత 33-36డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 23-27డిగ్రీలు గా ఉండే అవకాశం ఉంది. గాలి గంటకి 4-9km వేగంతో దక్షిణం దిశగా వీయవచ్చు. కరకవలస,జగ్గయ్యపేట గ్రామాల్లో వరిలో ఆకుముడత పురుగు ఉన్న0దువలన రైతులు కంప లాగి, మడిలో నీరును వదిలి మల్లీ నీరు కట్టవలెను. అలాగే బోద్ధం, కరకవలస,ధబ్బిరాజుపేట గ్రామాల్లో కాండం తొలుచు పురుగు నివారణకు ఎకరానికి 5-6లింగాకర్షక బుట్టలను అమర్చి, 5% వేప కషాయం పిచికారి చేసుకోవలెను. మరియు kg PUDI, sksr puram క్లస్టర్లులో రైతులు పచ్చ దోమ, తెల్ల ధోమ పురుగుల నివారణకు పసుపు పల్లాలు ఎకరానికి 15-20వరకు అమర్చి, తూటికాడ కషాయం పిచికారి చేసుకోవలెను. అలాగే పొలంలో పక్షి స్థావరాలు ఏర్పాటు చేయడం వల్ల పక్షులు ఆ పురుగులను తిని పంట నాశనం జరగకుండా తోడ్పడతాయి. మరింత సమాచారం కోసం 8500983300 ఈ నంబర్ కు కాల్ చేయండి.

33-2022(21-08-2022)Proddatur Farm Advisory

ప్రొద్దటూరు మండలం లో రాగల 5 రోజుల వాతావరణ సూచన వర్షము – 2mm కురిసే అవకాశం వుంది . గరిష్ట ఉష్ణోగ్రత -36 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీలు గా వుండే అవకాశం వుంది. గాలి గంటకి 27 కి.మి. వేగంతో పడమర దిశా గ వీయవచ్చు .
తల్లమపురం క్లస్టర్ సౌరెడ్డి పల్లి,కల్లూరు, తాళ్లమపురం, సీతంపల్లి,యారగుంట్లపల్లి లో గ్రామాలలో అయిన వరి నాట్లు సిద్ధం చేసుకుంటున్న రైతులకు ముఖ్యంగా
వరిలో పాటించవలసిన మెళకువలు
* నారుసుద్ది
*పసుపు, తెలుపు ప్లేట్స్
*రక్షకపంటలు
*లింకాకర్షక బుట్టల
*కోసలు తుంచి నాటడం
*కాలిబాటలు
*అజోళ్ళ
ఇలా గతవారం చెపుకున్నాము, రైతులు ఒక సారి గమానించగలరు,
అలాగే పత్తి పంట వేసుకున్న రైతులు ముక్యంగా గమనించవలసిన విషయాలు,
1.మొదట నాణ్యమైన విత్తనాలు కొనుగోలు చేయాలి,
2.దేశీ వాలి విత్తనాలను సాగుచేయాలి,
3.పత్తి పంట లో అధికంగా గులాబీ రంగు పురుగు వృధితి ఎక్కువ గ ఉంటుంది
ఈ పురుగు అదుపు కు ఎమి చేయాలి.
విత్తనం పొలంలో నాటే ముందు విత్తన శుద్ది చేయాలి, ఇలా చేయడం వల్ల భూమి నుండి సంక్రమించే తెగులు రాకుండా చేసుకోవచ్చు
*పత్తిలో అలసంద, పెసలు, సోయాబీన్స్ అంతర పంట గా వేయడం వల్ల రైతు మిత్ర పురుగులు అయిన అంక్షితల పురుగులు ,క్రేసోపా, సిర్పిడ్ ఈగలు మొదలగు పెరిగి సస్యరక్షణ జరుగుతుంది, ఈ అంతర పంటలు వల్ల ఆదాయం కూడా వస్తుంది,
*యరపంట ఆముదం ,బెండ పత్తి పంట లో నాటుకొని దానిపై ఆశించిన లార్వాలు ను ,పురుగు గుడ్లను నాశనము చేయలి,
*పత్తి పంట చుట్టూ రక్షిత పంట గా 4 వరసలు జొన్న,సజ్జ విత్తాలి.
*పురుగుల మందులు పిచికారీ ఆపేయడం వల్ల పొలంలో మిత్ర పురుషులు అయిన అంక్షితల పురుగులు ,క్రేసోపా, సిర్పిడ్ ఈగలు మొదలగు పెరిగి సహజ సస్యరక్షణ జరుగుతుంది.
*పొలంలో ఎకరానికి లింకాకర్షక బుట్టలు 10 అమార్చుకొని అడా మగ పురుగులను కలవానియకుండా చేయడం వల్ల పురుగును అదుపు చేయవచ్చు.
*తల్లి పురుగుల గుడ్లు పెట్టకుండా 5 శాతం వేప కషాయం పిచికారీ చెయ్యాలి 5 రోజుల వ్యవధి తో 2 సార్లు స్ప్రే చేయాలి,
మరింత సమాచారం కోసం 8500983300కు కాల్ చేయగలరు, మళ్ళీ కలుద్దాం

33-2(20-8-2022) Vepada farm Advisory

Date : 20-8-2022
Centre for Sustainable Agriculture-Vepada farm advisory
వేపాడ మండలం లో రాగల ఐదు రోజులు వాతావరణ సూచన – 8-21mm మొతాదులో వర్షం కురిసే సూచన ఉంది. గరిష్ట ఉష్ణోగ్రత 33-35డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 24-25డిగ్రీలు గా ఉండే అవకాశం ఉంది. గాలి గంటకి 9-11km వేగంతో నైరుతి దిశగా వీయవచ్చు. కె.జి.పూడి,SKSR పురం క్లస్టర్లో ప్రధాన పంటగ వరి వేసిన రైతులు ప్రకృతి సేద్యంలో రాజీలేని సూత్రాలు పాటించేట0దుకు రైతులు పచ్చ దోమ, తెల్ల ధోమ, రసం పీల్చు పురుగుల నివారణకు పసుపు,తెలుపు పల్లాలు ఎకరానికి 15-20వరకు అమర్చవలెను.మరియు వరిలో కాండం తొలుచు పురుగు యొక్క తల్లి పురుగుల ఉద్రుతిని తెలుసుకొనుటకు &నివారణకు ఎకరానికి 5-6లింగాకర్షక బుట్టలను పొలంలో అమర్చవలెను.అలాగే ఎకరానికి 10-15 పక్షి స్థావరాలు పొలంలో ఏర్పాటు చేయవలెను. ఇలా పక్షి స్థావరాలు ఏర్పాటు చేయడం వలన పంటను నష్టం చేసే శత్రు పురుగులును పక్షులు తిని పంట ఆరోగ్యంగా పెరిగేలా తోడ్పడతాయి. మరింత సమాచారం కోసం 8500983300 ఈ నంబర్ కు కాల్ చేయండి.

33-2022(19-08-22)Vempalli Farm Advisory

వేంపల్లె మండలం లో రాగల మరో 5 రోజుల యొక్క వాతావరణ సూచన – గరిష్ట ఉష్ణోగ్రత -36 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీలు గా వుండే అవకాశం వుంది. రాగల మరో 5 రోజుల్లో 2 ᵐᵐ వర్షపాతం ఉండును. గాలిలో తేమ 62%, అలాగే గంటకి 6 కి.మి. వేగంతో పడమర దిశ గ గాలులు వీయవచ్చును .
టివి పల్లె క్లస్టర్ లోనీ కుప్పలపల్లి , వెలమవారిపల్లి , బక్కన్నగారిపల్లి గ్రామాలలో ప్రధాన పంట అయినటువంటి పత్తి పంట లో రసం పీల్చు పురుగు ల నివారించుటకు ఒక ఎకరానికి 25 నుండి 30 వరకు పసుపు జిగురు పల్లెములు పెట్టాలి. ఆ తరువాత వావిలకు కషాయం 5 లిటర్స్ ను 100 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి..ఈ విధంగ చేయడం వలన పురుగుల ఉదృతి నివారణ అవుతుంది. పత్తి లో పేను బంక నివారణకై నీటిని స్ప్రే చేయండి. అలాగే పత్తి పంట లో గులాబీ రంగు పురుగు ఉధృతి ని గమనించుట కొరకై ఒక ఎకరా పొలం లో లింగ కర్షక బట్టలు 8 నుండి 10 పెట్టుకోవాలి. పురుగులను అదుపులో ఉంచుటకు పంట చుట్టూ ముందు జాగ్రత్తగా బార్డర్ క్రాప్ గా జొన్న, సజ్జ, అంతర పంటలుగా కంది, మటిక, బెండ, అలసంద , అనప ఎర పంటగా ఆముదం వేసుకోవాలి. ఇలా అన్ని రకాల పంటలు వేసుకోవడం వలన మిత్ర పురుగుల సంతతి పెరిగి పురుగులు,తెగుళ్లను నివారించు కోవచ్చు.